వచ్చే వారంలో హైదరాబాద్‌కు కన్హయ్య | Kanhaya to Hyderabad next week | Sakshi
Sakshi News home page

వచ్చే వారంలో హైదరాబాద్‌కు కన్హయ్య

Mar 19 2016 4:56 AM | Updated on Mar 29 2019 9:04 PM

జేఎన్‌యూ విద్యార్థి సంఘం నేత కన్హయ్య కుమార్ ఈ నెల 22న లేదా 24న హైదరాబాద్‌కు రానున్నారు.

బీజేపీ కుట్రలను ఎదుర్కొనేందుకు సభలు: చాడ

 సాక్షి, హైదరాబాద్: జేఎన్‌యూ విద్యార్థి సంఘం నేత కన్హయ్య కుమార్ ఈ నెల 22న లేదా 24న హైదరాబాద్‌కు రానున్నారు. రోహిత్ వేముల తల్లిని పరామర్శించిన అనంతరం నగరంలో నిర్వహించే బహిరంగ సభ, హెచ్‌సీయూలో జరిగే సమావేశాల్లో పాల్గొననున్నారు. ఈ విషయాన్ని సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి వెల్లడించారు. వామపక్ష, ప్రజాతంత్ర శక్తులను బలహీనపరిచేందుకు బీజేపీ ప్రభుత్వం కుట్రలకు దిగుతోందని విమర్శించారు.

ఈ కుట్రలను ఎదుర్కొనేందుకు సమావేశాలను నిర్వహిస్తున్నట్లు, దీనిలో భాగంగా నిర్వహిస్తున్న బహిరంగ సభలో కన్హయ్య పాల్గొంటారని తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లోని మఖ్దూంభవన్‌లో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశం తీసుకున్న నిర్ణయాలను పార్టీ నాయకులు పల్లా వెంకటరెడ్డి, జి.మల్లేష్‌లతో కలసి ఆయన విలేకరులకు తెలిపారు. రాష్ర్టంలో పార్టీని బలోపేతం చేయడంలో భాగంగా మరో వెయ్యి గ్రామాలకు పార్టీని విస్తరించనున్నట్లు తెలియజేశారు.

Advertisement
 
Advertisement
Advertisement