
వారికి పెరిగిన వేతనం అందేలా చూడండి
సర్వశిక్షా అభియాన్‌లో పార్ట్‌టైం బోధకులుగా పనిచేస్తూ కోర్టునాశ్రయించిన వారికి పెరిగిన గౌరవ వేతనం అందేలా చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ
సర్వశిక్షా అభియాన్ పార్ట్‌టైం బోధకుల వేతనంపై హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: సర్వశిక్షా అభియాన్‌లో పార్ట్‌టైం బోధకులుగా పనిచేస్తూ కోర్టునాశ్రయించిన వారికి పెరిగిన గౌరవ వేతనం అందేలా చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి, సర్వశిక్షా అభి యాన్ డైరెక్టర్‌ను ఉమ్మడి హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు న్యాయ మూర్తి జస్టిస్ పి.నవీన్‌రావు ఇటీవల మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఈ వ్యవహారానికి సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలన్నారు. సర్వశిక్షా అభియాన్ పార్ట్‌టైం బోధకుల గౌరవ వేతనాన్ని కేంద్రం రూ.12వేలకు పెంచిందని, దాన్ని తమకు వర్తింప జేయాలని కోరుతూ వరంగల్‌కు చెందిన రాజు, మరో 24 మంది హైకోర్టును ఆశ్రయించారు. వాదనలు విన్న న్యాయమూర్తి ఈ మేరకు తీర్పునిచ్చారు.
పూర్తిస్థాయి సీజేను నియమించాలి
హైకోర్టు సీనియర్ న్యాయవాది సత్యంరెడ్డి పిల్
ఉమ్మడి హైకోర్టుకు పూర్తిస్థాయి ప్రధాన న్యాయమూర్తి (సీజే)ని నియమించకపోవడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. అలాగే హైకోర్టులో ఖాళీగా ఉన్న న్యాయమూర్తుల పోస్టు లనూ భర్తీ చేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ సీనియర్ న్యాయ వాది సరసాని సత్యంరెడ్డి ఈ వ్యాజ్యాన్ని వేశారు. దీనికి నం బర్ కేటాయించాలా? వద్దా? అన్న విషయంపై న్యాయమూ ర్తులు జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ జె.ఉమాదేవితో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. వాదనలు విన్న ధర్మాసనం... ఈ వ్యాజ్యానికి నంబర్ కేటాయించాలని ఆదేశాలిచ్చింది.