తెలంగాణలో నిర్లక్ష్యానికి గురైన సాగునీటి పథకాలను వేగవంతం చేసి ప్రతి ఎకరాకు నీరందించేందుకు సీఎం కేసీఆర్ అపర భగీరథుడిలా కృషి చేస్తున్నారని...
మంత్రి జోగు రామన్న
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో నిర్లక్ష్యానికి గురైన సాగునీటి పథకాలను వేగవంతం చేసి ప్రతి ఎకరాకు నీరందించేందుకు సీఎం కేసీఆర్ అపర భగీరథుడిలా కృషి చేస్తున్నారని అటవీ మంత్రి జోగు రామన్న కొనియాడారు. గోదావరిపై బ్యారేజీల నిర్మాణంతో కోటి ఎకరాలకు సాగునీరు అందించేందుకు సీఎం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. గోదావరి నదిపై బ్యారేజీల నిర్మాణాల కోసం సీఎం కేసీఆర్, నీటిపారుదల మంత్రి హరీశ్‌రావు, ఉన్నతాధికారుల బృందం ఈనెల 7న ముంబైకి వెళ్లనున్నారనీ, 8న మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌తో ఒప్పందాలు చేసుకోబోతున్నారనీ తెలిపారు. అన్ని రంగాల్లో వెనుకబడ్డ ఆదిలాబాద్ జిల్లాలో సాగు, తాగునీటి సౌకర్యాలను కల్పించేందుకు సీఎం కేసీఆర్ చేస్తున్న కృషి అమోఘమన్నారు.