విప్లవ నేతకు జనసేన సెల్యూట్ | Sakshi
Sakshi News home page

విప్లవ నేతకు జనసేన సెల్యూట్

Published Sat, Nov 26 2016 4:47 PM

విప్లవ నేతకు జనసేన సెల్యూట్

హైదరాబాద్: క్యూబా విప్లవయోధుడు, కమ్యూనిస్టు నాయకుడు ఫిడెల్‌ క్యాస్ట్రో మృతిపై జనసేన అధినేత, నటుడు పవన్ కళ్యాణ్ ట్విట్టర్లో స్పందించారు. మహా నేత ఫెడల్‌ క్యాస్ట్రో నేడు ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్లారు. ప్రజల్లో స్పూర్తిని నింపిన నాయకుడికి జనసేన సెల్యూట్ చేస్తోందని పేర్కొన్నారు. తాము అమితంగా ఆరాధించే చెగువేరాతో కలిసి పోరాడిన ఫెడల్‌ క్యాస్ట్రోను ఎప్పటికీ గుర్తుంచుకుంటామని తెలిపారు.

ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటున్నాము. ఫిడెల్‌ క్యాస్ట్రో ప్రవేశ పెట్టిన అనేక కార్యక్రమాల్లో ముఖ్యంగా క్యూబన్ల ప్రజారోగ్యం కోసం ఎంతగానో కృషి చేశారని పవన్ కొనియాడారు.

 

Advertisement
 
Advertisement
 
Advertisement