ఉత్సాహంగా మారథాన్‌ రన్‌.. | CP Mahender reddy Starts Airtel Hyderabad Marathon Run | Sakshi
Sakshi News home page

ఉత్సాహంగా మారథాన్‌ రన్‌..

Aug 20 2017 10:51 AM | Updated on Sep 17 2017 5:45 PM

ఉత్సాహంగా మారథాన్‌ రన్‌..

ఉత్సాహంగా మారథాన్‌ రన్‌..

టెలికం దిగ్గజం ఎయిర్‌టెల్‌ ఆధ్వర్యంలో చేపట్టిన ఫుల్‌ మారథాన్‌, హాఫ్‌ మారథాన్‌ ఆదివారం ఉదయం నెక్లెస్‌రోడ్డులో ప్రారంభమైంది.

హైదరాబాద్‌: టెలికం దిగ్గజం ఎయిర్‌టెల్‌ ఆధ్వర్యంలో చేపట్టిన ఫుల్‌ మారథాన్‌, హాఫ్‌ మారథాన్‌ ఆదివారం ఉదయం నెక్లెస్‌రోడ్డులో ప్రారంభమైంది. నగర పోలీస్‌ కమిషనర్‌ మహేందర్‌రెడ్డి ఫుల్‌ మారథాన్‌ (42కి.మీ)ను ఉదయం 5 గంటలకు ప్రారంభించగా.. హాఫ్‌ మారథాన్‌(21 కి.మీ)ను జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ జనార్ధన్‌రెడ్డి ఆరు గంటలకు  ప్రారంభించారు.
 
ఈ కార్యక్రమంలో పాల్గొన్న వేలాది మంది ఔత్సాహికులు పీపుల్స్‌ ప్లాజా నుంచి ఖైరతాబాద్‌ ఫ్లైఓవర్‌, రాజ్‌భవన్‌ రోడ్‌, రాజీవ్‌ సర్కిల్‌, పంజాగుట్ట, బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌ మీదుగా హైటెక్స్‌ సిటీకి పరుగు తీశారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ.. గ్లోబల్‌ సిటీగా ఎదుగుతున్న నగరంలో ఇలాంటి వాక్‌లు ఎంతో అవసరమన్నారు. ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడం కోసం ప్రతి ఒక్కరూ నడక, పరుగు అలవరుచుకోవాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement