వారఫలాలు

Varaphalalu in this week - Sakshi

12 ఆగస్టు నుంచి 18 ఆగస్టు 2018 వరకు

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
అనుకున్న పనులు జాప్యం లేకుండా పూర్తి చేస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. సన్నిహితులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. పోటీపరీక్షల్లో విజయం. నూతన పరిచయాలు ఏర్పడతాయి. ఆపదలో ఉన్న  ఒకరిని ఆదుకుంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో కొత్త హోదాలు. పారిశ్రామికవర్గాలకు అనుకూల సమాచారం. వారం చివరిలో ధనవ్యయం. మిత్రులతో విరోధాలు. పసుపు, లేత ఆకుపచ్చ రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోíß ణి, మృగశిర 1,2 పా.)
ఇంతకాలం శ్రమ ఫలిస్తుంది. నూతనోత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. మధ్యమధ్యలో ఆరోగ్యం కొంత మందగించినా ఉపశమనం లభిస్తుంది. మీ నిర్ణయాల కోసం కుటుంబసభ్యులు వేచిచూస్తారు. ఒక లేఖలోని సమాచారం ఊరట కలిగిస్తుంది.  ఆర్థిక ప్రగతి కనిపిస్తుంది. విద్యార్థుల యత్నాలలో పురోగతి. వ్యాపారాలు మరింత అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో పైచేయి సాధిస్తారు. రాజకీయవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. ఇంటాబయటా ఒత్తిడులు. నేరేడు, లేతగులాబీ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాస్తోత్రాలు పఠించండి.

మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
ముఖ్యమైన పనులలో అవాంతరాలు తొలగుతాయి. మీఖ్యాతి విస్తృతమవుతుంది. ఇంటాబయటా అనుకూల పరిస్థితి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. ఆర్థిక లావాదేవీల్లో చిక్కులు తొలగుతాయి. స్వల్ప ఆరోగ్య సమస్యలు.  పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. నూతన వస్తు, వస్త్రలాభాలు. నిరుద్యోగులకు కార్యసిద్ధి. వ్యాపారాలలో నూతన పెట్టుబడులు. ఉద్యోగాలలో బాధ్యతలు సమర్ధవంతంగా నిర్వహిస్తారు. కళాకారులకు ఊహించని అవకాశాలు దక్కవచ్చు. వారం మధ్యలో ధనవ్యయం. శ్రమాధిక్యం. గులాబీ, ఆకుపచ్చ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహస్తోత్రాలు పఠించండి.

కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. పనులు ముందుకు సాగవు. ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటుంబసమస్యలతో కుస్తీపడతారు. ఆరోగ్యంపై దృష్టి పెట్టండి. బంధువులతో తగాదాలు ఏర్పడతాయి. కష్టానికి తగ్గ ఫలితం కనిపించదు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగుల యత్నాలలో ఆటంకాలు. వ్యాపారాలు సామాన్యంగానే ఉంటాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు పెరుగుతాయి. పారిశ్రామికవర్గాలకు నిరాశాజనకం, విదేశీ పర్యటనలు రద్దు. వారం మధ్యలో శుభవార్తలు. ధనలబ్ధి. ఎరుపు, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్‌ఛాలీసా పఠించండి.

సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
మరింత ఉత్సాహంతో పనులు చక్కదిద్దుతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విద్యార్థులకు అనుకూల ఫలితాలు కనిపిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఆనందంగా గడుపుతారు. ఇంతకుముందు కంటే ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో సఖ్యత ఏర్పడుతుంది. కాంట్రాక్టర్లకు శుభవార్తలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. కళారంగం వారికి ఆకస్మిక విదేశీ పర్యటనలు ఉంటాయి. వారం చివరిలో అనారోగ్యం. కుటుంబసమస్యలు. గులాబీ, తెలుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీస్తుతి చేయండి.

కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
దీర్ఘకాలిక సమస్యల నుంచి గట్టెక్కుతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఆనందంగా గడుపుతారు. ఒక ముఖ్యమైన సమాచారం విద్యార్థులకు ఊరటనిస్తుంది. పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయమవుతారు. ఇది మీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. చిరకాల స్వప్నం నెరవేరుతుంది. వ్యాపారాలలో ఊహించని లాభాలు. ఉద్యోగాలలో అనుకూల మార్పులు. రాజకీయవర్గాలకు కొత్త పదవులు దక్కుతాయి. వారం ప్రారంభంలో అనుకోని ధనవ్యయం. కుటుంబసభ్యులతో కలహాలు. పసుపు, లేత ఎరుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.

తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి. సోదరులు, మిత్రులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. నిరుద్యోగులు విజయాలు సాధిస్తారు. గతం గుర్తుకు తెచ్చుకుంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వివాహాది శుభకార్యాలకు హాజరవుతారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలు విస్తరించి ముందడుగు వేస్తారు. ఉద్యోగాలలో ఊహించని విధంగా పదోన్నతులు. కళారంగం వారికి అవార్డులు, సన్మానాలు. వారం చివరిలో వ్యయప్రయాసలు. ఆరోగ్యభంగం. నీలం, ఆకుపచ్చ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయస్వామికి అర్చనలు చేయండి.

వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. చిరకాల ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. పనుల్లో విజయం సాధిస్తారు. ఇంటాబయటా మీకు ఎదురులేని పరిస్థితి ఉంటుంది. సోదరుల నుంచి ధనలబ్ధి. విద్యార్థులకు శుభవార్తలు. తీర్థయాత్రలు చేస్తారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. పారిశ్రామికవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం మధ్యలో ఆస్తి వివాదాలు. అనారోగ్యం. ఎరుపు, నేరేడు రంగులు. ఉత్తరదిశప్రయాణాలు అనుకూలం. కనకధారాస్తోత్రాలు పఠించండి.

ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
ఆర్థిక వ్యవహారాలు ఇంతకుముందుతో పోల్చుకుంటే  సంతృప్తికరంగా ఉంటాయి. కొన్ని పనులు అప్రయత్నంగా పూర్తి కాగలవు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. శత్రువులు కూడా మిత్రులుగా మారతారు. విద్యార్థులకు అనుకూల పరిస్థితులు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో కొత్త హోదాలు దక్కుతాయి. కళారంగం వారికి సత్కారాలు జరుగుతాయి. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. బంధువిరోధాలు. గులాబి, తెలుపురంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీఖడ్గమాల పఠించండి.

మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు. ప్రారంభంలో కొన్ని వివాదాలు నెలకొన్నా పరిష్కారమవుతాయి. చిరకాల కోరిక నెరవేరే సమయం. ఆప్తులు సహాయపడతారు. అందరిలోనూ మంచి గుర్తింపు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి రుణబాధలు తొలగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. మిత్రుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో మరింత ఉత్సాహం. రాజకీయవర్గాలకు పదవీయోగం. వారం ప్రారంభంలో శ్రమాధిక్యం. ఆరోగ్యసమస్యలు. నలుపు, లేత నీలం రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి.

కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
కొన్ని సమస్యలు వాటంతట అవే తీరతాయి. ఆప్తులు, బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఆర్థిక వ్యవహారాలలో పురోగతి ఉంటుంది. ఆస్తి వివాదాల నుంచి కొంతవరకూ గట్టెక్కుతారు. ఆలయాలు సందర్శిస్తారు. వివాహ, ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. సంభలు, సమావేశాలలో పాల్గొంటారు. వాహనయోగం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో కొన్ని మార్పులు ఉండవచ్చు. కళారంగం వారికి ప్రయత్నాలు సఫలం. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. నేరేడు, ఆకుపచ్చ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.

మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆప్తుల సలహాలు,సూచనలు పాటిస్తారు. అనుకున్న విధంగా ధనలాభాలు ఉంటాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. బంధువులతో సఖ్యత నెలకొంటుంది. ఆరోగ్యం కొంత ఇబ్బంది కలిగించవచ్చు. విద్యార్థుల యత్నాలు సానుకూలమవుతాయి. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలలో అడుగు ముందుకు వేస్తారు. వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. ఉద్యోగాలలో చిక్కులు అధిగమిస్తారు. రాజకీయవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం చివరిలో శ్రమ పెరుగుతుంది. కుటుంబసభ్యులతో తగాదాలు. ఎరుపు, లేత పసుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. రాఘవేంద్రస్తోత్రాలు పఠించండి.
సింహంభట్ల సుబ్బారావు జ్యోతిష్య పండితులు

టారో(12 ఆగస్టు నుంచి  18 ఆగస్టు, 2018 వరకు
మేషం (మార్చి 21 – ఏప్రిల్‌ 19)
పనులు వేగం పుంజుకుంటాయి. వృత్తి ఉద్యోగాల్లో పురోగతి సాధిస్తారు. జీవితంలోని కొన్ని ముఖ్యమైన లక్ష్యాలను సాధిస్తారు. దూర ప్రయాణాలు చేస్తారు. ఒక చిరకాల స్వప్నం నెరవేరే సూచనలు ఉన్నాయి. ఇంటా బయటా సంతోషకరమైన పరిస్థితులు ఉంటాయి. ప్రేమికుల మధ్య పరస్పర అవగాహన పెరిగి, అనుబంధం మరింతగా బలపడుతుంది. స్థిరాస్తుల్లో పెట్టుబడుకులకు ఇది పూర్తిగా అనుకూలమైన కాలం. విలువైన విలాస వస్తువులను కొనుగోలు చేస్తారు. పెద్దల ఆశీస్సులు పొందుతారు. ముఖ్యమైన పనుల్లో పలుకుబడి గల వారి సాయం అందుతుంది.
లక్కీ కలర్‌: ముదురు గులాబి

వృషభం (ఏప్రిల్‌ 20 – మే 20)
కొత్త దిశలో ముందుకు సాగాల్సిన సమయం ఆస్నమైంది. ఇల్లు లేదా కార్యాలయం మీకు అనుకూలమైన కొత్త చోటుకు మారే సూచనలు ఉన్నాయి. ఈ వారంలో చోటు చేసుకునే మార్పులు మీకు అదృష్టాన్ని తీసుకొస్తాయి. విమర్శలు మనస్తాపం కలిగించవచ్చు. మీరు చేయాల్సిందల్లా వాటిని పట్టించుకోకుండా మిమ్మల్ని మీరు ప్రోత్సహించుకుంటూ ముందుకు సాగడమే. ఒంటరిగా ఉన్నవారికి తగిన జంట దొరుకుతుంది. చాలాకాలంగా ఇష్టం పెంచుకున్న వ్యక్తితో ప్రేమానుబంధం మొదలవుతుంది. తాజా అనుబంధంతో కొత్త ఉత్సాహాన్ని సంతరించుకుంటారు.
లక్కీ కలర్‌: లేత పసుపు

మిథునం (మే 21 – జూన్‌ 20)
ఊహాలోకం నుంచి ఇకనైనా బయటపడటం మేలు. వాస్తవ పరిస్థితులను ఎదుర్కోవడానికి సిద్ధపడండి. ఒక క్లిష్టమైన సమస్య నుంచి బయటపడతారు. స్వేచ్ఛా స్వాతంత్య్రాలను అనుభవిస్తారు. మార్పును స్వీకరిస్తారు. పరిస్థితులు క్రమ క్రమంగా మెరుగుపడతాయి. ప్రతికూల భావనల నుంచి బయటపడటానికి ప్రయత్నిస్తారు. ఊపిరిసలపనంతగా పనిలో మునిగిపోతారు. పెద్దల ఆశీస్సులు పొందుతారు. వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు కొంత నిరాశాజనకంగా ఉంటాయి. ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాల్సి వస్తుంది. ఆధ్యాత్మికత వైపు మొగ్గుతారు.
లక్కీ కలర్‌: జేగురు రంగు

కర్కాటకం (జూన్‌ 21 – జూలై 22)
ఎలాంటి నిర్మాణానికైనా పునాదులు ఎంత కీలకమో, ఎలాంటి కార్యసాధనకైనా సంకల్పమే కీలకమని అనుభవపూర్వకంగా తెలుసుకుంటారు. జీవితాన్ని మార్చేసే గొప్ప అవకాశాలు అందివస్తాయి. అదృష్టం మీ తలుపు తడుతుంది. కొత్త వ్యాపారాల్లో పెట్టుబడులు పెడతారు. స్థిరాస్తులను సొంతం చేసుకుంటారు. కొత్త వాహనాన్ని కొనుగోలు చేసే సూచనలు ఉన్నాయి. సుదూర ప్రయాణాలకు వెళతారు. వృత్తి ఉద్యోగాల్లో నాయకత్వ సామర్థ్యాన్ని నిరూపించుకుంటారు. సహచరుల సహకారంతో పెద్ద లక్ష్యాలను తేలికగా సాధిస్తారు. బరువు తగ్గడం కోసం వ్యాయామం ప్రారంభిస్తారు.
లక్కీ కలర్‌: ఆకుపచ్చ

