breaking news
Haidarabad
-
ప్లీనరీకి తరలిన టీఆర్ఎస్ నాయకులు
మద్దూరు : హైదబాద్‌లోని కొంపల్లిలో శుక్రవారం టీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించే 17వ ప్లీనరీకి టీఆర్ఎస్ మండల నాయకులు తరలివెళ్లారు. పార్టీ రాబోయే రోజుల్లో చేపట్టే సంక్షేమ కార్యక్రమాలు, పార్టీ సంస్థాగత నిర్ణయాలపై సీఎం ఆదేశాల మేరకు మండలంలో ప్రచారం చేయడానికి ప్లీనరీకి వెళ్తున్నట్లు పార్టీ మండలాధ్యక్షుడు లక్ష్మీనారాయణరెడ్డి తెలిపారు. ప్లీనరీకి వెళ్లిన వారిలో సలీం, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి గోపాల్, నాయకులు విజయభాస్కర్‌రెడ్డి, జయప్రకాష్, అనంత్‌రెడ్డి తదితరులున్నారు. కోస్గి : తెలంగాణ రాష్ట్ర సమితి హైద్రాబాద్‌లో నిర్వహించిన పార్టీ ప్లీనరీకి శుక్రవారం స్థానిక నాయకులు తరలివెళ్లారు.మండల పార్టీ అధ్యక్షుడు కిష్టప్ప, ఎంపీపీ ప్రతాప్‌రెడ్డి, వైస్ ఎంపీపీ దోమ రాజేశ్వర్, జెడ్పీటీసీ అనితబాల్‌రాజ్, ఎంపీటీసీ మ్యాకల రాజేష్, రైతు సమితి మండల కన్వీనర్ హన్మంత్‌రెడ్డి, నాయకులు ఓంప్రకాష్, మధుకర్‌రావు, జగదీశ్వర్‌రెడ్డి, మల్రెడ్డి, డీకే నాగేష్‌తోపాటు పలువురు నాయకులు ఉన్నారు. దౌల్తాబాద్ : హైదరాబాద్‌లో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర సమితి 17వ ప్లీనరీకి మండలంలోని టీఆర్ఎస్ నాయకులు తరలివెళ్లారు. టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ప్లీనరీకి మండలంలోని నాయకులు, శ్రేణులు వాహనాల్లో తరలివెళ్లారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ రానున్న 2019 ఎన్నికల్లో కూడా తెలంగాణలో టీఆర్ఎస్ జెండా ఎగురవేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా మండలంలోని ప్రతిగ్రామం నుంచి ఇద్దరు నాయకులు ప్లీనరీకి వెళ్లారని ఆ పార్టీ నాయకులు తెలిపారు. బొంరాస్‌పేట : టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశానికి మండల టీఆర్ఎస్ నాయకులు శుక్రవారం తరలివెళ్లారు. మండలంలోని బురాన్‌పూర్, ఏర్పుమళ్ల, తుంకిమెట్ల తదితర గ్రామాల నుంచి టీఆర్ఎస్ నాయకులు తరలివెళ్లారు. ఇందులో మండల నాయకులు విష్ణువర్ధన్‌రెడ్డి, శేరినారాయణరెడ్డి, మహేందర్‌రెడ్డి, సుదర్శన్‌రెడ్డి తదితరులు ఉన్నారు. -
కానిస్టేబుల్ పరీక్ష ‘కీ’ విడుదల
తెలంగాణ రాష్ట్ర పోలీసు రిక్రూట్మెంట్ బోర్డ్ ఇటీవలే నిర్వహించిన కానిస్టేబుల్ పరీక్షల ప్రాథమిక కీని బుధవారం విడుదల చేసింది. ఏ, బీ, సీ, డీ సిరీస్‌లకు సంబంధించిన ప్రశ్నపత్రాల బుక్లెట్స్, ‘కీ’లను తన అధికారి వెబ్సైట్ (www.tslprb.in)లో అందుబాటులో ఉంచింది. అభ్యంతరాలు ఉన్న వారు శనివారం సాయంత్రం 5 గంటల్లోపు (keyobjectionspc@tslprb.in)కుఈ మెయిల్ ద్వారా తమ దృష్టికి తీసుకురావాలని బోర్డు కోరింది. -
90 లీటర్ల కల్తీ నెయ్యి సీజ్
గోషామహల్ ప్రాంతంలో పామోయిల్తో కల్తీ చేసిన 90 లీటర్ల నెయ్యిని హైదరాబాద్ టాస్క్ పోలీసులు పట్టుకున్నారు. కల్తీ నెయ్యిని విక్రయిస్తున్న దినేష్ పాండియాను అదుపులోకి తీసుకున్న పోలీసులు 90 లీటర్ల నెయ్యిని సీజ్ చేసి, స్థానిక పోలీసులకు అప్పగించారు. నగరంలోని ముర్గీచౌక్ నుంచి హసన్‌నగర్‌కు చెందిన మహ్మాద్ నిజాముద్ధీన్, మహ్మాద్ యూసుఫ్‌తో కలిసి చికెన్ వెస్టేజ్తో తయారు చేసిన 555 లీటర్ల అయిల్ను తరలిస్తుండగా టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చే శారు. ఈ దాడి నుంచి మహ్మాద్ యూసుఫ్ తప్పించుకున్నారు. దోరికిన మహ్మాద్ నిజాముద్ధీన్ నుంచి స్వాధీనం చేసుకున్న 555 లీటర్ల అయిల్ను సీజ్ చేసి , ఆయనను ఆరెస్టు చేసి ,స్థానిక పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటనలపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.