హైదరాబాద్ వివిధ సంస్కృతుల సమ్మేళనమని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు.
హైదరాబాద్ : హైదరాబాద్ వివిధ సంస్కృతుల సమ్మేళనమని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్.విద్యాసాగర్రావు రచించిన 'ఉనికి' పుస్తకం ఆవిష్కరణ రాష్ట్రపతి ప్రణబ్ చేతుల మీదగా జరిగింది. హెచ్ఐసీసీలో శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమంలో ప్రణబ్ మాట్లాడుతూ హైదరాబాద్ నగరమంటే తెలుగువారికే కాదని, దేశమంతా ఇష్టమేనన్నారు. దేశాభివృద్ధికి రాష్ట్రీయ సంబంధాలు బలపడాల్సిన అవసరం ఉందన్నారు. తగాదాలు రెండు రాష్ట్రాల అభివృద్ధికి అవరోధమని ప్రణబ్ వ్యాఖ్యానించారు. రెండు తెలుగు రాష్ట్రాలు కలిసి అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు.