'బిచ్చమెత్తుకునే పరిస్థితి పోవాలి' | dattatreya comments on beggers in the city | Sakshi
Sakshi News home page

'బిచ్చమెత్తుకునే పరిస్థితి పోవాలి'

Jan 2 2016 7:21 PM | Updated on Oct 20 2018 5:03 PM

నగరంలో బడుగు జీవులు బిచ్చమెత్తుకుని జీవించే పరిస్థితి అంతం కావాలని, దీని కోసం తగిన చర్యలు తీసుకుంటామని కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు.

హైదరాబాద్: నగరంలో బడుగు జీవులు బిచ్చమెత్తుకుని జీవించే పరిస్థితి అంతం కావాలని, దీని కోసం తగిన చర్యలు తీసుకుంటామని కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. శనివారం చిక్కడపల్లిలో జంట నగరాల వాకర్స్ క్లబ్ అధ్యక్షుడు కందూరి కృష్ణ ఆధ్వర్యంలో 610 మంది పేదలకు దుప్పట్లను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ పేదలను చేరదీసి వారికి సాయం చేయటం అభినందనీయం అన్నారు. హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ పేదల కోసం తమ ప్రభుత్వం అనేక పథకాలను తీసుకొస్తోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ శాసన సబాపక్ష నేత డాక్టర్ కె.లక్ష్మణ్తో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement