హైదరాబాద్ను ప్రపంచపటంలో పెట్టింది తానేనని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. తొమ్మిదేళ్లలో సైబరాబాద్ నగరాన్ని నిర్మించామని చెప్పారు.
హైదరాబాద్: హైదరాబాద్ను ప్రపంచపటంలో పెట్టింది తానేనని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. తొమ్మిదేళ్లలో సైబరాబాద్ నగరాన్ని నిర్మించామని చెప్పారు. హైదరాబాద్ చుట్టూ రింగ్ రోడ్డు నిర్మాణం బీజేపీ-టీడీపీ ఘనతే అని ఆయన చెప్పారు. మంగళవారం సాయంత్రం నిజాం కాలేజీ గ్రౌండ్ లో బీజేపీ, టీడీపీ సంయుక్తంగా నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కేంద్రమంత్రి దత్తాత్రేయ, టీడీపీ నేత రేవంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈసందర్భంగా వారు తమతమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. కేంద్రమంత్రి దత్తాత్రేయ మాట్లాడుతూ కేంద్రం సాయంతోనే హైదరాబాద్ అభివృద్ధి జరిగిందని అన్నారు. కేంద్రం నిధులిస్తున్నా టీఆరెఎస్ చెప్పడం లేదని అన్నారు. ఇక రేవంత్ రెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ కు వంద సీట్లు వస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పారు.