'ఉద్యోగాల భర్తీపై శ్వేతపత్రం విడుదల చేయాలి' | andhra pradesh unemployees union president fires on chandrababu naidu | Sakshi
Sakshi News home page

'ఉద్యోగాల భర్తీపై శ్వేతపత్రం విడుదల చేయాలి'

Dec 15 2015 7:59 PM | Updated on Sep 3 2017 2:03 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత 18 నెలల కాలంలో ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని ఏపీ నిరుద్యోగ ఐక్యవేదిక అధ్యక్షుడు లగుడు గోవిందరావు డిమాండ్ చేశారు.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత 18 నెలల కాలంలో ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని ఏపీ నిరుద్యోగ ఐక్యవేదిక అధ్యక్షుడు లగుడు గోవిందరావు డిమాండ్ చేశారు.

ఏపీలో ఖాళీగా ఉన్న లక్ష 48 వేల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలనన్నారు. చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన ఇంటికో ఉద్యోగం హామీని నిలబెట్టుకోవాలని ఆయన కోరారు. చంద్రబాబు అధికారం చేపట్టి 18 నెలలు అయిన ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదని గోవిందరావు ఆరోపించారు. దీనికి నిరసనగా బుధవారం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయం ముందు బిక్షాటన, గురువారం అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాలు నిర్వహించనున్నామని ఆయన తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement