పొలంలో పనిచేస్తున్న దంపతులపై పిడుగు పడింది. ఈ ఘటనలో భర్త చనిపోగా భార్య పరిస్థితి విషమంగా మారింది.
విజయనగరం: పొలంలో పనిచేస్తున్న దంపతులపై పిడుగు పడింది. ఈ ఘటనలో భర్త చనిపోగా భార్య పరిస్థితి విషమంగా మారింది. విజయనగరం జిల్లా లక్కవరపుకోట మండలం పూడివాణిపాలెం ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కిల్లి అప్పాలు(55), అమ్మాయిలు(48) దంపతులు తమ పొలంలో పనిచేస్తుండగా ఆకస్మాత్తుగా వాన మొదలైంది.
అదే సమయంలో పెనుశబ్ధంతో పిడుగు వారిపై పడింది. పెను షాక్‌కు గురైనా అప్పాలు అక్కడిక్కడే చనిపోగా అమ్మాయిలు తీవ్రంగా గాయపడింది. స్థానికులు ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. బాధితురాలు పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.