ప్రయాణికుడికి గుండెపోటు... విమానం అత్యవసర ల్యాండింగ్ | Emergency landing after passenger suffers mid-air heart attack | Sakshi
Sakshi News home page

ప్రయాణికుడికి గుండెపోటు... విమానం అత్యవసర ల్యాండింగ్

Sep 18 2014 9:05 AM | Updated on Sep 2 2017 1:35 PM

ప్రయాణికుడికి గుండెపోటు... విమానం అత్యవసర ల్యాండింగ్

ప్రయాణికుడికి గుండెపోటు... విమానం అత్యవసర ల్యాండింగ్

దుబాయి నుంచి సింగపూర్ వెళ్తున్న ఎమిరేట్స్ విమానం గురువారం శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అత్యవసరంగా ల్యాండ్ అయింది.

హైదరాబాద్ : దుబాయి నుంచి సింగపూర్ వెళ్తున్న ఎమిరేట్స్ విమానం గురువారం శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అత్యవసరంగా ల్యాండ్ అయింది. విమానంలోని ఓ ప్రయాణికుడికి అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. దీంతో సదరు ప్రయాణికుడు విమానంలోని సిబ్బందికి తెలియజేశాడు.

సిబ్బంది వెంటనే అప్రమత్తమైన శంషాబాద్ ఎయిర్పోర్టు అధికారులను సంప్రదించి ... ప్రయాణికుడి పరిస్థితిని వివరించారు.  ఎయిర్పోర్ట్ అధికారులు సానుకూలంగా స్పందించారు. దాంతో విమానం అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఎయిర్పోర్ట్లో అప్పటికే సిద్దంగా ఉన్న అంబులెన్స్లో ప్రయాణికుడిని హుటాహుటిన అపోలో ఆస్పత్రికి తరలించారు. అనంతరం విమానం సింగపూర్ బయలుదేరింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement