భార్యతో సంబంధం పెట్టుకున్నాడని.. | The brutal murder of a man in Warangal | Sakshi
Sakshi News home page

భార్యతో సంబంధం పెట్టుకున్నాడని..

Mar 10 2016 12:00 PM | Updated on Sep 3 2017 7:26 PM

భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని ఓ వ్యక్తిని గొడ్డలితో నరికి చంపిన సంఘటన వరంగల్ జిల్లా చెన్నారావుపేటలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది.

భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని ఓ వ్యక్తిని గొడ్డలితో నరికి చంపిన సంఘటన వరంగల్ జిల్లా చెన్నారావుపేటలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది.వివరాలు..స్థానికంగా నివాసముంటున్న బొంతురాజు తవేరా వాహనాన్ని నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈక్రమంలో రాజు భార్య సరిత ఇంటి పక్కన నివాసముంటున్న ఉప్పుల నగేష్(28)తో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ విషయం తెలిసన రాజు పలుమార్లు ఇద్దరిని హెచ్చరించాడు.

తీరు మార్చుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్పిన పెడచెవిన పెట్టడంతో.. మనస్తాపానికి గురైన రాజు తన తమ్ముడితో కలిసి బుధవారం రాత్రి నగేష్ ఇంట్లోకి వె ళ్లి నిద్రిస్తున్న అతని కళ్లలో కారం చల్లి గొడ్డలితో నరికి చంపారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పరారిలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement