వైజాగ్‌లో హైటెక్ వ్యభిచారం | Prostitution gang arrested in vizag | Sakshi
Sakshi News home page

వైజాగ్‌లో హైటెక్ వ్యభిచారం

Dec 29 2015 11:56 AM | Updated on Aug 20 2018 4:27 PM

హైటెక్ తరహాలో సాగుతున్న వ్యభిచారం గుట్టును విశాఖ పోలీసులు రట్టు చేశారు.

అక్కయ్యపాలెం: హైటెక్ తరహాలో సాగుతున్న వ్యభిచారం గుట్టును విశాఖ పోలీసులు రట్టు చేశారు. వివరాలివీ... హైదరాబాద్ అమీర్‌పేటకు చెందిన నీలకంఠారెడ్డి ‘వైజాగ్ కాల్‌గర్ల్స్’ పేరుతో ఓ వెబ్‌సైట్ క్రియేట్ చేశాడు. అందులో తనను అఖిల్‌గా పరిచయం చేసుకుని కాంటాక్టు ఫోన్ నంబర్‌ను ఉంచాడు. అందమైన అమ్మాయిలను సప్లయి చేస్తామని, కావాల్సిన వారు సంప్రదించాలని అందులో పేర్కొన్నాడు. అమ్మాయిలను విటులకు సరఫరా చేసే ఈ దందా ఏడు నెలల నుంచి కొనసాగుతోంది.
 
ఇందుకోసం వైజాగ్ సీతమ్మపేటలో ఓ గదిని అద్దెకు తీసుకున్నాడు. అందులో కంప్యూటర్ ఏర్పాటు చేసుకుని శ్రావణి అనే మహిళ సాయంతో ఈ ఘన కార్యం నెరపుతున్నాడు. దీనిపై సమాచారం అందుకున్న ద్వారకా పోలీసులు సీఐ షణ్ముఖరావు ఆధ్వర్యంలో కూపీలాగగా మొత్తం వ్యవహారం బయటపడింది. మంగళవారం ఉదయం ఇంటిపై దాడి చేసి నీలకంఠారెడ్డి, శ్రావణిలతో పాటు ఇద్దరు యువతులను ఒక విటుడిని అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై పూర్తి వివరాల కోసం పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement