అటవీ సంరక్షణలో బిష్ణోయ్‌ ఆదర్శం

Protect The Adivasis And The Forest - Sakshi

1972 వన్యమృగ సంరక్షణకు  చట్టం అమల్లోకి  వచ్చింది. అభయారణ్యాలలోకి అడుగు పెట్టడం, వన్యమృగాల వేట చట్టవిరుద్ధమైంది. అయినా ఈ చట్టం మాఫియాను ఆపలేకపోయింది. అటవీ అధికా రులకు ఆయుధాలిచ్చినా వేట మాత్రం ఆగలేదు. కొన్ని ముఠాలు అక్రమంగా వనంలోకి ప్రవేశించి  వన్యప్రాణులను వేటాడటం వలన  కొన్ని జాతులు  అంతరించిపోయే ప్రమాదం ఏర్పడ్డది. అంతెందుకు ఆదిలాబాద్‌ జిల్లాలో 2012లో కవ్వాల్‌ అభయార ణ్యాన్ని పులుల సంరక్షణ కేంద్రంగా గుర్తించిన తరువాత కూడా వేట ఆగలేదు. మహారాష్ట్ర నుంచి వేటగాళ్లు తుపాకులతో పులులను వేటాడారు. అదే జిల్లా  వెంచపల్లి జింకల అభయారణ్యంలో 1980లో వందల సంఖ్యలో కృష్ణ జింకలు ఉన్నట్లు అటవీ శాఖ నివేదికలు వెల్లడిస్తున్నాయి. కానీ ఇప్పుడక్కడ పదంటే పది కృష్ణ జింకలు కూడా కన్పించవు. సంపన్న కుటుంబాల్లో వేట ఒక వినోదం. సల్మాన్‌ ఖాన్‌  వేట అటువంటిదే. రాజస్తాన్‌లో కంకణీ గ్రామంలో రెండు కృష్ణజింకలను వేటాడిన సల్మాన్‌ ఖాన్‌ అక్కడి బిష్ణోయ్‌  తెగ యువకుల కంటపడ్డారు. తుపాకీ కాల్పుల శబ్దం వినగానే అప్రమత్తమైన యువకులు  వాహనం వెంట పడి వివరాలు సేక రించి, ఫిర్యాదు చేశారు. సంపన్న వర్గాలు, పలుకు బడి వర్గాలు ఒక్కటైనా బిష్ణోయ్‌ యువకులు చివరి వరకు నిలబడి కేసు గెలిచారు.

పులుల సంరక్షణ అనే కుట్రతో పాలకులు, పారి శ్రామిక వర్గాలు సంయుక్తంగా  చెంచు, ఆదివాసి, ఆటవిక తెగలను అడవినుంచి వెళ్లగొట్ట టానికి ప్రయత్నాలు చేస్తున్నారు కానీ   ఆదివాసీలు అడవిలో అంతర్భాగమే. అడ విని అక్కడి  జంతువులను, పక్షులను  ఆదివాసీ గిరిజనులను వేరుగా చూడలేం. అటవీ ఆవరణ అంతస్థులో ఒక్కొక్క జాతిది  ఒక్కో అంతస్థు. ఏ ఒక్క అంతస్థు దెబ్బతిన్నా... పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుంది. అడవిలో  సాయంత్రం ఐదుగంటలకే చీకటి తెరలు కమ్ముకుం టాయి. చీకటి పడక ముందే గుడిసెలకు చేరు కుంటారు. సరిగ్గా ఈ సమయంలో అడవిలో జీవ రాశులు బయటికి వస్తాయి. ఆహార ఆన్వేషణ  పూర్తి చేసుకొని సూర్యోదయం వేళకు తావుకు చేరుకుం టాయి. సూర్యోదయం తరువాతే ఆదివాసీ దిన చర్య మొదలవుతుంది. ఆదివాసుల జీవన చర్యలు జీవ రాశుల జీవన విధానంపై  జోక్యం చేసుకోవు. ప్రకృతే ఆదివాసీలకు, అటవీ జంతువులకు మధ్య అలాంటి సర్దుబాటు చేసింది. కానీ, అభయారణ్యాల్లోంచి ఆదివాసులను బయటకు పంపడం అన్యాయం.

‘చెంచులపై పరిశోధనకు వెళ్లి రాత్రి వేళ  కుమ్మనిపెంటలోని అర్తి అంజన్న గుడిసెలో నిద్ర పోతుంటే ఏగిళ్లుబారే వేళ నిద్ర లేపి గుడిసెనుక నుంచి పోతున్న పులిని పిల్లిని చూపినట్టు చూపాడు’ అని ‘మరణం అంచున’ పుస్తకంలో  రచయిత  తన అనుభవాన్ని చెప్పారు. నిజానికి నల్లమలలో చెంచులు, పులులు కలిసే జీవనం చేస్తారు. వందల ఏళ్లుగా ఈ తంతు అలానే సాగుతోంది. ఇప్పుడేదో ఉపద్రవం ముంచుకొచ్చినట్టు చెంచు జాతులను అడవి దాటించే ప్రయత్నం చేస్తున్నారు. దీని వెనుక నూతన ఆర్థిక విధానాల పర్యవసానం, అటవీ వన రులు, ఖనిజసంపద మీద పెట్టుబడి దారుల కన్ను, దానికి ఏ మిన హాయింపు లేకుండా కేంద్ర  ప్రభుత్వాల దన్ను  ఉండి ఉండవచ్చు. ఆటమిక్‌ మిన రల్‌ డైరెక్టర్‌ ఫర్‌ ఎక్స్‌ఫ్లోరేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ సెంటర్‌ చేసిన ఏరియల్‌ సర్వేలో నల్లమల అటవీ ప్రాంతంలో వజ్రాలు, బంగారంతో పాటు 24 రకాల ఖనిజాలు ఉన్నాయని, వీటిలో వజ్రాలు, బంగారం, గ్రానైట్‌ వెలికితీత లాభదాయకంగా ఉంటుందని నిర్ధారణ అయింది. ఈ నివేదిక ఆధా రంగానే  దక్షిణాఫ్రికాకు చెందిన డిబీర్స్‌ అనే మల్టీ నేషనల్‌ వజ్రాల కంపెనీకి నల్లమలలో వజ్రాల అన్వేషణకు 2009 నవంబర్‌లో అప్పటి కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. అప్పటినుంచే చెంచుల తరలింపు ముమ్మరం అయింది. అడవిని నాశనం చేసి, వన్య ప్రాణులను (ఆదివాసులతో సహా) సంహ రించి ఖనిజాల సంపదను దోచుకొనిపోయే విస్తాపన నుంచి అడవిని, చెంచు, ఆదివాసులను రాజస్తాన్‌లోని బిష్ణోయ్‌ తెగ యువత స్ఫూర్తితో కాపాడు కుందాం.


వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్టు, దుబ్బాక శాసన సభ్యులు ‘
మొబైల్‌ : 94403 80141

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top