రూ. 2 లక్షల కోట్ల అవినీతికి తెర లేపిన కేసీఆర్ | mallu bhatti vikramarka takes on kcr | Sakshi
Sakshi News home page

రూ. 2 లక్షల కోట్ల అవినీతికి తెర లేపిన కేసీఆర్

Jun 22 2016 11:28 AM | Updated on Oct 8 2018 9:21 PM

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశ పెట్టిన పథకాలపై టి.పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం. భట్టి విక్రమార్క నిప్పులు చెరిగారు.

కరీంనగర్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశ పెట్టిన పథకాలపై టి.పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క నిప్పులు చెరిగారు. బుధవారం హైదరాబాద్లో మల్లు భట్టివిక్రమార్క విలేకర్లతో మాట్లాడుతూ... కేసీఆర్ ప్రవేశ పెట్టిన పథకాలు రాబోయే రోజుల్లో స్కాంలుగా మారనున్నాయని జోస్యం చేప్పారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయతో రూ. 2 లక్షల కోట్ల అవినీతికి కేసీఆర్ తెర లేపారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి పార్టీ అభివృద్ధికే నిధులు వినియోగిస్తున్నారని భట్టి విమర్శించారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement