రాజయ్య ఖాళీచేసిన ఛాంబర్ డీఎస్కు | d block allocated for telangana government advisor srinivas | Sakshi
Sakshi News home page

రాజయ్య ఖాళీచేసిన ఛాంబర్ డీఎస్కు

Aug 26 2015 2:48 PM | Updated on Sep 3 2017 8:10 AM

రాజయ్య ఖాళీచేసిన ఛాంబర్ డీఎస్కు

రాజయ్య ఖాళీచేసిన ఛాంబర్ డీఎస్కు

మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య ఖాళీ చేసిన ఛాంబర్ నే ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు డి. శ్రీనివాస్ కు కేటాయించారు.

హైదరాబాద్:  తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుగా నియమితులైన టీఆర్ఎస్ నేత డి. శ్రీనివాస్ కు ఎట్టకేలకు ఛాంబర్ కేటాయించారు. సలహాదారుగా నియామకం ఖరారయి పదిరోజులు కావస్తున్నప్పటికీ ఛాంబర్ కేటాయింపులో ఏర్పడిన జాప్యం వల్లే బాధ్యతల స్వీకారానికి ఆయన దూరంగా ఉన్న సంగతి తెలిసిందే.

సచివాలయంలోని డీ బ్లాక్ మొదటి అంతస్తులో డీఎస్ కు పేషీని కేటాయిస్తూ సాధారణ పరిపాలనా శాఖ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది.  గతంలో డిప్యూటీ సీఎంగా పనిచేసి, అవినీతి ఆరోపణల నేపథ్యంలో రాజీనామా చేసిన టి రాజయ్య ఇదే ఛాంబర్ నుంచి విధులు నిర్వర్తించారు, ఛాంబర్ కేటాయింపు ప్రక్రియ పూర్తి కావడంతో శుక్రవారం (ఆగస్టు 28న) డీఎస్ బాధ్యతలు స్వీకరించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement