'ఆదివాసీలు, గిరిజనుల పొట్టకొట్టొద్దు' | Konda raghava reddy slams TRS leaders | Sakshi
Sakshi News home page

'ఆదివాసీలు, గిరిజనుల పొట్టకొట్టొద్దు'

Sep 14 2016 4:57 PM | Updated on Sep 4 2017 1:29 PM

'ఆదివాసీలు, గిరిజనుల పొట్టకొట్టొద్దు'

'ఆదివాసీలు, గిరిజనుల పొట్టకొట్టొద్దు'

ఆదివాసీలు, గిరిజనుల పొట్టకొట్టొద్దు' అని వైఎస్‌ఆర్‌సీపీ నేత కొండా రాఘవరెడ్డి ధ్వజమెత్తారు.

హైదరాబాద్‌: ఆదివాసీలు, గిరిజనుల పొట్టకొట్టొద్దు' అని తెలంగాణ వైఎస్‌ఆర్‌సీపీ నేత కొండా రాఘవరెడ్డి ధ్వజమెత్తారు. బుధవారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. ఆదివాసీల పోడు భూములపై ప్రభుత్వ పెద్దలు, టీఆర్‌ఎస్‌ నేతలు కన్నేయడం దారణమన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్‌ హయాంలో గిరిజనులు, ఆదివాసీలకు హక్కు పత్రాలు ఇచ్చారని గుర్తు చేశారు.

గిరిజనులు, ఆదివాసీలకు ఇచ్చిన పోడు భూములను ఇప్పుడు టీఆర్‌ఎస్‌ నేతలకు లీజుకు ఇస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు. ఆదివాసీల జీవనోపాధిని దెబ్బదీయొద్దని చెప్పారు. బంగారు తెలంగాణ అంటే ఇదేనా? అని కొండా రాఘవరెడ్డి ప్రశ్నించారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement