ఆగి ఉన్న సిటీబస్సులో మంటలు | city bus burnt to flames in mehidipatnam | Sakshi
Sakshi News home page

ఆగి ఉన్న సిటీబస్సులో మంటలు

Apr 25 2014 8:27 AM | Updated on Sep 2 2017 6:31 AM

ఆగి ఉన్న సిటీబస్సులో మంటలు

ఆగి ఉన్న సిటీబస్సులో మంటలు

హైదరాబాద్లోని మెహిదీపట్నం ప్రాంతంలో ఓ బస్సులో మంటలు చెలరేగాయి. బస్సు పూర్తిగా దగ్ధమైపోయింది.

హైదరాబాద్లోని మెహిదీపట్నం ప్రాంతంలో ఓ బస్సులో మంటలు చెలరేగాయి. బుధవారం రాత్రి హయత్నగర్ నుంచి వచ్చిన ఓ బస్సు మెహిదీపట్నంలో రాత్రి 10.30 గంటల ప్రాంతంలో ఆగి ఉన్న సమయంలో ఆ బస్సులో ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి. బస్సు పూర్తిగా దగ్ధమైపోయింది. ఈ బస్సు హయత్నగర్ డిపోకు చెందినదిగా గుర్తించారు. సిబ్బంది గుర్తించి అగ్నిమాపక విభాగాన్ని అప్రమత్తం చేసేలోపే మంటలు వ్యాపించాయి. మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సు పూర్తిగా తగలబడిపో్యింది.

అయితే, ఈ ప్రమాదానికి కారణం ఏంటన్న విషయం మాత్రం ఇంకా తెలియరాలేదు. పదే పదే బస్సు ప్రమాదాలు, బస్సులు తగలబడిపోతున్న సంఘటనలు జరుగుతుండటంతో ప్రయాణికులు ఆందోళనకు గురవుతున్నారు. ఎప్పుడేం జరుగుతుందోనని ప్రాణాలు అరిచేతుల్లో పెట్టుకుని ప్రయాణం చేయాల్సి వస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement