బ్రిటిష్‌ ఎయిర్‌వేస్‌ విమానాలు రద్దు | British Airways flights canceled | Sakshi
Sakshi News home page

బ్రిటిష్‌ ఎయిర్‌వేస్‌ విమానాలు రద్దు

May 29 2017 1:23 AM | Updated on Sep 5 2017 12:13 PM

బ్రిటిష్‌ ఎయిర్‌వేస్‌ విమానాలు రద్దు

బ్రిటిష్‌ ఎయిర్‌వేస్‌ విమానాలు రద్దు

బ్రిటిష్‌ ఎయిర్‌వేస్‌ వ్యవస్థలోని కంప్యూటర్‌ సాంకేతిక పరిజ్ఞానంలో తలెత్తిన సమస్యల కారణంగా ప్రపంచ వ్యాప్తంగా పలు విమానాలు రద్దయ్యాయి.

శంషాబాద్‌: బ్రిటిష్‌ ఎయిర్‌వేస్‌ వ్యవస్థలోని కంప్యూటర్‌ సాంకేతిక పరిజ్ఞానంలో తలెత్తిన సమస్యల కారణంగా ప్రపంచ వ్యాప్తంగా పలు విమానాలు రద్దయ్యాయి. ఇందులో లండన్‌ హీత్రూ విమానాశ్రయం నుంచి ఆదివారం మధ్యాహ్నం 3.20 గంటలకు బయలుదేరి సోమవారం తెల్లవారుజామున 5.15 గంటల వరకు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకోవాల్సిన బ్రిటిష్‌ ఎయిర్‌వేస్‌ విమానం ఉంది.

సాంకేతిక సమస్య కారణంగా ఆ విమానం రద్దు కావడంతో ఇక్కడి నుంచి ఆదివారం ఉదయం 7.15 గంటలకు బయలుదేరాల్సిన బీఏ 276 విమానం కూడా రద్దయింది. బీఏ 276 విమానం ఇక్కడి నుంచి 7.15 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 1.10 గంటలకు లండన్‌ హీత్రూ విమానాశ్రయానికి చేరుకుంటుంది. ఈ విమానంలో వెళ్లాల్సిన సుమారు 150 మంది ప్రయాణికులు ఆదివారం ఇబ్బందులు పడ్డారు. సోమవారం ఉదయం తిరిగి ఇదే సమయానికి వెళ్లే బ్రిటిష్‌ ఎయిర్‌వేస్‌ విమాన సమయాలు ఇంకా నిర్ధారించలేదు. ప్రయాణికులు తమ వెబ్‌సైట్‌ ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకోవచ్చని బ్రిటిష్‌ ఎయిర్‌వేస్‌ వర్గాలు వెల్లడించాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement