స్నేహితుల మధ్య వివాదం, పరస్పరం దాడి | both friends fight with each other, one injured at chaitanyapuri | Sakshi
Sakshi News home page

స్నేహితుల మధ్య వివాదం, పరస్పరం దాడి

Sep 30 2016 2:31 PM | Updated on Sep 4 2017 3:39 PM

చైతన్యపురి పీఎస్ పరిధిలోని మారుతి నగర్ లో ఇద్దరు స్నేహితుల మధ్య వివాదాలు దాడికి దారి తీశాయి.

హైదరాబాద్ : చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని మారుతి నగర్ లో ఇద్దరు స్నేహితుల మధ్య వ్యక్తిగత వివాదాలు దాడికి దారి తీశాయి. స్థానికంగా నివాసం ఉంటున్న భాస్కర్ రెడ్డి, శంకర్ ఇరువురు చాలాకాలంగా స్నేహితులు. వీరిద్దరూ ఒకే గదిలో నివాసం ఉండేవాళ్లు.  అయితే వారిమధ్య విభేదాలు రావడంతో ప్రస్తుతం వేర్వేరుగా ఉంటున్నారు. ఓ విషయమై శుక్రవారం కలుసుకున్న వీరిద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అదికాస్తా ముదిరి పరస్పరం దాడి చేసుకున్నారు.

ఈ నేపథ్యంలో శంకర్ ఆగ్రహంతో  భాస్కర్‌రెడ్డిపై దాడి చేశాడు. చుట్టుపక్కల వారు పట్టుకోబోగా శంకర్ అక్కడ నుంచి పరారయ్యాడు. అయితే స్థానికులు అతడిని వెంబడించి పట్టుకుని పోలీసులకు అప్పగించారు. తీవ్రంగా గాయపడిన భాస్కర్‌రెడ్డిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement