దుర్గం చెరువు వద్ద హ్యాంగింగ్ బ్రిడ్జి | hanging bridge at the durgam pond | Sakshi
Sakshi News home page

దుర్గం చెరువు వద్ద హ్యాంగింగ్ బ్రిడ్జి

Nov 23 2014 2:31 AM | Updated on Sep 2 2017 4:56 PM

దుర్గం చెరువు వద్ద హ్యాంగింగ్ బ్రిడ్జి

దుర్గం చెరువు వద్ద హ్యాంగింగ్ బ్రిడ్జి

దుర్గం చెరువును పర్యాటకపరంగా అభివృద్ధి చేస్తామని, చెరువు వద్ద త్వరలో హ్యాంగింగ్ బ్రిడ్జి ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు.

నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు వెల్లడి

హైదరాబాద్: దుర్గం చెరువును పర్యాటకపరంగా అభివృద్ధి చేస్తామని, చెరువు వద్ద త్వరలో హ్యాంగింగ్ బ్రిడ్జి ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. మాదాపూర్‌లోని నెక్టార్ గార్డెన్, దుర్గం చెరువును ఆయన శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా నెక్టార్ గార్డెన్ అసోసియేషన్ హాల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ దుర్గం చెరువులో ఉన్న గుర్ర పు డెక్కను వారం రోజులలో తొలగించటంతోపాటు చెరువు గట్టును ఆరు నెలల్లో పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొన్నారు. అలాగే మురుగునీటి శుద్ధి ప్లాంట్(ఎస్టీపీ)ను కూడా త్వరలోనే ఏర్పాటు చేస్తామన్నారు.

ఈ సందర్భంగా దుర్గం చెరువు అభివృద్ధికి చేపట్టే చర్యలపై నివేదిక రూపొందించేందుకు అయిదు శాఖలతో కూడిన కమిటీని ప్రకటించారు. వారం రోజుల్లో సవివరమైన నివేదికను అందించాలని కమిటీని మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. ఆయన వెంట రాష్ట్ర మంత్రి మహేందర్‌రెడ్డి, ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఆంధోల్ ఎమ్మెల్యే బాబూమోహన్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేష్‌కుమార్, జీహెచ్‌ఎంసీ, నీటిపారుదల శాఖ అధికారులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement