'అందులో చంద్రబాబు విషం ఉంది' | kapu leaders takes on cm chandrababu naidu | Sakshi
Sakshi News home page

'అందులో చంద్రబాబు విషం ఉంది'

Jun 16 2016 5:22 PM | Updated on Aug 14 2018 11:26 AM

'అందులో చంద్రబాబు విషం ఉంది' - Sakshi

'అందులో చంద్రబాబు విషం ఉంది'

ముద్రగడ పద్మనాభం కుటుంబ సభ్యులపై జరిగిన దాడిని ఖండిస్తున్నామని పలువురు కాపు నేతలు అన్నారు.

హైదరాబాద్: ముద్రగడ పద్మనాభం కుటుంబ సభ్యులపై జరిగిన దాడిని ఖండిస్తున్నామని పలువురు కాపు నేతలు అన్నారు. గురువారం ముద్రగడ పద్మనాభం దీక్షకు సంబంధించి ప్రముఖ దర్శకుడు దాసరి నారయణరావు ఇంట్లో కాపు నేతలు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్, డీఐజీ ఇచ్చిన హామీలను వెంటనే అమలుచేయాలని డిమాండ్ చేశారు.

కలెక్టర్ ప్రకటన తర్వాత మంత్రులు మాట్లాడిన తీరు అనుమానాస్పదంగా ఉందని చెప్పారు. కాపు మంత్రుల ప్రకటన వెనుక చంద్రబాబు విషపూరిత చర్య ఉందని అనుమానం కలుగుతోందన్నారు. గతంలో మాదిరిగా చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ముద్రగడ కుటుంబానికి జరిగిన అవమానం మొత్తం కాపు జాతికి జరిగిన అవమానంగా భావిస్తున్నామని చెప్పారు.
 

Advertisement
 
Advertisement
Advertisement