
సోనియాపై కలాం అభ్యంతరం వదంతే
2004 లోక్‌సభ ఎన్నికల తర్వాత ప్రధానిగా కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ ప్రమాణ స్వీకారం చేయడానికి కలాం విముఖత తెలిపారని వస్తున్న వార్తలు వట్టి వదంతులేనని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ స్పష్టం చేశారు.
మన్మోహన్ సింగ్ వెల్లడి
న్యూఢిల్లీ: 2004 లోక్‌సభ ఎన్నికల తర్వాత ప్రధానిగా కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ ప్రమాణ స్వీకారం చేయడానికి కలాం విముఖత తెలిపారని వస్తున్న వార్తలు వట్టి వదంతులేనని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ స్పష్టం చేశారు. ఎవరు ప్రధాని అవుతారనని ఆయన అడగలేదని ఓ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ప్రధాని కావడం మెజారీటీ ఉన్న పార్టీ హక్కని అన్నారు. సోనియా పాస్‌పోర్టు, ఇతర వివరాలను కలాం అడిగారన్న వార్తలు శుద్ధ అబద్ధాలన్నారు.
ఆనాడు ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి కాంగ్రెస్‌లో, యూపీఏలో జరిగిన పరిణామాల గురించి కలాంకు తెలుసన్నారు. 2005లో అమెరికాతో భారత్ కుదుర్చుకున్న అణు ఒప్పందానికి కలాం మద్దతిచ్చారని అన్నారు. ఒప్పందం జాతిప్రయోజనాలకు ముఖ్యమని కలాం ఎస్పీ నేత ములాయంకు చెప్పారన్నారు.