సింహం (జూలై 23 – ఆగస్ట్‌ 22)
జీవితంలోని అత్యంత ప్రాధాన్యమైన అంశాలపైనే దృష్టి సారించండి. అనవసరమైన అంశాలపై దృష్టి పెట్టడం వల్ల గందరగోళంలో చిక్కుకునే సూచనలు ఉన్నాయి. సృజనాత్మక రంగంలోని వారు అద్భుతాలను సాధిస్తారు. వ్యాపార రంగంలోని వారు కొత్త భాగస్వామ్య ఒప్పందాలను వాయిదా వేసుకోవడం మంచిది. కీలకమైన బాధ్యతలను ఇతరుల ప్రమేయం లేకుండా స్వయంగా నిర్వర్తిస్తేనే క్షేమం. పెట్టుబడి ప్రణాళికలను సమీక్షించుకుంటారు. ఆస్తి లావాదేవీల్లో ఆర్థిక లాభాలను అందుకుంటారు. ఆహార నియంత్రణ పాటించాల్సి ఉంటుంది. ఆరోగ్యం మందగించవచ్చు.
లక్కీ కలర్‌: బూడిద రంగు

కన్య (ఆగస్ట్‌ 23 – సెప్టెంబర్‌ 22)
వృత్తి ఉద్యోగాల్లో అద్భుతమైన ఫలితాలను సాధిస్తారు. ఉన్నతాధికారుల ప్రశంసలు పొందుతారు. ఇప్పటికే మీరు చాలా సాధించి ఉంటారు. కృషికి తగిన గుర్తింపు రావాలంటే, కాస్త ప్రచారం మీద కూడా దృష్టి పెట్టాల్సి ఉంటుంది. మీ యోగక్షేమాలపై ఒకరు విపరీతమైన శ్రద్ధ కనపరుస్తారు. మీతో భావోద్వేగాలను పంచుకోవడానికి ఆసక్తి చూపుతారు. ఆర్థికంగా లబ్ధి కలిగించే గొప్ప అవకాశం మీ తలుపు తడుతుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. సేవా కార్యక్రమాలకు ఆర్థిక సాయం చేస్తారు. పని ఒత్తిడి పెరిగి ఆరోగ్యం కొంత మందగించవచ్చు.
లక్కీ కలర్‌: ఊదా

తుల (సెప్టెంబర్‌ 23 – అక్టోబర్‌ 22)
ఆర్థిక వ్యవహారాల్లో ఆచి తూచి అడుగు వేయాల్సి ఉంటుంది. స్పెక్యులేషన్‌ లావాదేవీలకు దూరంగా ఉండటం క్షేమం. స్థిరాస్తి కొనుగోలు నిర్ణయాలు వాయిదాపడతాయి. వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు ప్రోత్సాహకరంగా ఉంటాయి. ఆరోగ్యంపై శ్రద్ధపెడతారు. వైద్యుల సలహాపై ఆహార విహారాల్లో మార్పులు చేపడతారు. చిన్న చిన్న ఒడిదుడుకులు ఎదురైనా, సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతారు. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత బలపడుతుంది. ఇతరుల వివాదాల్లో తలదూర్చకుండా ఉంటేనే క్షేమం. ఆధ్యాత్మిక కేంద్రాలను సందర్శిస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి.
లక్కీ కలర్‌: ఆకుపచ్చ

వృశ్చికం (అక్టోబర్‌ 23 – నవంబర్‌ 21)
జీవితంలో అన్నీ సజావుగా నెరవేర్చి విజయ తీరానికి చేరుకుంటారు. సాధించిన విజయాలను, వాటి ద్వారా లభించే ప్రశంసలను మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తారు. ఇదివరకటి కృషికి తగిన ఫలితాలను అందుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో మరింత మెరుగైన మార్పులు చోటు చేసుకునే సూచనలు ఉన్నాయి. గొప్ప అవకాశం మిమ్మల్ని వెదుక్కుంటూ వస్తుంది. ప్రియతముల కోసం మరింత ఎక్కువ సమయాన్ని కేటాయిస్తారు. కుటుంబంలో సంతోషభరితమైన వాతావరణం నెలకొంటుంది. వృత్తి ఉద్యోగాల్లోనూ, కుటుంబంలోనూ అదనపు బాధ్యతలను స్వీకరించాల్సి వస్తుంది.
లక్కీ కలర్‌: ఊదా

