మెమన్ పిటిషన్‌పై 27న సుప్రీం విచారణ | SC to hear on Monday the plea of Yakub Abdul Razak Memon | Sakshi
Sakshi News home page

మెమన్ పిటిషన్‌పై 27న సుప్రీం విచారణ

Jul 25 2015 12:56 AM | Updated on Aug 27 2018 8:24 PM

మెమన్ పిటిషన్‌పై 27న సుప్రీం విచారణ - Sakshi

మెమన్ పిటిషన్‌పై 27న సుప్రీం విచారణ

తన ఉరిశిక్ష అమలుపై స్టే విధించాలని కోరుతూ యాకూబ్ మెమన్(53) పెట్టుకున్న పిటిషన్ పై వాదనలు సోమవారం వింటామని సుప్రీంకోర్టు ప్రకటించింది.

న్యూఢిల్లీ: ముంబై బాంబు పేలుళ్ల కేసులో తనకు విధించిన మరణ శిక్ష అమలుపై స్టే విధించాలని కోరుతూ యాకూబ్ మెమన్ దాఖలు చేసిన పిటిషన్‌ను ఈ నెల 27నవిచారించనున్నట్లు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ హెచ్‌ఎల్ దత్తు వెల్లడించారు. చాలా సున్నితమైన ఈ అంశాన్ని జస్టిస్ ఏఆర్ దవే నేతృత్వంలోని బెంచ్‌కు అప్పగించానని శుక్రవారం తెలిపారు. యాకూబ్‌కుశిక్షను ఈ నెల 30న అమలు చేయనుండడం తెలిసిందే.

మెమన్ తరఫున  న్యాయవాది రాజు రామచంద్రన్ పిటిషన్‌ను ప్రస్తావించగా, మరణశిక్షలకు వ్యతిరేకంగా పోరాడుతున్న డెత్ పెనాల్టీ లిటిగేషన్ క్లినిక్ తరఫున టీఆర్ అంధ్యారుజినా హాజరయ్యారు. మెమన్‌కు డెత్ నోటీసు ఇవ్వలేదని అంధ్యారుజినా చెప్పారు. మెమన్ నాగపూర్ జైలు ఉండగా, డెత్ వారెంట్ ప్రక్రియను ముంబై జైలులో అమలుచేస్తున్నారని అన్నారు. సుప్రీంకోర్టులో క్యూరేటివ్ పిటిషన్ పెండింగ్‌లో ఉండగానే ముంబైలోని టాడా కోర్టు డెత్ వారెంట్ జారీ చేయడం చట్ట విరుద్ధమన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement