ప్రతీ అమ్మాయి కోసం గాలిపటాన్ని ఎగరేద్దాం! | International kite festival will start from tomorrow | Sakshi
Sakshi News home page

ప్రతీ అమ్మాయి కోసం గాలిపటాన్ని ఎగరేద్దాం!

Jan 11 2017 6:17 PM | Updated on Jul 6 2018 3:32 PM

ప్రతీ అమ్మాయి కోసం గాలిపటాన్ని ఎగరేద్దాం! - Sakshi

ప్రతీ అమ్మాయి కోసం గాలిపటాన్ని ఎగరేద్దాం!

సంక్రాంతి పండుగ సందర్బంగా గురువారం నుంచి ఆరు రోజుల పాటు నిర్వహించే రెండో అంతర్జాతీయ పతంగుల పండుగకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది.

  • పతంగుల పండుగకు సర్వంసిద్ధం

  • సాక్షి, హైదరాబాద్‌: సంక్రాంతి పండుగ సందర్బంగా గురువారం నుంచి ఆరు రోజుల పాటు నిర్వహించే రెండో అంతర్జాతీయ పతంగుల పండుగకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. అమ్మాయిల చదువు, సాధికారతపై అవగాహన పెంపొందించడంలో భాగంగా నిర్వహించనున్న ఈ పండుగను వీక్షించడానికి 50,000 మంది ప్రేక్షకులు వస్తారని అంచనా. 17 దేశాల నుంచి 70 అంతర్జాతీయ కైట్ ఫ్లయర్స్‌, మనదేశం నుంచి 40 జాతీయ మంది కైట్‌ ఫ్లయర్స్‌ ఈ వేడుకల్లో పాల్గొంటారని రాష్ట్ర పర్యాటక శాఖ తెలిపింది. పీపుల్స్‌ ప్లాజాలో గురువారం జరిగే ప్రత్యేక కైట్‌ ఫ్లయింగ్‌ కార్యక్రమంతో ఈ వేడుకలు ప్రారంభం కానున్నాయి.

    ఆగాఖాన్‌ అకాడమీలో  ఈ నెల 13, 14,15 తేదీల్లో ‘ఆకాశాన్ని రంగుల మయం చేద్దాం- ప్రతీ అమ్మాయి కోసం గాలిపటాన్ని ఎగరేద్దాం’అనే నినాదంతో ప్రధాన వేడుకలు జరుగుతాయి. యాదగిరి, వరంగల్‌ జిల్లాల్లో ఈ నెల 16, 17 తేదీల్లో పతంగుల పండుగ జరుగుతుంది. రాబోయే అయిదేళ్లలో పతంగుల పండుగను రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకునేలా చర్యలు తీసుకోనున్నట్లు పర్యాటక శాఖ తన ప్రకటనలో తెలిపింది.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement