ఆటో, సెప్టిక్ ట్యాంక్ ఢీ, ఒకరు మృతి | Heavy vehicle hits auto rickshaw, one died | Sakshi
Sakshi News home page

ఆటో, సెప్టిక్ ట్యాంక్ ఢీ, ఒకరు మృతి

Dec 4 2016 10:37 AM | Updated on Aug 30 2018 4:07 PM

నగరంలోని మాదాపూర్‌లో ఆదివారం ఉదయం జరిగిన రోడ్డుప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.

హైదరాబాద్: నగరంలోని మాదాపూర్‌లో ఆదివారం ఉదయం జరిగిన రోడ్డుప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మాదాపూర్ డీమార్ట్ సమీపంలోని చౌరస్తావద్ద ప్రయాణికులతో వెళుతున్న ఆటోను వెనుక నుంచి వేగంగా వచ్చిన సెప్టిక్ ట్యాంక్ వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తి మృతిచెందాడు.
 
ఆటో డ్రైవర్ మహేష్ సహా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మాదాపూర్ పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు సెప్టిక్ ట్యాంక్ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. 

Advertisement
 
Advertisement
Advertisement