‘కేసీఆర్‌కు మతి తప్పినట్లుంది’ | Chinna Reddy Comments on KCR | Sakshi
Sakshi News home page

‘కేసీఆర్‌కు మతి తప్పినట్లుంది’

Jun 16 2016 2:51 PM | Updated on Mar 18 2019 9:02 PM

కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటుకు పూనుకుందని ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించటం చూస్తే..ఆయనకు మతిస్థిమితం లేనట్లు కనబడుతోందని సీనియర్ కాంగ్రెస్ నేత, ఎమ్మెల్యే చిన్నారెడ్డి విమర్శించారు

కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటుకు పూనుకుందని ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించటం చూస్తే..ఆయనకు మతిస్థిమితం లేనట్లు కనబడుతోందని సీనియర్ కాంగ్రెస్ నేత, ఎమ్మెల్యే చిన్నారెడ్డి విమర్శించారు. గురువారం ఆయన హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. ప్రజాస్వామ్య విధానాలపై ఆయనకు ఏమాత్రం నమ్మకం లేదని ఆరోపించారు. ప్రతిపక్షం బలంగా ఉంటేనే పాలకపక్షం పని తీరు బాగుంటుందని ఆయన అన్నారు. అధికార టీఆర్‌ఎస్ తీరును ప్రజలు అసహ్యించుకుంటున్నారని తెలిపారు.

 

Advertisement
 
Advertisement
Advertisement