ధనుస్సు (నవంబర్‌ 22 – డిసెంబర్‌ 21)
సామాజికంగా పరపతి పెరుగుతుంది. కొత్త కొత్త పరిచయాలు ఏర్పడతాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు. అవకాశాలను అందిపుచ్చుకుంటారు. ఏకాగ్రత చెదరనివ్వకుండా ఉన్నట్లయితే, త్వరలోనే ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు. రుణాలను తీర్చేస్తారు. ఆర్థిక స్థిరత్వాన్ని సాధిస్తారు. ఆస్తుల కొనుగోలుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో దూకుడు కొనసాగిస్తారు. అనితర సాధ్యమైన లక్ష్యాలను అవలీలగా సాధిస్తారు. వస్త్రాలంకరణలో మార్పులు చేపడతారు. జనాకర్షణ పెంచుకుంటారు. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహభరితంగా సాగుతాయి.
లక్కీ కలర్‌: ముదురు గులాబి

మకరం (డిసెంబర్‌ 22 – జనవరి 19)
అనూహ్యమైన అవకాశం అంది వస్తుంది. ఇన్నాళ్లూ కొనసాగించిన శ్రమకు తగిన ఫలితం, గుర్తింపు లభిస్తాయి. ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. పెట్టుబడులపై లాభాలు అందుకుంటారు. వారసత్వ సంపద కలసివచ్చే సూచనలు ఉన్నాయి. కీలకమైన సమయంలో మీకు సాయం చేసిన వారి పట్ల కృతజ్ఞతలు చాటుకుంటారు. కుటుంబంలో హర్షాతిరేకాలు వెల్లివిరుస్తాయి. శుభకార్యాలు చేపడతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సామాజిక సంబంధాలను మెరుగుపరచుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో పోటీని ఆస్వాదిస్తారు. అంకితభావంతో బాధ్యతలను నెరవేరుస్తారు.
లక్కీ కలర్‌: ముదురాకుపచ్చ

కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18)
భావోద్వేగాలను అదుపు చేసుకోవడం మంచిది. అయిన వారితో అపార్థాలు తలెత్తే సూచనలు ఉన్నాయి. సన్నిహితులతో తగాదాలు ఆరోగ్యంపై ప్రభావం చూపే సూచనలు ఉన్నాయి. సంఘర్షణ వల్ల జీవితంలో ఒరిగేదేమీ లేదని అనుభవపూర్వకంగా తెలుసుకుంటారు. గత జ్ఞాపకాలు వెంటాడుతాయి. సానుకూల భావనలు పెంచుకుని, ఆనందంగా జీవించడానికి ప్రయత్నిస్తారు. ఆర్థిక పరిస్థితి అదుపులోనే ఉంటుంది. త్వరలోనే అదనపు ఆదాయ అవకాశాలు అందివస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు మెరుగుపడతాయి. ధ్యానంతో సాంత్వన పొందుతారు.
లక్కీ కలర్‌: తెలుపు

మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20)
కొత్త పనులు ప్రారంభిస్తారు. కార్యాచరణకు రంగం సిద్ధం చేసుకుంటారు. కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటారు. భవిష్యత్తుకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితుల్లో కాస్త ఆచి తూచి అడుగేయడం మంచిది. ప్రియతములతో తలెత్తిన అపార్థాలను తొలగించుకుంటారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉంటుంది. విద్యార్థులు సత్ఫలితాలను సాధిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో మార్పులు చోటు చేసుకుంటాయి. కుటుంబ సభ్యులతో కలసి పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. ఆధ్యాత్మిక గురువుల ఆశీస్సులు అందుకుంటారు. 
లక్కీ కలర్‌: ముదురు ఊదా
- ఇన్సియా టారో అనలిస్ట్‌ 

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top