వారఫలాలు 5/11/2017 - 11/11/2017

Weekends 5/11/2017 - 11/11/2017 - Sakshi

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
అనుకున్న పనుల్లో అవాంతరాలు ఏర్పడవచ్చు. ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటుంబసభ్యుల నిర్ణయాలతో విభేదిస్తారు. ఉద్యోగయత్నాలు నెమ్మదిగా సాగుతాయి. కొన్ని నిర్ణయాలను మార్చుకోక తప్పని పరిస్థితి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక విషయాలు నిరాశ పరుస్తాయి. వ్యాపారాలు స్వల్పంగానే లాభిస్తాయి. ఉద్యోగులకు మార్పులు. రాజకీయవేత్తలు, ఐటీ నిపుణులకు ఒత్తిడులు. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. ఎరుపు, పసుపు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. చీమలకు ఆహారం పెట్టండి.

వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోíß ణి, మృగశిర 1,2 పా.)
కొత్త వ్యూహాలతో అందర్నీ ఆకట్టుకుంటారు. చేపట్టిన కార్యాలు పట్టుదలతో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. అనుకున్న ఆదాయం సమకూరి అవసరాలు తీరతాయి. కాంట్రాక్టర్లకు అనుకూల పరిస్థితి. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం మధ్యలో ధనవ్యయం. ఆరోగ్య సమస్యలు. నీలం, ఆకుపచ్చ రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. ఉడికించిన సెనగలు ఆవుకు పెట్టండి.

మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
రాబడికి మించిన ఖర్చులతో సతమతమవుతారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యులతో అకారణంగా విభేదాలు. పనుల్లో అవాంతరాలు ఏర్పడవచ్చు. ఆరోగ్య పరంగా చికాకులు. దూరపు బంధువులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. మీ ప్రతిపాదనలు స్నేహితులు తిరస్కరిస్తారు. వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుతాయి. ఉద్యోగులకు పనిఒత్తిడులు. కళాకారులు, ఐటీ నిపుణులు మరింత శ్రమపడాలి. వారం ప్రారంభంలో శుభవార్తలు. స్వల్ప ధనలాభం. పసుపు, నేరేడు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. అమ్మవారికి కుంకుమార్చన చేయండి.

కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
కార్యజయంతో ఉత్సాహం పెరుగుతుంది. సోదరులు, సోదరీలతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. సంఘంలో పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి. ఒక సమాచారం కొత్త ఆలోచనలు రేకెత్తిస్తుంది. దూరమైన ఆప్తులు తిరిగి దగ్గరవుతారు. అనుకున్న ఆదాయం సమకూరుతుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు హోదాలు మరింతగా పెరుగుతాయి. కళాకారులకు సన్మానాలు. వారం మధ్యలో వృథా ఖర్చులు. అనారోగ్యం. లేత పసుపు, ఎరుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీదేవికి పొంగలి నివేదించండి.

సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
అనూహ్యమైన రీతిలో పనులు పూర్తి కాగలవు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. పలుకుబడి పెరుగుతుంది. బంధువులు, స్నేహితులతో ఉత్సాహంగా గడుపుతారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. కొన్ని వ్యవహారాలలో చర్చలు ఫలిస్తాయి. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు దక్కుతాయి. రాజకీయవేత్తలకు పదవులు రావచ్చు. వారం చివరిలో వివాదాలు. ఆరోగ్యభంగం. గులాబి, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. సెనగలు ఉడికించి ఆలయంలో ఇవ్వండి.

కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. సన్నిహితులు, మిత్రుల సహాయంతో ముందుకు సాగుతారు. ఆపదలో ఉన్న వారికి స్నేహహస్తం అందిస్తారు. కాంట్రాక్టర్లకు అనుకూలం. పరిచయాలు పెరుగుతాయి. వాహనాలు కొనుగోలు చేస్తారు. వివాహాది శుభకార్యాలు నిర్వహిస్తారు. వ్యాపారాలలో లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు మంచి గుర్తింపు రాగలదు. పారిశ్రామికవేత్తలు, ఐటీ నిపుణులకు సంతోషకరమైన సమాచారం. వారం ప్రారంభంలో వృథా ఖర్చులు. బంధువిరోధాలు. ఆకుపచ్చ, నీలం రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. రాగి నాణాన్ని పాలతో కడిగి నీటిలో విడిచిపెట్టండి.

తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. వ్యవహారాలలో ప్రతిబంధకాలు. ఆలోచనలు కలసిరావు. విద్యార్థులకు కొంత గందరగోళంగా ఉంటుంది. ఆస్తి వ్యవహారాలలో ఒప్పందాలు వాయిదా పడతాయి. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగులకు అదనపు పనిభారం తప్పకపోవచ్చు. కళాకారులు, ఐటీ నిపుణులకు నిరాశాజనకంగా ఉంటుంది. వారం చివరిలో ఆకస్మిక ధనలాభం. యత్నకార్యసిద్ధి. పసుపు, లేత నీలం రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. వేంకటేశ్వరస్వామికి తులసీదళాల దండ సమర్పించండి.

వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
చేపట్టిన కార్యక్రమాలు నిదానంగా పూర్తి కాగలవు. అనుకున్నది ఒకటి జరిగేది వేరొకటిగా ఉండవచ్చు. ఆరోగ్య, కుటుంబసమస్యలు కొంత చికాకు పరుస్తాయి. వివాదాలకు దూరంగా ఉండండి. విద్యార్థులు, నిరుద్యోగుల యత్నాలు కొంత మందగిస్తాయి. వ్యాపారాలలో స్వల్ప లాభాలు. ఉద్యోగులకు ఒత్తిడులు. ఐటీ నిపుణులు, పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు వాయిదా. వారం ప్రారంభంలో శుభవార్తలు. వాహనయోగం. ఎరుపు, గులాబి రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. శివాలయంలో అభిషేకం చేయండి.

ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆత్మీయుల నుంచి పిలుపు అందుతుంది. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. నిరుద్యోగుల యత్నాలు కొలిక్కి వస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులకు హోదాలు దక్కవచ్చు. కళాకారులకు నూతనోత్సాహం. వారం చివరిలో వ్యయప్రయాసలు. వృథా ఖర్చులు. గులాబి, లేత పసుపు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. పంచామృతాలతో వినాయకునికి అభిషేకం చేయండి.

మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
కొత్త విషయాలు తెలుసుకుంటారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు దక్కుతాయి. చేపట్టిన కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. స్థిరాస్తి వివాదాలు తీరతాయి. వివాదాలను నేర్పుగా పరిష్కరించుకుంటారు. అందరిలోనూ మీ ప్రతిభ నిరూపితమవుతుంది.  వ్యాపారాలు అభివృద్ధి పథంలో సాగుతాయి. లాభాలు అందుతాయి. ఉద్యోగస్తులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. కళాకారులు, ఐటీ నిపుణులు అనుకున్నది సాధిస్తారు. వారం ప్రారంభంలో ధనవ్యయం. నీలం, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. అమ్మవారికి కుంకుమార్చన చేయండి.

కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. పనుల్లో ప్రతిబంధకాలు ఏర్పడవచ్చు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ చూపండి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. బంధువులు, మిత్రులతో వివాదాలు నెలకొంటాయి. విచిత్ర సంఘటనలు ఎదురవుతాయి. విద్యార్థులు, నిరుద్యోగులకు శ్రమాధిక్యం. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి. పారిశ్రామికవేత్తలకు ఒత్తిడులు. వారం చివరిలో శుభవార్తా శ్రవణం. ధనలాభం. నలుపు, ఆకుపచ్చ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. కాలభైరవాష్టకం పఠించండి.

మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
ఆదాయానికి మించిన ఖర్చులు తప్పవు. ఆలోచనలు కలిసిరావు. కుటుంబ, ఆరోగ్యసమస్యలు కాస్త చికాకు పరుస్తాయి. సోదరులు, మిత్రులతో మాటపట్టింపులు. అంచనాలు తప్పి నిరాశ చెందుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇతరుల విషయాలలో జోక్యం వల్ల కొన్ని చిక్కులు ఎదురుకావచ్చు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగులకు పనిఒత్తిడులు. రాజకీయవేత్తలు, ఐటీ నిపుణులకు అవకాశాలు చేజారవచ్చు. వారం ప్రారంభంలో విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. గులాబి, నేరేడు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.
- సింహంభట్ల సుబ్బారావు జ్యోతిష్య పండితులు

టారో 5 నవంబర్‌ నుంచి 11 నవంబర్, 2017 వరకు
మేషం (మార్చి 21 – ఏప్రిల్‌ 19)
మీకు శత్రువులు ఎవరైనా ఉన్నారంటే అది మీ ఆలోచనా విధానమే! ఏది చేసినా అంతా చెడే జరుగుతుందన్న ఆలోచనను దూరం చేసుకోండి. మీ ఆత్మవిశ్వాసమే మిమ్మల్ని విజయం వైపుకు నడిపించే ఆయుధమని నమ్మండి. కొద్దిరోజుల్లోనే ఓ శుభవార్త వింటారు. మీ కోసం కొత్త అవకాశాలు తలుపుతడతాయి. ధైర్యంగా ఆ అవకాశాలను అందిపుచ్చుకోండి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. సిగరెట్లు, మద్యపానం లాంటి చెడు అలవాట్లు మానేయండి. అందుకు ఇదే సరైన సమయం.
కలిసివచ్చే రంగు : బూడిద

వృషభం (ఏప్రిల్‌ 20 – మే 20)
కొత్త ఉత్సాహంతో పనిచేస్తారు. ఈ వారమంతా ఊహించనంత సంతోషంగా గడుపుతారు. ప్రేమ జీవితం చాలా బాగుంటుంది. మీ జీవిత భాగస్వామికి ఎక్కువ సమయం కేటాయించండి. కొత్త అవకాశాలు వస్తాయి. వృత్తి జీవితం చాలా బాగుంటుంది. ఉన్నత పదవిని అలంకరిస్తారు. ఆత్మవిశ్వాసంతో మీ పని మీరు చేస్తూ పొండి. మీదైన గుర్తింపు దక్కేందుకు ఇంకాస్త కష్టపడాల్సిన అవసరం ఉంది.
కలిసివచ్చే రంగు : నీలం

మిథునం (మే 21 – జూన్‌ 20)
అన్ని విషయాల్లోనూ అతి జాగ్రత్త ప్రదర్శిస్తూ మీదైన ప్రతిభను ప్రపంచానికి చూపలేకపోతున్నారు. ఎక్కువ భయపడిపోయి అనవసరంగా అందివచ్చిన అవకాశాలను దూరం చేసుకోకండి. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం ఇది. అయితే మీకంటూ ఒక అవగాహన వచ్చేవరకూ వేచిచూడండి. ప్రేమ జీవితం బాగుంటుంది. ఇప్పటికి మిమ్మల్ని ఇబ్బంది పెడుతోన్న సమస్యలన్నీ ఇంకొన్ని రోజులూ అలాగే ఉంటాయి. అయితే ఆ తర్వాత అంతా బాగుంటుందని నమ్మండి.
కలిసివచ్చే రంగు : ఆకుపచ్చ

కర్కాటకం (జూన్‌ 21 – జూలై 22)
ఎప్పట్నుంచో ఎదురుచూస్తోన్న విజయం త్వరలోనే దక్కుతుంది. అయితే అందుకు మీ శ్రమనంతా ఎప్పట్లానే వెచ్చించాల్సి ఉంటుంది. కష్టపడకుండా, విజయంపై ధీమా కోల్పోయి పనిచేస్తే అది అంతకంతకూ దూరమవుతుందన్న విషయాన్ని తెలుసుకోండి. మార్పు సూచనలు కనిపిస్తున్నాయి. కొత్త అవకాశాలు ఏవైనా తలుపు తడితే వెంటనే అందిపుచ్చుకోండి. ప్రేమ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు తప్పవు. విహారయాత్రకు వెళ్లే ఆలోచన ఉంటే వెంటనే సన్నాహాలు చేసుకోండి.
కలిసివచ్చే రంగు : ఎరుపు

సింహం (జూలై 23 – ఆగస్ట్‌ 22)
ఈ వారమంతా మీకు చాలా కొత్తగా ఉంటుంది. మీ జీవితాన్ని మలుపు తిప్పే వ్యక్తిని కలుసుకుంటారు. ఈ కొత్త జీవితాన్ని ఆహ్వానించేందుకు సిద్ధంగా ఉండండి. వృత్తి జీవితం సాఫీగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి కాస్త మెరుగుపడుతుంది. కొత్త అవకాశాలు మీ తలుపు తడతాయి. వచ్చిన అవకాశాల్ని వదులుకోకండి. మీదైన ఆలోచనా విధానాన్ని ఎవ్వరి కోసమూ మార్చుకోకండి. మీరు ఎలా ఉండాలనుకుంటే ఎలానే ఉండండి. అంతా మంచే జరుగుతుందన్న నమ్మకంతో ముందడుగు వేయండి.
కలిసివచ్చే రంగు : నారింజ

కన్య (ఆగస్ట్‌ 23 – సెప్టెంబర్‌ 22)
ఎప్పట్నుంచో మిమ్మల్ని ఇబ్బంది పెడుతోన్న సమస్యలన్నింటికీ ఓ పరిష్కారం దొరుకుతుంది. కొత్త అవకాశాలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. మీ స్థాయికి తగ్గ అవకాశాన్ని ఎంచుకోవడంలో జాగ్రత్తపడండి. విజయం వైపుకు  మొదటి అడుగు ఈ వారమే వేస్తారు. ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. అప్పుడు విజయం మీ వెంటే ఉంటుంది. ప్రేమ జీవితం బాగుంటుంది. మీ జీవిత భాగస్వామికి ఎక్కువ సమయం కేటాయించండి.
కలిసివచ్చే రంగు : పసుపు

తుల (సెప్టెంబర్‌ 23 – అక్టోబర్‌ 22)
ఈ వారం మీకు కొన్ని అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. ఊహించని చిక్కుల్లో చిక్కుకుంటారు. ధైర్యంగా ఈ పరిస్థితులను ఎదుర్కొండి. జీవితంలో ఇలాంటి పరిస్థితులు అందరికీ ఎదురవుతాయన్న విషయం తెలుసుకోండి. ఏం చేయాలో తోచని పరిస్థితే ఉంటే కొన్నాళ్లు అన్నింటికీ దూరంగా ఉండండి. ఏదైనా విహారయాత్రకు వెళ్లి రండి. మీ మనసుకు ప్రశాంతత చేకూరాకే నిర్ణయం తీసుకోండి. ఈ సమయం ఇంకొన్ని రోజులే, తర్వాత అంతా మంచే జరుగుతుంది.
కలిసివచ్చే రంగు : గులాబి

వృశ్చికం (అక్టోబర్‌ 23 – నవంబర్‌ 21)
ప్రేమ జీవితం కొత్తగా ఉంటుంది. ఎప్పుడూ లేనంత సంతోషంగా రాబోయే రోజులను గడుపుతారు. జీవిత భాగస్వామికి ఎక్కువ సమయం కేటాయిస్తారు. కొత్త అవకాశాలు అందిపుచ్చుకుంటారు. మీ ప్రతిభను చాటుకునేందుకు ఇదే సరైన సమయం. వృత్తి జీవితంలో మార్పు కనిపిస్తోంది. ఈ మార్పు మీ జీవితాశయానికి దగ్గరగా ఉంటుంది. గతాన్ని గురించి ఎక్కువ ఆలోచించకుండా, వర్తమానాన్ని పూర్తి స్థాయిలో ఆస్వాధించడం అలవాటు చేసుకోండి.
కలిసివచ్చే రంగు : గోధుమ

