పోలీస్ కానిస్టేబుల్ ఫలితాలపై అనుమానాలున్న 150 మందికి పైగా అభ్యర్థులు ఓపెన్ చాలెంజ్ ద్వారా అభ్యర్థించినట్లు రిక్రూట్‌మెంట్ బోర్డు వర్గాలు స్పష్టం చేశాయి.
సాక్షి, హైదరాబాద్: పోలీస్ కానిస్టేబుల్ ఫలితాలపై అనుమానాలున్న 150 మందికి పైగా అభ్యర్థులు ఓపెన్ చాలెంజ్ ద్వారా అభ్యర్థించినట్లు రిక్రూట్‌మెంట్ బోర్డు వర్గాలు స్పష్టం చేశాయి. కటాఫ్ మార్కులు, రిజర్వేషన్లు సహా అభ్యర్థుల ప్రతి సందేహాన్నీ నివృత్తి చేసేందుకు దేశ చరిత్రలో తొలిసారిగా పోలీస్ శాఖ ఓపెన్ చాలెంజ్‌కు అవకాశం కల్పించిన విషయం తెలిసిందే.
సందేహాలపై 10 నుంచి 15 రోజుల్లో వివరణ ఇస్తామని, ఏ అభ్యర్థికైనా అన్యాయం జరిగిందని నిరూపితమైతే అతనికి అపాయింట్‌మెంట్ ఆదేశాలిస్తామని స్పష్టం చేశారు.