టీఆర్ఎస్ లో చేరిన డీకే అరుణ సోదరుడు | congress mla chittem ram mohan reddy joined in TRS Party | Sakshi
Sakshi News home page

టీఆర్ఎస్ లో చేరిన డీకే అరుణ సోదరుడు

Apr 13 2016 1:53 PM | Updated on Mar 18 2019 8:57 PM

టీఆర్ఎస్ లో చేరిన డీకే అరుణ సోదరుడు - Sakshi

టీఆర్ఎస్ లో చేరిన డీకే అరుణ సోదరుడు

మాజీ మంత్రి డీకే అరుణ సోదరుడు, కాంగ్రెస్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీలో చేరారు.

హైదరాబాద్:  మాజీ మంత్రి డీకే అరుణ సోదరుడు, కాంగ్రెస్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. బుధవారం ఆయన సీఎం క్యాంపు ఆఫీస్ లో తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావును కలసి,,,ఆయన సమక్షంలో  పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ... నియోజకవర్గ అభివృద్ధి కోసమే టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు తెలిపారు. టీఆర్‌ఎస్‌లోకి చేరేందుకు తననెవరూ ఒత్తిడి చేయలేదన్నారు. తన సోదరి డీకే అరుణ రాజకీయం వేరు, తన రాజకీయం వేరని చెప్పారు. డీకే అరుణ టీఆర్ఎస్ లో చేరారని.. కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతారన్నారు. రామ్మోహన్ రెడ్డి మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ ఎమ్మెల్యేగా  ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement