తెలుగు రాష్ట్రాల్లో పుష్కరాలకు పోటెత్తిన భక్తులు | devotee heavy rush in krishna pushkaralu | Sakshi
Sakshi News home page

తెలుగు రాష్ట్రాల్లో పుష్కరాలకు పోటెత్తిన భక్తులు

Aug 19 2016 7:21 AM | Updated on Sep 4 2017 9:58 AM

తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా పుష్కరాలు శుక్రవారం ఎనిమిదో రోజుకు చేరుకున్నాయి.

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా పుష్కరాలు శుక్రవారం ఎనిమిదో రోజుకు చేరుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లాలోని విజయవాడలో పద్మావతి, వేదాద్రిలోని ఘాట్లలో భక్తుల రద్దీ పెరిగింది. గుంటూరు జిల్లాలోని అమరావతి, సీతానగరం ఘాట్లలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. కర్నూలు జిల్లా సంగమేశ్వరం, పాతాళగంగ ఘాట్లో భక్తులు పోటెత్తారు.

అలాగే తెలంగాణలోని మట్టపల్లి, వాడపల్లి, నాగార్జునసాగర్లోని ఘాట్లలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. మహబూబ్నగర్ జిల్లా బీచుపల్లి, గొందిమళ్ల, సోమశిల ఘాట్లలో భక్తులు సంఖ్య భారీగా పెరిగింది.
 

Advertisement
 
Advertisement
Advertisement