ఉస్మానియా ఆస్పత్రిలో జూనియర్ వైద్యులు తమ ఆందోళనను రెండో రోజు కూడా కొనసాగిస్తున్నారు.
రెండో రోజు జూనియర్ డాక్టర్ల ఆందోళన
Aug 1 2017 12:21 PM | Updated on Sep 11 2017 11:01 PM
హైదరాబాద్: ఉస్మానియా ఆస్పత్రిలో జూనియర్ వైద్యులు తమ ఆందోళనను రెండో రోజు కూడా కొనసాగిస్తున్నారు. రోగి బంధువులు ఆదివారం రాత్రి ఓ జూనియర్ డాక్టర్‌పై దాడి చేశారంటూ జూనియర్ వైద్యులు సోమవారం ఉదయం నుంచి ఆందోళనకు దిగారు. తమ డిమాండ్లు పరిష్కరించే వరకు వైద్య సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.
ఆస్పత్రి సూపరింటెండెంట్ వారితో సోమవారం చర్చలు జరిపినప్పటికీ జూనియర్ డాక్టర్లు తమ పట్టు వదల్లేదు. దీంతో వారి డిమాండ్లపై కమిటీ వేశారు. కమిటీ నివేదిక గురువారం వచ్చే అవకాశముండగా.. నివేదికలోని అంశాలను చూసిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని జూనియర్ వైద్యుల సంఘం అధ్యక్షుడు అభిషేక్ తెలిపారు.
Advertisement
Advertisement