'సంక్రాంతి సెలవుల్లో గ్రేటర్ ఎన్నికలు పెడితే సహించం' | Kishan reddy warns TRS govt not to announce Greater elections in Sankranthi holidays | Sakshi
Sakshi News home page

'సంక్రాంతి సెలవుల్లో గ్రేటర్ ఎన్నికలు పెడితే సహించం'

Dec 15 2015 1:28 PM | Updated on Sep 3 2017 2:03 PM

'సంక్రాంతి సెలవుల్లో గ్రేటర్ ఎన్నికలు పెడితే సహించం'

'సంక్రాంతి సెలవుల్లో గ్రేటర్ ఎన్నికలు పెడితే సహించం'

సంక్రాంతి సెలవుల్లో గ్రేటర్ ఎన్నికలు పెడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి హెచ్చరించారు.

హైదరాబాద్: సంక్రాంతి సెలవుల్లో గ్రేటర్ ఎన్నికలు పెడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని, తాము సహించేది లేదని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి హెచ్చరించారు. డబుల్ బెడ్ రూం ఇళ్లు ఏ నియోజకవర్గానికి ఎన్ని ఇచ్చారో  టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ.. గ్రేటర్లో ఎలాగైనా గెలవాలన్న ధ్యేయంతో టీఆర్ఎస్ పార్టీ తప్పుడు కార్యక్రమాలను చేస్తోందని మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వంపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తామన్నారు. రాష్ట్రం ఫిరాయింపుల తెలంగాణగా మారిపోయిందని కిషన్ రెడ్డి విమర్శించారు.

Advertisement
 
Advertisement
Advertisement