గృహిణి ఆత్మహత్య | house wife suicide in hyderabad | Sakshi
Sakshi News home page

గృహిణి ఆత్మహత్య

Feb 26 2015 5:32 PM | Updated on Nov 6 2018 7:56 PM

అత్తింటి వేధింపులు తాళలేక ఓ గృహిణి ఆత్మహత్య చేసుకుంది.

హైదరాబాద్ క్రైం: అత్తింటి వేధింపులు తాళలేక ఓ గృహిణి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన హైదరాబాద్ నగరంలోని లాలగూడ పరిధిలోని విజయపురికాలనిలో గురువారం చోటుచేసుకుంది. కాలనీకి చెందిన ఎం. గాయత్రి గురువారం ఉదయం వెంట్రుకలు నల్లగా మారడానికి ఉపయోగపడే నూనె తాగి ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె ఇంట్లో సూసైడ్ లెటర్ దొరికింది.

పెళ్లయినప్పటినుంచే అత్తింటి వాళ్లు వేధిస్తున్నారని, తాజాగా తనకూతురికి తనమీద లేనిపోనివి చెబుతున్నారని, భర్తతో పాటు అత్తమామలు ఆడబిడ్డ వేధింపుల వల్లే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లెటర్‌లో పేర్కొంది. గాయత్రి (38) కి లీలాప్రసాద్‌తో18 ఏళ్ల క్రితం ప్రేమ వివాహమైంది. వారికి పదోతరగతి చదువుతున్న కూతురు ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement