వారఫలాలు

varaphalalu inthis week - Sakshi

24 జూన్‌ నుంచి 30 జూన్‌ 2018 వరకు

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు తీరతాయి. ఆస్తి వ్యవహారాలలో అగ్రిమెంట్లు చేసుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. వివాహ, ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. ఆరోగ్యం కాస్త ఉపశమిస్తుంది. సంఘంలో విశేష గౌరవం పొందుతారు. వ్యాపారాలు విస్తరించి, లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో అనుకూల మార్పులకు అవకాశం. పారిశ్రామికవేత్తలకు అరుదైన ఆహ్వానాలు. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబసభ్యులతో కలహాలు. నేరేడు, లేత ఆకుపచ్చ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీఖడ్గమాల పఠించండి.

వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోíß ణి, మృగశిర 1,2 పా.)
నూతన వ్యక్తులు పరిచయమై సహాయపడతారు. ఆర్థికంగా బలపడతారు. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు వస్తాయి. భూముల వివాదాల నుంచి బయటపడతారు. పరిశోధకులకు మంచి గుర్తింపు రాగలదు. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు దక్కించుకుంటారు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు తథ్యం. ఉద్యోగాలలో ఇబ్బందులు తొలగుతాయి. రాజకీయవేత్తలకు సన్మానాలు. వారం చివరిలో ఆరోగ్యసమస్యలు. సోదరులతో కలహాలు. నీలం, ఎరుపురంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి.

మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
వీరికి అన్నింటా విజయాలే ఎదురవుతాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మరింత మెరుగ్గా ఉంటుంది. మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి. కార్యోన్ముఖులై అనుకున్న పనులు చక్కదిద్దుతారు. ఆలోచనలు అమలు చేస్తారు. చిత్రమైన సంఘటనలు ఎదురుకావచ్చు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో సమస్యలు తీరతాయి. ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి. పదోన్నతులు రావచ్చు. కళారంగం వారికి ఊహించని అవకాశాలు. వారం చివరిలో స్వల్ప అనారోగ్యం. బంధువులతో వివాదాలు. గులాబి, నీలం రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహస్తోత్రాలు పఠించండి.

కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
ఇబ్బందులను అధిగమించి ముందడుగు వేస్తారు. ఆత్మీయులు, సోదరులతో సఖ్యత నెలకొంటుంది. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. విద్యార్థులు అనుకున్న ఫలితాలు సాధిస్తారు. వివాహాది శుభకార్యాలలో పాల్గొంటారు. వస్తులాభాలు. ప్రత్యర్థుల నుంచి అనుకూల సందేశం. వ్యాపారాలు ఉత్సాహవంతంగా ఉంటాయి. ఉద్యోగాలలో కోరుకున్న మార్పులు తథ్యం. పారిశ్రామికవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. ఆరోగ్యభంగం. తెలుపు, ఆకుపచ్చ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి.

సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
ముఖ్యమైన పనులు కుటుంబసభ్యుల చేయూతతో పూర్తి చేసి, ఆనందంగా గడుపుతారు.శత్రువులు కూడా స్నేహహస్తం అందిస్తారు. ప్రముఖుల నుంచి ముఖ్య సమాచారం రాగలదు. ఆర్థిక విషయాలు ఆశాజనకంగా ఉంటాయి. వాహనాలు, భూములు కొంటారు. సోదరులు, సోదరులతో ఉత్సాహంగా గడుపుతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు విస్తరించి లాభాలు గడిస్తారు. ఉద్యోగాలలో పురోగతి కనిపిస్తుంది. కళారంగం వారికి సత్కారాలు. వారం మధ్యలో అనారోగ్యం. కుటుంబంలో సమస్యలు. ఎరుపు, లేత పసుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి.

కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
ఆర్థిక వ్యవహారాలలో గందరగోళం నెలకొంటుంది. కొత్త రుణాలు చేయాల్సివస్తుంది. బంధువులు, మిత్రులతో విభేదాలు నెలకొనవచ్చు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఏ పని చేసినా ఆచితూచి వ్యవహరించండి. ఆలోచనలు కలిసిరావు. కుటుంబసమస్యలతో సతమతమవుతారు. తీర్థయాత్రలు చేస్తారు. ఉద్యోగయత్నాలు నెమ్మదిస్తాయి. ఆస్తి విషయంలో ఒప్పందాలు చేసుకుంటారు. వ్యాపారాలలో లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి. పారిశ్రామికవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం మధ్యలో శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. గులాబి, ఆకుపచ్చరంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.

తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఆస్తి వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. విద్యార్థులు ఊహించని ఫలితాలు సాధిస్తారు.  ప్రత్యర్థులు సైతం మీకు విధేయులుగా మారతారు. వాహనయోగం. కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలలో నూతన పెట్టుబడులు సమకూర్చుకుంటారు. ఉద్యోగాలలో సమస్యల నుంచి బయటపడతారు. కళారంగం వారికి అవకాశాలు పెరుగుతాయి. పసుపు, లేత ఎరుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్‌ ఛాలీసా పఠించండి.

వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
పరిస్థితులు అనుకూలిస్తాయి. ఇంటాబయటా మీదే పైచేయిగా ఉంటుంది. సన్నిహితులు చేదోడుగా నిలుస్తారు. ఆర్థిక వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. కాంట్రాక్టర్లకు శుభవార్తలు. గతం గుర్తుకు తెచ్చుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు ఉండవచ్చు. రాజకీయవర్గాలకు కొత్త పదవులు దక్కుతాయి. వారం ప్రారంభంలో స్వల్ప వివాదాలు. ఆరోగ్యసమస్యలు. గులాబి, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. కనకధారాస్తోత్రాలు పఠించండి.

ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
మిత్రులతో విభేదాలు తొలగుతాయి. పనులు చకచకా పూర్తి కావడంలో కుటుంబసభ్యులు సహకరిస్తారు. నూతన ఉద్యోగాలు దక్కవచ్చు. అందరిలోనూ గౌరవమర్యాదలు పొందుతారు. పరిచయాలు పెరుగుతాయి. ఊహకు అందనిరీతిలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వాహనాలు, భూములు కొనుగోలు చేసే వీలుంది. విద్యార్థులకు శుభవార్తలు. పుణ్యక్షేత్రాలు  సందర్శిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో పదోన్నతి సూచనలు. కళారంగం వారికి సత్కారాలు. వారం చివరిలో వ్యయప్రయాసలు. బంధువిరోధాలు. ఎరుపు, తెలుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. శివపంచాక్షరి పఠించండి.

మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
ఎంతటి పనినైనా సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మస్థైర్యం, పట్టుదల పెరుగుతుంది. సన్నిహితులు, మిత్రుల సహాయం అందుకుంటారు. అనుకున్న లక్ష్యాల సాధనలో విద్యార్థులు విజయం పొందుతారు. వివాహాది శుభకార్యాలు నిర్వహిస్తారు. సంఘంలో పరపతి పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి ఆశించిన విధంగా ఉంటుంది. వ్యాపారాలు సజావుగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో ఊహించని మార్పులు ఉంటాయి. రాజకీయవర్గాలకు కొత్త ఆశలు చిగురిస్తాయి. వారం మధ్యలో ధనవ్యయం. ఆరోగ్యసమస్యలు. నీలం, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.

కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
ముఖ్యమైన వ్యవహారాలలో పురోగతి కనిపిస్తుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులు, బంధువులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. ఒక సమాచారం నిరుద్యోగులు, విద్యార్థులకు ఊరటనిస్తుంది. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. ఒక సంఘటన విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇంటి నిర్మాణయత్నాలు సానుకూలం. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో పదోన్నతులు రావచ్చు. కళారంగం వారికి ఆదరణ పెరుగుతుంది. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. మిత్రులతో కలహాలు. ఆకుపచ్చ, ఎరుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్యహృదయం పఠించండి.

మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
మొదట్లో కొన్ని ఇబ్బందులు ఎదురుకావచ్చు. అయితే పట్టుదల, ఆత్మవిశ్వాసంతో అ«ధిగమించి పురోగమిస్తారు. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆలోచనలు అమలు చేస్తారు. పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయం కాగలరు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. వస్తులాభాలు. యుక్తితో ప్రత్యర్థులను సైతం ఆకట్టుకుంటారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. పారిశ్రామికవర్గాల కృషి ఫలిస్తుంది. వారం ప్రారంభంలో అనారోగ్యం. సోదరులతో కలహాలు. గులాబి, పసుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. శివస్తోత్రాలు పఠించండి.
సింహంభట్ల సుబ్బారావు జ్యోతిష్య పండితులు

టారో (24 జూన్‌ నుంచి  30 జూన్, 2018 వరకు)

మేషం (మార్చి 21 – ఏప్రిల్‌ 19)
ఈవారం ఒక శుభవార్త వింటారు. కుటుంబ సభ్యులతో ఉత్సాహంగా గడుపుతారు. కొన్ని అనుకోని సవాళ్లు ఎదురైనా వాటన్నింటికీ ఎదురెళ్లి నిలబడే ధైర్యాన్ని కూడగట్టుకుంటారు. ప్రేమ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. మీకిష్టమైన వ్యక్తికి ఎక్కువ సమయం కేటాయించడం ద్వారా ప్రశాంతతను దక్కించుకుంటారు. వృత్తి జీవితం సాఫీగా సాగిపోతుంది. ఒక గొప్ప అవకాశం వారం చివర్లో మీ తలుపు తడుతుంది. ఆర్థిక పరిస్థితి ఊహించని స్థాయిలో మెరుగుపడుతుంది. ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది. 
కలిసివచ్చే రంగు : ఆకుపచ్చ 

వృషభం (ఏప్రిల్‌ 20 – మే 20)
జీవితంలో ఒక దశకు వచ్చేసరికి కొన్ని విషయాల్లో మీవైన స్థిర నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు ఆ దశలో ఉన్నారు. జీవితాశయం వైపుకు అడుగులు వేయాల్సిన సమయం ఇదేనని గ్రహించండి. ప్రేమ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితుల్లో మీరిష్టపడ్డ వ్యక్తి అన్నివిధాలా అండగా నిలబడతారు. ఆర్థిక పరిస్థితి ఎప్పట్లానే సాదాసీదాగా ఉంటుంది. వృత్తి జీవితంలో గొప్ప మార్పులేమీ కనిపించడం లేదు. వ్యాయామంతో మనస్సును, శరీరాన్ని ప్రశాంతంగా ఉంచుకుంటారు. 
కలిసివచ్చే రంగు : ఊదా 

మిథునం (మే 21 – జూన్‌ 20)
జీవితంలో ఒక్కోసారి విజయం వైపుకు ఎంత వేగంగా బయలుదేరినట్టు కనిపించినా, గమ్యం మాత్రం దగ్గరలో లేదన్న భయమూ వెంటాడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లోనే మీ ధైర్యాన్నంతా కూడగట్టుకుని ముందుకు సాగాలి. ఆర్థిక పరిస్థితి ఊహించని స్థాయిలో మెరుగుపడుతుంది. చాలా కాలంగా మిమ్మల్ని వేధిస్తోన్న అప్పుల సమస్యలన్నీ తీరతాయి. వృత్తి జీవితం బాగుంటుంది. మీదైన ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేసుకునే ఒక వేదిక దొరుకుతుంది. ప్రేమ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. మీరిష్టపడే వ్యక్తి నుంచి అందే బహుమతి మిమ్మల్ని ఉత్సాహపరుస్తుంది. వారం చివర్లో విహారయాత్రకు సన్నాహాలు చేసుకుంటారు. 
కలిసివచ్చే రంగు : నీలం 

కర్కాటకం (జూన్‌ 21 – జూలై 22)
జీవితం ఏయే దారులు ఎంచుకొని సాగిపోతున్నా అందుకు తగ్గట్టుగా మన ఆలోచనలూ మారతాయి. ఈ విషయాన్ని తెలుసుకుంటే అనవసర విషయాలకు ఎక్కువ స్పందించకుండా ఉంటారు. జీవితాశయం వైపుకు అడుగులు వేయాల్సిన సమయం ఇది. పరిస్థితులు కూడా మీకు అన్నివిధాలా అనుకూలించి మిమ్మల్ని ఆ దిశగా నడిపిస్తాయి. గొప్ప వ్యాపార ఆలోచన చేస్తారు. మీ అర్థిక పరిస్థితి ఊహించని స్థాయిలో మెరుగుపడుతుంది. గతాన్ని గురించి ఎంత తక్కువ ఆలోచిస్తే అంత మంచిదని తెలుసుకోంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. 
కలిసివచ్చే రంగు : పసుపు 

సింహం (జూలై 23 – ఆగస్ట్‌ 22)
ఈవారమంతా ఉత్సాహంగా ఉంటారు. రాబోయే రోజుల్లో మీ జీవితం ఊహించని మలుపులు తీసుకుంటుంది. జీవితాశయం వైపుకు అడుగులు వేస్తారు. ఎప్పట్నుంచో ఆగిపోయినట్టు కనిపించిన పనులన్నీ ఇప్పుడిప్పుడే మళ్లీ కొత్తగా మొదలవుతాయి. ఒక కొత్త వ్యక్తి పరిచయం మీ ఆలోచనలను బాగా ప్రభావితం చేస్తుంది. అతితక్కువ కాలంలోనే ఆ వ్యక్తికి  బాగా దగ్గరైపోతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కొన్ని అనవసర విషయాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. కుటుంబ సభ్యులకు ఎక్కువ సమయం కేటాయిస్తారు. విహారయాత్రకు సన్నాహాలు చేసుకుంటారు. 
కలిసివచ్చే రంగు : కాషాయ 

కన్య (ఆగస్ట్‌ 23 – సెప్టెంబర్‌ 22)
ఈవారం మీకు గొప్ప అదృష్టం కలిసొస్తుంది. ఎప్పట్నుంచో కన్న ఓ కల ఈవారమే నెరవేరుతుంది. ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉంటూ మీరేంటో, మీ ఆలోచనలేంటో అర్థం చేసుకొని ముందుకెళ్లండి. మీ చుట్టూ ఉండే పరిస్థితులు కూడా మిమ్మల్ని బాగా ప్రభావితం చేస్తాయి. ఇవేవీ కూడా మీలో నిరుత్సాహాన్ని నింపేవిగా ఉండకుండా చూసుకోండి. ఆరోగ్యం విషయంలో కాస్తంత జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది. ప్రేమ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఎదురైనా వాటన్నింటికీ ఎదురెళ్లి నిలబడతారు. 
కలిసివచ్చే రంగు : ముదురు నీలం 

తుల (సెప్టెంబర్‌ 23 – అక్టోబర్‌ 22)
ఆకాశాన్ని అందుకోవాలన్నంత అందంగా ఉండేవే ఆలోచనలు. అందుకోలేకున్నా అందంగా ఆ ఆలోచనను దాచుకోవడమే జీవితం. మీకు ఈ రెండూ తెలుసు. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఈవారం తలెత్తుతుంది. అన్నీ ఆలోచించుకొని ముందడుగు వేయండి. గొప్ప ఆలోచనలే మిమ్మల్ని గొప్పవారిని చేస్తాయి. వారం చివర్లో ఓ గొప్ప అవకాశం మీ తలుపు తడుతుంది. ఆత్మవిశ్వాసంతో ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొని ముందుకు వెళ్లండి. ఆర్థిక పరిస్థితి గతంలో కంటే బాగా మెరుగుపడుతుంది. ప్రేమ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు కనిపిస్తున్నాయి. మీరు ప్రేమించే వ్యక్తికి ఎక్కువ సమయం కేటాయించండి. 
కలిసివచ్చే రంగు : ఎరుపు 

వృశ్చికం (అక్టోబర్‌ 23 – నవంబర్‌ 21)
జీవితంలో చాలా దూరం ప్రయాణించి అలిసిపోయాక, మనం వెళ్లాల్సిన దారి అది కాదనో, అప్పటికే ఆ దారి మనకు ఇవ్వాల్సిన ఆనందాన్ని ఇవ్వడం లేదనో అర్థమవుతూ ఉంటుంది. ఇక్కడ ధైర్యంగా నిలబడే వ్యక్తే జీవితాన్ని అర్థవంతంగా జీవించగలడు. మీరు ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్న ఓ అవకాశం ఈ వారమే మీ తలుపు తడుతుంది. మీ ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేసుకునే వేదిక దొరుకుతుంది. వరుసగా అవకాశాలు వచ్చి పడే సమయం దగ్గర్లోనే ఉంది. మీకిష్టమైన వ్యక్తికి ఎక్కువ సమయం కేటాయిస్తారు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది.
కలిసివచ్చే రంగు : ముదురు గోధుమ 

ధనుస్సు (నవంబర్‌ 22 – డిసెంబర్‌ 21)
జీవితంలో ఒక్కోసారి అన్నీ బాగున్నట్టు ఉంటాయి కానీ, కావాల్సింది ఏదో ఎప్పటికీ దొరకదన్న నిరాశ కూడా ఉంటుంది. ఇలాంటి పరిస్థితి దాదాపు ప్రతి ఒక్కరికీ ఏదో ఒక సందర్భంలో ఎదురయ్యే ఉంటుందని తెలుసుకోండి. వారం చివర్లో ఒక గొప్ప అవకాశం మీ తలుపు తడుతుంది. ఆ అవకాశం మీ వృత్తి జీవితాన్ని ఒక కొత్త మలుపు తిప్పుతుంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యాయామం చెయ్యడాన్ని పక్కనబెట్టకండి. ప్రేమ జీవితం ఎప్పట్లానే ఆహ్లాదకరంగా ఉంటుంది. 
కలిసివచ్చే రంగు : గులాబి 

మకరం (డిసెంబర్‌ 22 – జనవరి 19)
ఈవారమంతా ఉత్సాహంగా ఉంటారు. మీరెప్పట్నుంచో కోరుకున్న ప్రపంచం వైపుకు తొలి అడుగులు వేస్తారు. మీకిష్టమైన వ్యక్తి అన్ని సమయాల్లో మీకు తోడుగా ఉంటారు. వారం చివర్లో మీకెంతో ఇష్టమైన ఒక ప్రాంతానికి విహారయాత్రపై వెళతారు. గతాన్ని గురించి ఎక్కువ ఆలోచించకుండా ప్రస్తుతాన్ని అర్థం చేసుకొని ముందుకు వెళ్లండి. కొన్ని అనవసర విషయాల్లో జోక్యం చేసుకుని ఇబ్బందుల పాలవుతారు. మీ ఆలోచనలను ప్రభావితం చేసే వ్యక్తులను కలుసుకుంటారు.
కలిసివచ్చే రంగు : నీలం 

కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18)
వృత్తి జీవితంలో మీరు ఎప్పట్నుంచో కోరుకుంటున్న ఒక అవకాశం త్వరలోనే దక్కుతుంది. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకునేందుకు మిమ్మల్ని మీరు అన్నివిధాలా సిద్ధంగా ఉంచుకోండి. మీ జీవితాన్ని మలుపుతిప్పే ఓ వ్యక్తిని కలుసుకుంటారు. ఆ వ్యక్తి ఆలోచనలు మీపై బాగా ప్రభావితం చూపిస్తాయి. ఏ పని చేసినా విజయం సాధిస్తామన్న ధీమాతోనే చేయండి. కొన్ని అనుకోని అవాంతరాలు ఎదురైనా మీదైన ఆత్మస్థైర్యంతో వాటిని ఎదుర్కొని నిలబడతారు. ఆర్థిక పరిస్థితి కొంత గందరగోళంగా ఉంటుంది. కొత్త పెట్టుబడులకు దూరంగా ఉండండి. యోగా, వ్యాయామంతో మనస్సును, శరీరాన్ని ప్రశాంతంగా ఉంచుకోండి. 
కలిసివచ్చే రంగు : ఆకుపచ్చ 

మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20)
ఒక్కోసారి జీవితంలో ఒకచోట ఆగి, గతాన్ని గుర్తుచేసుకోవాల్సిన అవసరం వస్తుంది. మీరిప్పుడు ఆ దశలో ఉన్నారు. గతంలోకి కూరుకుపోకుండా, గతంలో చేసిన కొన్ని గొప్ప పనుల గురించి ఆలోచించండి. ఉత్సాహంగా కొత్త జీవితం వైపుకు అడుగులు వేస్తారు. ఏ పనిలోనైనా విజయం దక్కాలంటే ముందు చేసే పనిమీద ఇష్టం, మీమీద మీకు నమ్మకం ఉండాలి. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ప్రేమ జీవితం మిమ్మల్ని మీకు కొత్తగా ఆవిష్కరించి చూపుతుంది. కుటుంబ సభ్యులకు సమయం కేటాయించండి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. 
కలిసివచ్చే రంగు : గులాబి 

- ఇన్సియా
టారో అనలిస్ట్‌ 

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top