తిరుపతి వెళ్లి వచ్చేసరికి ఇంట్లో ఉన్నదంతా దొంగలు ఊడ్చుకెళ్లిన ఘటన కేపీహెచ్‌బీ పోలీసు స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది.
మలేషియా టౌన్‌షిప్(కేపీహెచ్ బీ): తిరుపతి వెళ్లి వచ్చేసరికి ఇంట్లో ఉన్నదంతా దొంగలు ఊడ్చుకెళ్లిన ఘటన కేపీహెచ్‌బీ పోలీసు స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. ఎస్సై రాందాస్ తెలిపిన వివరాల ప్రకారం.. కేపీహెచ్‌బీ కాలనీ తొమ్మిదో ఫేజ్‌కు చెందిన రవీంద్ర ఈ నెల 6న కుటుంబ సమేతంగా దైవదర్శనం కోసం తిరుపతికి బయలుదేరారు.
సోమవారం ఉదయం పేపర్ బాయ్ పేపర్ వేసే క్రమంలో ఇంటి తాళాలు పగులగొట్టి ఉండటాన్ని గమనించి రవీంద్రకు ఫోన్‌ద్వారా సమాచారం అందజేశాడు. సోమవారం రాత్రి తిరుపతి నుంచి తన నివాసానికి చేరుకున్న రవీంద్ర ఇంట్లో పరిశీలించగా సుమారు ఏడు తులాల బంగారు నగలు, రూ.11 వేల నగదు కనిపించలేదు. గుర్తు తెలియని దుండగులు సొత్తును అపహరించుకుపోయారని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.