కన్న కూతురిపై తండ్రి లైంగిక దాడి | Father who repeatedly raped his 16 years old daughter gets remand | Sakshi
Sakshi News home page

కన్న కూతురిపై తండ్రి లైంగిక దాడి

Oct 20 2016 7:00 PM | Updated on Jul 28 2018 8:53 PM

కన్న కూతురిపై అత్యాచారానికి ఒడిగట్టి గర్భవతిని చేసిన ఓ ప్రబుద్దుడిని పహాడీషరీఫ్ పోలీసులు అరెస్ట్ చేసి గురువారం రిమాండ్‌కు తరలించారు.

- ప్రస్తుతం బాలిక ఏడో నెల గర్భిణి

పహాడీషరీఫ్: కన్న కూతురిపై అత్యాచారానికి ఒడిగట్టి గర్భవతిని చేసిన ఓ ప్రబుద్దుడిని పహాడీషరీఫ్ పోలీసులు అరెస్ట్ చేసి గురువారం రిమాండ్‌కు తరలించారు. పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్‌లో గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇన్‌స్పెక్టర్ వి.వి.చలపతి తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిషా రాష్ట్రానికి చెందిన నిరంజన్ బేరా(35) పదేళ్ల క్రితం భార్య, ముగ్గురు పిల్లలతో కలిసి జల్‌పల్లిలోని గ్రీన్ సిటీలో నివాసం ఉంటున్నాడు. నిరంజన్ దంపతులతో పాటు అతని పెద్ద కూతురు(16) కూడా లేబర్ పనికి వెళుతుంది. ఈ క్రమంలోనే ఏడు నెలల క్రితం కూతురు ఒక రోజు పనికి వెళ్లినచోట అలసి మధ్యలోనే ఇంటికి చేరుకొని గాఢ నిద్రలోకి జారుకుంది. ఇదే అదునుగా భావించిన నిందితుడు కూతురిపై అత్యాచారానికి ఒడిగట్టాడు.

ఏం జరిగిందో అర్థం కాక కూతురు అయోమయంలోనే ఉండి పోయింది. మరి కొన్నిరోజులకు అందరూ నిద్రిస్తున్న సమయంలో మరోసారి లైంగిక దాడికి పాల్పడ్డాడు. మూడోసారి అఘాయిత్యానికి పాల్పడినప్పుడు కూతురు ఒంటిపై వస్త్రాలు లేకుండా పోయాయి. అప్పుడు గమనించిన కూతురు విషయాన్ని తన తల్లికి తెలిపింది. భర్తను నిలదీయడంతో ఎవరికైనా చెపితే చంపేస్తానంటూ హెచ్చరించాడు. ఇంతలో బాధితురాలు గర్భం దాల్చింది. మొదట్లో కడుపునొప్పిగా భావించిన కుటుంబ సభ్యులు అనంతరం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా గర్భవతి అని తేలింది. ఆ సమయంలో కూడా నిందితుడు ఎవరికి చెప్పినా చంపుతానంటూ బెదిరించాడు. ప్రస్తుతం సదరు బాలిక ఏడో నెల గర్భవతి. ఈ విషయాన్ని గమనించిన ఇంటి యజమాని పహాడీషరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితున్ని అరెస్ట్ చేసి గురువారం రిమాండ్‌కు తరలించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement