వారఫలాలు

varaphalalu for this week - Sakshi

20 మే నుంచి 26 మే 2018 వరకు

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
కొత్త పనులు చేపడతారు. ఆలోచనలు అమలు చేస్తారు. కొన్ని ముఖ్య విషయాలలో నిర్ణయాలు తీసుకుంటారు.  వేడుకలకు హాజరవుతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని సంతోషంగా గడుపుతారు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. గృహం, వాహనాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థులు అనుకున్న ఫలితాలు సాధిస్తారు. వ్యాపారాలు అనుకూలించి లాభాలు అందుకుంటారు. వారం ప్రారంభంలో ధనవ్యయం. ఆరోగ్యసమస్యలు. తెలుపు, నేరేడు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాస్తోత్రాలు పఠించండి.

వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా.)
కొన్ని ఇబ్బందులు క్రమేపీ తొలగుతాయి. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా సాగుతాయి. పరిచయాలు పెరుగుతాయి. ఆత్మీయుల నుంచి పిలుపు రావచ్చు. స్థిరాస్తి విషయంలో చికాకులు తొలగుతాయి. ఇంటాబయటా అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు ఉండవచ్చు.  శ్రమ పెరుగుతుంది. ఎరుపు, లేత పసుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. శివపంచాక్షరి పఠించండి.

మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
ఆర్థిక వ్యవహారాలు నిరాశ పరుస్తాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. ఆస్తి వివాదాలు నెలకొంటాయి. సోదరులు, బంధువులతో విభేదాలు ఏర్పడతాయి. ఇంటి నిర్మాణయత్నాలు నెమ్మదిస్తాయి. ఆరోగ్యసమస్యలు వేధిస్తాయి. విద్యార్థులు మరింత శ్రమ పడాలి. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో మరిన్ని బాధ్యతలు మీదపడతాయి. రాజకీయవర్గాలకు పర్యటనలు వాయిదా పడవచ్చు. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. పసుపు, నేరేడు రంగులు.  పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
కొత్త వ్యక్తులు పరిచయం కాగలరు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులు, మిత్రులతో ఆనందంగా గడుపుతారు.విద్యార్థులకు అనుకూల ఫలితాలు ఉంటాయి. కుటుంబసభ్యులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.  ఆస్తి విషయంలో ఒప్పందాలు కుదుర్చుకుంటారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో ప్రమోషన్లు దక్కవచ్చు. రాజకీయవర్గాలకు పదవీయోగం. గులాబి, తెలుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
చేపట్టిన పనులు సకాలంలో పూర్తి కాగలవు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు  తీరతాయి. వాహన, గృహయోగాలు కలుగుతాయి. పరిస్థితులు అనుకూలిస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. విద్యార్థులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. ఒక సంఘటన ఆకట్టుకుంటుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో అనూహ్యమైన మార్పులు ఉండవచ్చు. కళారంగం వారికి ఆశలు ఫలిస్తాయి. వారం ప్రారంభంలో ధనవ్యయం. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. ఎరుపు, ఆకుపచ్చ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి.

కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. సన్నిహితులు, మిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఆస్తి వివాదాలు తీరతాయి. అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఇంటి నిర్మాణయత్నాలు సాగిస్తారు. విద్యార్థులు అనుకున్న ఫలితాలు సాధిస్తారు. జీవిత భాగస్వామి ద్వారా ఆస్తిలాభ సూచనలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగి ఊరట చెందుతారు. రాజకీయవర్గాలకు కొత్త పదవులు రావచ్చు. వారం చివరిలో వ్యయప్రయాసలు. కుటుంబసభ్యులతో కలహాలు. గులాబి, లేత పసుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.

తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
నూతన పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు. మిత్రుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. సోదరులతో వివాదాలు పరిష్కారమవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. పరిస్థితులు అనుకూలిస్తాయి. విద్యార్థులు, నిరుద్యోగులకు అనుకూల ఫలితాలు లభిస్తాయి. ప్రముఖుల నుంచి సహాయసహకారాలు అందుతాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ఇబ్బందులు తొలగుతాయి. గులాబి, నీలం రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశ్‌స్తోత్రాలు పఠించండి.

వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
ఆర్థిక వ్యవహారాలలో పురోగతి కనిపిస్తుంది. గతం నుంచి వేధిస్తున్న కొన్ని సమస్యలు తీరి ఊరట చెందుతారు. స్థిరాస్తి విషయంలో ఒప్పందాలు చేసుకుంటారు. పూర్వపు మిత్రులను కలుసుకుని ముఖ్య విషయాలు చర్చిస్తారు. సంఘంలో ఎనలేని గౌరవం పొందుతారు. విద్యార్థులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. కొన్ని పనులు పూర్తి చేస్తారు.  వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో చిక్కులు వీడతాయి.  కుటుంబసభ్యులతో విభేదాలు. పసుపు, నేరేడు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.

ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
అనుకున్న పనులు విజయవంతంగా సాగుతాయి. ఆప్తులు, శ్రేయోభిలాషుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి కాస్త నిరుత్సాహపరిచినా క్రమేపీ అనుకూలిస్తుంది. కొన్ని వివాదాలు చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. విద్యార్థులు, నిరుద్యోగులకు అనుకూల సమయం. వ్యాపారాలు విస్తరిస్తారు. పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు ఉండవచ్చు. కళారంగం వారికి మంచి గుర్తింపు రాగలదు.  బంధువిరోధాలు. అనారోగ్యం. గులాబి, ఎరుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీస్తోత్రాలు పఠించండి.

మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
చేపట్టిన పనులు మొదట్లోకొంత నెమ్మదిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. రుణబాధలు తీరతాయి. మిత్రులు, బంధువుల సలహాలు తీసుకుంటారు. ప్రముఖుల నుంచి కీలక సమాచారం రాగలదు. భూవివాదాలు పరిష్కరించుకుంటారు. వాహనాలు, గృహం కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు లాభిస్తాయి. విస్తరణలో ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగాలలో పదోన్నతులు రావచ్చు. పారిశ్రామికవర్గాలకు విదేశీ ఆహ్వానాలు అందుతాయి. నలుపు, ఆకుపచ్చ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి.

కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
పనులు చకచకా పూర్తి చేస్తారు. సంఘంలో విశేష గౌరవం. ఆస్తివ్యవహారాలలో చిక్కులు తొలగుతాయి. సోదరులు, మిత్రులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. వాహనయోగం. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది. బంధువుల నుంచి పిలుపు అందుతుంది.
విద్యార్థులు అనుకున్న ఫలితాలు సాధిస్తారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో పదోన్నతులు దక్కుతాయి. రాజకీయవర్గాలకు పదవీయోగం. వారం చివరిలో ధనవ్యయం. మానసిక అశాంతి. పసుపు, నేరేడు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.

మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
ఆర్థిక వ్యవహారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. ఆప్తులు మరింత దగ్గరవుతారు. అందరిలోనూ గుర్తింపు పొందుతారు. స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విద్యార్థులకు ప్రతిభ వెలుగులోకి రాగలదు. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. చిరకాల మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.ఉద్యోగాలలో లక్ష్యాలు సాధిస్తారు. రాజకీయవర్గాలకు సత్కారాలు. వారం ప్రారంభంలో స్వల్ప అనారోగ్యం. కుటుంబంలో చికాకులు. ఎరుపు, తెలుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

- సింహంభట్ల సుబ్బారావు ,జ్యోతిష్య పండితులు

టారో  (20 మే నుంచి 26 మే, 2018 వరకు)
మేషం (మార్చి 21 – ఏప్రిల్‌ 19)
ఈవారమంతా చాలా ఉత్సాహంగా గడుపుతారు. నలుగురి మెప్పు పొందుతూ, అందరికీ మంచి జరగాలనే మీ మనస్తత్వమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. వారాంతంలో ఓ గొప్ప అవకాశాన్ని సొంతం చేసుకుంటారు. మీదైన ఆత్మవిశ్వాసంతో పనిచేస్తూ ముందుకెళ్లండి. కొత్త వ్యక్తి పరిచయం మీ ఆలోచనా విధానాన్ని మారుస్తుంది. ప్రశాంతమైన జీవితాన్ని వెతుక్కుంటూ వెళతారు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఆరోగ్యం జాగ్రత్త . ప్రేమ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది.
కలిసివచ్చే రంగు : తెలుపు

వృషభం (ఏప్రిల్‌ 20 – మే 20)
గతాన్ని గురించి ఎంత ఆలోచించినా ప్రయోజనం ఉండదన్న విషయం మీకు తెలియాలి. ఎప్పటికప్పుడు మిమ్మల్ని మీరు కొత్తగా ఆవిష్కరించుకుంటూ ముందుకెళ్లండి. ప్రేమ జీవితం ఎప్పట్లానే కొంత గందరగోళంగానే ఉంటుంది. అయినప్పటికీ ప్రేమ మాత్రమే మిమ్మల్ని సంతోషంగా ఉంచగలిగే గొప్ప విషయమని తెలుసుకోండి. ఆర్థిక పరిస్థితి ఎప్పట్లానే చాలా బాగుంటుంది. కొత్త వ్యాపార ఆలోచనలు కూడా చేస్తారు. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే పరిస్థితి వస్తుంది. మీరు బాగా నమ్మే వ్యక్తుల సహకారం తీసుకుంటారు.
కలిసివచ్చే రంగు : పీచ్‌

మిథునం (మే 21 – జూన్‌ 20)
గొప్ప జీవితాన్ని అందరూ కలగంటారు. అందుకు మీకుగా మీరేం చేస్తున్నారో ఒక్కసారి ఆలోచించుకోండి. వారం చివర్లో ఊహించని అవకాశం ఒకటి మీ తలుపు తడుతుంది. మీ ఆలోచనా విధానం మారాల్సిన అవసరం చాలా ఉంది. మారే ఈ ఆలోచనా విధానమే మిమ్మల్ని విజయం వైపుకు నడిపిస్తుంది. కొత్త వ్యక్తుల పరిచయం మిమ్మల్ని మీకు కొత్తగా ఆవిష్కరించి చూపుతుంది. ప్రేమ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. మీకిష్టమైన వ్యక్తికి ఎక్కువ సమయం కేటాయిస్తారు.
కలిసివచ్చే రంగు : వయొలెట్‌

కర్కాటకం (జూన్‌ 21 – జూలై 22)
జీవితం అందరికీ ఏదో ఒక సమయంలో ఒక గట్టి పరీక్ష పెడుతుంది. అందులో గెలిచామా లేదా అనేకన్నా, ఆ పరీక్షను తట్టుకొని నిలబడటమే జీవితం. కొన్ని గొప్ప అవకాశాలు వచ్చేముందు చాలాసార్లు ఎలాంటి సంకేతాలూ కనిపించవు. అలాంటి వాటికోసం ఎప్పటికప్పుడు మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకుంటూనే ఉండండి. ఈ వారమంతా ఉత్సాహంగా గడుపుతారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. ఇది మీకు ఎప్పట్నుంచో కోరుకుంటున్న ప్రశాంతతను తెచ్చిపెడుతుంది. వృత్తి జీవితంలో చిన్న చిన్న మార్పులు కనిపిస్తున్నాయి.
కలిసివచ్చే రంగు : ఆకుపచ్చ  

సింహం (జూలై 23 – ఆగస్ట్‌ 22)
మీ జీవితం ఇప్పుడిప్పుడే మీరు కోరుకున్న వైపుకు వెళుతోంది. ఏ పని జరిగాలన్నా ముందు మిమ్మల్ని మీరు బలంగా నమ్మాలన్నది తెలుసుకోండి. మీరు ఊహించని ఒక విజయం మీకు దగ్గరగా వచ్చి ఉంది. మీదైన ఆత్మవిశ్వాసంతో పనిచేస్తూ ఆ విజయాన్ని అందిపుచ్చుకోండి. వరుసగా కొత్త కొత్త అవకాశాలు మీ తలుపు తడతాయి. ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉంటుంది. వారం చివర్లో ఓ కొత్త వ్యక్తి మీకు పరిచయమవుతారు. కొంతకాలంగా ఇబ్బంది పెడుతోన్న ఆరోగ్యం కుదుటపడుతుంది.
కలిసివచ్చే రంగు : గులాబి

కన్య (ఆగస్ట్‌ 23 – సెప్టెంబర్‌ 22)
ఎంత కష్టపడి పనిచేసినా కొన్నిసార్లు అనుకున్న ఫలితాలు దక్కవు. ఇక్కడితో నిరాశ పడిపోతే ముందుండే ఒక గొప్ప జీవితాన్ని ఆస్వాదించలేరు. ఏ పనిచేసినా విజయంపై ధీమాతో, చిత్తశుద్ధితో చేస్తూ వెళ్లండి. ఒక కొత్త వ్యక్తి పరిచయం మీ ఆలోచనలను బాగా ప్రభావితం చేస్తుంది. గతాన్ని గురించి ఆలోచించకుండా ఇప్పుడు మీరెలా ఉండాలనుకుంటున్నారో అలా ఉండండి. అందుకు శ్రమించండి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది. ఆర్థిక పరిస్థితి గతంలో కంటే బాగా మెరుగుపడుతుంది.
కలిసివచ్చే రంగు : గులాబి

తుల (సెప్టెంబర్‌ 23 – అక్టోబర్‌ 22)
ఒక్కోసారి ప్రపంచం మిమ్మల్ని మీలా ఉండమని చెబుతూ ప్రతి సందర్భంలో కొన్ని సంకేతాలు ఇస్తుంది. వాటిని సరిగ్గా అర్థం చేసుకొని ముందుకు వెళ్లాల్సిన సమయమిది. చిత్తశుద్ధితో పనిచేస్తే ఎంతటి విజయానికైనా చేరువ కావొచ్చన్నది మీరు తెలుసుకోవాలి. ఈ వారంలోనే మీరెప్పట్నుంచో వినాలనుకుంటున్న ఒక శుభవార్త వింటారు. ఆర్థిక పరిస్థితి ఊహించని స్థాయిలో మెరుగుపడుతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన సమయమిది.
కలిసివచ్చే రంగు : బూడిద

వృశ్చికం (అక్టోబర్‌ 23 – నవంబర్‌ 21)
ఇప్పుడు, ఈ సమయంలో ఏయే విషయాలు మీ మనశ్శాంతిని దెబ్బతీస్తున్నాయో ఆ విషయాలు మీకు తెలియాల్సిన అవసరం ఉంది. పరిస్థితులకు పారిపోకుండా వాటికి ఎదురెళ్లి నిలబడే మీ స్వభావమే మీకొక గొప్ప విజయాన్ని తెచ్చిపెడుతుంది. ఆర్థిక పరిస్థితి గతంలో కంటే బాగా మెరుగుపడుతుంది. ప్రేమ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఎదురైనా వాటిని తట్టుకొని మీ ప్రేమను ప్రపంచానికి అందంగా పరిచయం చేసుకుంటారు. ఆరోగ్యం బాగుంటుంది. విహారయాత్రకు సన్నాహాలు చేసుకుంటారు.
కలిసివచ్చే రంగు : బంగారం

ధనుస్సు (నవంబర్‌ 22 – డిసెంబర్‌ 21)
ఈవారం మీకంతా మంచే జరుగుతుంది. కొన్నిసార్లు గొప్ప విజయాలు ఎదురయ్యేముందు కాలం లెక్కలేనన్ని పరీక్షలు పెడుతుంది. వాటన్నింటికీ నిలబడే శక్తిని కూడగట్టుకుంటారు. వారం చివర్లో ఊహించని అవకాశం ఒకటి మీ తలుపు తడుతుంది. గతాన్ని గురించి ఎక్కువ ఆలోచించకండి. ప్రేమ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. మీకిష్టమైన వ్యక్తికి ఎక్కువ సమయం కేటాయిస్తారు. విహారయాత్రకు సన్నాహాలు చేసుకుంటారు. ఆర్థిక పరిస్థితి సాదాసీదాగా ఉంటుంది.
కలిసివచ్చే రంగు : పసుపు

మకరం (డిసెంబర్‌ 22 – జనవరి 19)
మీ జీవితంలో ఒక్కసారే కొత్త కొత్త మార్పులొచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఇవి మిమ్మల్ని మీకే కొత్తగా పరిచయం చేసే మార్పులు. ఎప్పట్నుంచో మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న ఆరోగ్య సమస్యలన్నీ మెల్లగా సద్దుమణుగుతాయి. ఆత్మవిశ్వాసంతో ఉండటమే సవాళ్లకు మీరు విసరగల సవాలు అని తెలుసుకోండి. అనవసర విషయాల్లో జోక్యం చేసుకొని ఇబ్బందులు ఎదుర్కొంటారు. ప్రేమ జీవితం ఎప్పట్లానే ఆహ్లాదకరంగా ఉంటుంది. కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఉత్సాహం చూపిస్తారు.
కలిసివచ్చే రంగు : లేత ఆకుపచ్చ

కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18)
జీవితంలో ఒక సమయం దాటిపోయాక మీరు ఎంత ప్రయత్నించినా జీవితాశయం వైపుకు అడుగులు వెయ్యలేరు. అందుకు ఇది సరైన సమయమని తెలుసుకొని జీవితాశయం కోసం కష్టపడండి. మిమ్మల్ని నమ్మి మీకిష్టమైన వ్యక్తి ఓ గొప్ప అవకాశాన్ని ఇస్తారు. ఆ అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకొని ముందుకెళతారు. కొన్ని కీలక విషయాల్లో నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఆర్థిక పరిస్థితి సాదాసీదాగా ఉంటుంది. ప్రేమ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది.
కలిసివచ్చే రంగు : కాషాయం  

మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20)
జీవితంలో చాలా విషయాలు అనుభవంలోకి వచ్చాకే విలువైనవిగా కనిపిస్తాయి. ఈవారం మీకిష్టమైన వ్యక్తితో విలువైన సమయాన్ని గడుపుతారు. ఇది మీలో తిరుగులేని ఉత్సాహాన్ని తెచ్చిపెడుతుంది. కొత్త అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొని, విజయం దిశగా వెళ్లేందుకు మిమ్మల్ని మీరు సిద్ధంగా ఉంచుకోండి. వృత్తి జీవితంలో చిన్న చిన్న ఒడిదుడుకులు ఎదురవుతాయి. అందరితో కలిసిపోయే మీ స్వభావమే మిమ్మల్ని అందర్లోకీ ప్రత్యేకంగా నిలుపుతుంది. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది.
కలిసివచ్చే రంగు : గులాబి

- ఇన్సియా టారో అనలిస్ట్‌

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top