మజ్లిస్తోనే మా పోటీ | bjp leaders meets about GHMC elections | Sakshi
Sakshi News home page

మజ్లిస్తోనే మా పోటీ

Jul 30 2015 2:29 PM | Updated on Mar 29 2019 9:31 PM

మజ్లిస్తోనే మా పోటీ - Sakshi

మజ్లిస్తోనే మా పోటీ

జీహెచ్ఎంసీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో గురువారం బీజేపీ ఎలక్షన్ కమిటీ భేటీ అయింది.

హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ ఎలక్షన్ కమిటీ గురువారం హైదరాబాద్లో భేటీ అయింది. ఈ సందర్భంగా ఆ పార్టీ శాసన సభ పక్ష నేత డా. కె. లక్ష్మణ్ మాట్లాడుతూ... బల్దియా మేయర్ పీఠాన్ని తమ పార్టీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.

తమకు ప్రధాన పోటీ ఎంఐఎం అని లక్ష్మణ్ స్పష్టం చేశారు. ప్రజా సమస్యలపై పోరాటానికి వ్యూహాన్ని ఖరారు చేస్తున్నామన్నారు. అందుకోసం ఆగస్టు మొదటి వారం నుంచి ప్రజాక్షేత్రంలోని దిగుతామన్నారు. ఈ సమావేశంలో ఆ పార్టీకి చెందిన సీనియరు నేతలు పాల్గొన్నారు. 

 

Advertisement
 
Advertisement
Advertisement