ఒరిజినల్ రికార్డులు కోర్టు ముందుంచండి | High court Order to police | Sakshi
Sakshi News home page

ఒరిజినల్ రికార్డులు కోర్టు ముందుంచండి

Feb 17 2016 11:59 PM | Updated on Aug 31 2018 8:24 PM

హెచ్‌సీయూ విద్యార్థి రోహిత్ ఆత్మహత్య నేపథ్యంలో నమోదైన కేసుకు సంబంధించిన ఒరిజినల్ రికార్డులన్నింటినీ తమ ముందుంచాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది.

‘రోహిత్’ కేసులో పోలీసులకు హైకోర్టు ఆదేశం
జిరాక్స్ ప్రతులు ఇవ్వడంపై ఆగ్రహం.. విచారణ 24కు వాయిదా

 
 సాక్షి, హైదరాబాద్: హెచ్‌సీయూ విద్యార్థి రోహిత్ ఆత్మహత్య నేపథ్యంలో నమోదైన కేసుకు సంబంధించిన ఒరిజినల్ రికార్డులన్నింటినీ తమ ముందుంచాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. గతంలోనే ఈ విషయాన్ని చెప్పినా జిరాక్స్ ప్రతులను తమ ముందుంచడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ విచారణను ఈనెల 24కు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.

రోహిత్ ఆత్మహత్య నేపథ్యంలో తనపై నమోదైన ఎస్సీ, ఎస్టీ కేసును కొట్టివేయాలని కోరుతూ హెచ్‌సీయూ వైస్ చాన్స్‌లర్ అప్పారావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఆ వ్యాజ్యంపై ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఒరిజినల్ రికార్డులు సమర్పించకపోవడంతో కోర్టు పైవిధంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. అనంతరం రోహిత్ ఆత్మహత్య లేఖను ఎందుకు ఇవ్వలేదని న్యాయమూర్తి ప్రశ్నించారు. అయితే అది ఫోరెన్సిక్ ల్యాబ్ వద్ద ఉందని ఏజీపీ చెప్పడంతో... తదుపరి విచారణకు ఒరిజినల్ రికార్డులను తమ ముందుంచాలని ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement