90 లీటర్ల కల్తీ నెయ్యి సీజ్ | 90 liters of adulterated ghee seized | Sakshi
Sakshi News home page

90 లీటర్ల కల్తీ నెయ్యి సీజ్

Feb 12 2016 8:32 AM | Updated on Sep 3 2017 5:31 PM

గోషామహల్ ప్రాంతంలో పామోయిల్‌తో కల్తీ చేసిన 90 లీటర్ల నెయ్యిని హైదరాబాద్ టాస్క్ పోలీసులు పట్టుకున్నారు.

గోషామహల్ ప్రాంతంలో పామోయిల్‌తో కల్తీ చేసిన 90 లీటర్ల నెయ్యిని హైదరాబాద్ టాస్క్ పోలీసులు పట్టుకున్నారు. కల్తీ నెయ్యిని విక్రయిస్తున్న దినేష్ పాండియాను అదుపులోకి తీసుకున్న పోలీసులు 90 లీటర్ల నెయ్యిని సీజ్ చేసి, స్థానిక పోలీసులకు అప్పగించారు.


నగరంలోని ముర్గీచౌక్ నుంచి హసన్‌నగర్‌కు చెందిన మహ్మాద్ నిజాముద్ధీన్, మహ్మాద్ యూసుఫ్‌తో కలిసి చికెన్ వెస్టేజ్‌తో తయారు చేసిన 555 లీటర్ల అయిల్‌ను తరలిస్తుండగా టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చే శారు. ఈ దాడి నుంచి మహ్మాద్ యూసుఫ్ తప్పించుకున్నారు. దోరికిన మహ్మాద్ నిజాముద్ధీన్ నుంచి స్వాధీనం చేసుకున్న 555 లీటర్ల అయిల్‌ను సీజ్ చేసి , ఆయనను ఆరెస్టు చేసి ,స్థానిక పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటనలపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement