‘అంతరాత్మను చంపుకొని ఎందుకన్నా మాట్లాడుతున్నవ్..? బడ్జెట్ కేటాయింపులు, లెక్కలపై వివరణ మనస్ఫూర్తిగానే ఇచ్చారా?’ అని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్
సాక్షి, హైదరాబాద్: ‘అంతరాత్మను చంపుకొని ఎందుకన్నా మాట్లాడుతున్నవ్..? బడ్జెట్ కేటాయింపులు, లెక్కలపై వివరణ మనస్ఫూర్తిగానే ఇచ్చారా?’ అని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ను పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క ప్రశ్నించారు. టీ విరామానికి అసెంబ్లీ వాయిదాపడ్డ తర్వాత ఈటల, భట్టి పరస్పరం ఎదురుపడ్డారు.
‘బలహీనవర్గాలకు ప్రతినిధిగా బడ్జెట్‌ను మూడోసారి ప్రవేశపెట్టే అవకాశం దక్కినందుకు అభినందిస్తున్నా’ అని ఈటలతో భట్టి వ్యాఖ్యానించారు. దీనికి ఈటల నవ్వుతూ ‘బడ్జెట్‌లో సంక్షేమానికి, అభివృద్ధికి ఎంతో ప్రాధాన్యమిచ్చాం. బడ్జెట్ చాలాబాగున్నందుకు కూడా అభినందించాల్సిందే’ అని బదులిచ్చారు. ‘లెక్కలు ఎంత అబద్ధాలో అందరికీ అర్థం అవుతున్నాయి. మా ప్రశ్నలు, అనుమానాలకు వివరణలు ఇవ్వడానికి మీ అంతరాత్మ ఒప్పుకొందా.. మీ మాటలు మనసులోంచి రావట్లేదు. అంతరాత్మను చంపుకొని మాట్లాడుతున్నట్లు మిమ్మల్ని చూస్తేనే అర్థమైంది’ అని భట్టి అనగానే ఏమీ మాట్లాడకుండా ఈటల వెళ్లిపోయారు.