ధనుస్సు (నవంబర్‌ 22 – డిసెంబర్‌ 21)
గతం గురించి ఆలోచిస్తూ కూర్చొని ఇప్పటికే చాలా అవకాశాలు పోగొట్టుకున్నారు. గతాన్ని వదిలిపెట్టి కొత్తగా జీవితాన్ని మళ్లీ మొదలుపెట్టండి. మీకోసం ఓ కొత్త జీవితం ఎదురుచూస్తోంది. దాన్ని ఆహ్వానించండి. ఒంటరితనంతో మిమ్మల్ని మీరు దూరం చేసుకోకండి. జీవితాశయం వైపుకు అడుగులు వేయాల్సిన సమయం ఇది. కొత్త వ్యక్తులను కలుసుకుంటారు. ఎక్కువ ఒత్తిడికి లోనుకాకండి. అవసరమైతే ఏదైనా విహారయాత్రకు వెళ్లండి. ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్త అవసరం.
కలిసివచ్చే రంగు : నారింజ

మకరం (డిసెంబర్‌ 22 – జనవరి 19)
ఏదీ ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకునే స్వభావమే మీరు అన్నింట్లో వెనుకబడడానికి కారణం అన్న విషయం గ్రహించండి. కాస్త జాగ్రత్తగా ఆలోచించి, ఆచితూచి మీ ఆశయం వైపుకు అడుగులు వేయించే నిర్ణయాలనే తీసుకోండి. అలాంటి అవకాశాలనే అందిపుచ్చుకోండి. విజయం మీ వెంట ఉంటుంది. మీ ప్రతిభ వృధాగా ఉండిపోకూడదు. మీ అనుభవం, స్థాయికి తగ్గ పనులనే చేయండి. ప్రేమ జీవితం కొంత కలవరపెడుతుంది. పిచ్చి నమ్మకాలను పక్కనబెట్టి మీ శక్తినంతా కేంద్రీకరించి పనిచేయండి.
కలిసివచ్చే రంగు : ముదురు ఆకుపచ్చ

కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18)
ఎప్పట్నుంచో మిమ్మల్ని వెంటాడుతోన్న భయాలు ఇంకొన్నాళ్లు అలాగే కొనసాగుతాయి. అయితే ఇదంతా శాశ్వతం కాదని నమ్మండి. ఇప్పటికైనా ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవడం అలవాటు చేసుకోండి. ఒక కీలక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. మీ భయాలను పక్కనబెట్టి ఈ నిర్ణయం తీసుకోండి. ప్రేమ జీవితం కొత్తగా ఉంటుంది. జీవిత భాగస్వామికి ఎక్కువ సమయం కేటాయించండి.
కలిసివచ్చే రంగు : ముదురు గులాబి

మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20)
అతిగా ఆలోచిస్తూ కూర్చునే మీ స్వభావం మారాల్సిన సమయం ఇది. ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో పనిచేయండి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. అలాగే వ్యాయామం చేయడాన్ని కూడా అలవాటుగా మార్చుకోండి. కొత్త అవకాశాలు అందిపుచ్చుకుంటారు. అందులో కొన్ని ఒడిదుడుకులు ఉన్నా మీ శక్తినంతా వెచ్చించి పనిచేయండి. విజయం మీ వైపే ఉంటుంది. ప్రేమ జీవితం బాగుండటం లేదు. జీవిత భాగస్వామితో మనసు విప్పి మాట్లాడండి.
కలిసివచ్చే రంగు : పసుపు
- ఇన్సియా టారో అనలిస్ట్‌

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top