వారఫలాలు

varaphalalu inthis week - Sakshi

3 జూన్‌ నుంచి 9 జూన్‌ 2018 వరకు

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
శ్రమకు ఫలితం లభిస్తుంది. బంధువులు చేదోడుగా నిలుస్తారు. జీవితాశయం నెరవేరుతుంది. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. నిరుద్యోగుల కల ఫలిస్తుంది. వివాహయత్నాలు కలిసి వస్తాయి. ఇంటి నిర్మాణయత్నాలు కార్యరూపం దాలుస్తాయి. రావలసిన సొమ్ము అందుకుంటారు. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగస్తులకు శుభవార్తలు. పారిశ్రామికరంగం వారికి కొత్త ఆశలు చిగురిస్తాయి. వారం చివరిలో ఆస్తి వివాదాలు. అనుకోని ప్రయాణాలు. అనారోగ్యం. నేరేడు, పసుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి.

వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోíß ణి, మృగశిర 1,2 పా.)
ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు.  కొన్ని వివాదాల నుంచి బయటపడతారు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. వ్యాపార లావాదేవీలు పుంజుకుంటాయి. ఉద్యోగాల్లో కొత్త హోదాలు తథ్యం. రాజకీయరంగం వారికి అంచనాలు నిజమవుతాయి. వారం ప్రారంభంలో సోదరులతో కలహాలు. ఆరోగ్యభంగం. లేత నీలం, ఆకుపచ్చ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. కనకదుర్గాస్తోత్రాలు పఠించండి.

మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. ఆస్తి వ్యవహారాలలో కొద్దిపాటి చికాకులు. వాహనాల విషయంలో నిర్లక్ష్యం వద్దు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. నిరుద్యోగులు, విద్యార్థుల యత్నాలు నిదానంగా సాగుతాయి. వ్యాపార లావాదేవీలలో స్వల్ప లాభాలు. ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు రద్దు. వారం చివరిలో  శుభవార్తలు. ధనలాభం. తీర్థయాత్రలు. గులాబి, లేత ఎరుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్‌ ఛాలీసా పఠించండి. 

కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి. అనుకున్న పనుల్లో ప్రతిబంధకాలు. శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు నెలకొంటాయి. సోదరులు, సోదరీలతో కలహాలు. విద్యార్థుల యత్నాలు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. విలువైన వస్తువులు జాగ్రత్తపర్చుకోండి. వ్యాపారాలు అంతగా లాభించవు. ఉద్యోగాలలో ఒత్తిడులు పెరుగుతాయి. రాజకీయరంగం వారికి నిరాశాజనకంగా ఉంటుంది. వారం ప్రారంభంలో శుభవార్తలు. ఉద్యోగయోగం. ఎరుపు, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశ్‌స్తోత్రాలు పఠించండి.

సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో చక్కదిద్దుతారు. విద్యార్థులు పట్టుదలతో ముందుకు సాగి విజయాలు సా«ధిస్తారు. సంఘంలో పరపతి పెరుగుతుంది. నేర్పుగా కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు. వ్యాపారాలలో అధిక లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో ఉన్నతహోదాలు లభిస్తాయి. కళారంగం వారికి ఉత్సాహవంతమైన కాలం. నూతన అవకాశాలు దగ్గరకు వస్తాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు. దూరప్రయాణాలు. ఎరుపు, ఆకుపచ్చ రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.

కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
పనులలో అవరోధాలు క్రమేపీ తొలగుతాయి. ఆర్థిక విషయాలు కాస్త ఊరటనిస్తాయి. కుటుంబ సమస్యలు తీరి ఊరట చెందుతారు. ఆరోగ్యం కొంత మందగించవచ్చు. బంధువులు, మిత్రుల నుంచి మాటసహకారం అందుతుంది. ఒక కోర్టు కేసు నుంచి విముక్తి లభిస్తుంది. విద్యార్థుల చిరకాల స్వప్నం నెరవేరుతుంది. గృహ నిర్మాణాలు చేపడతారు. వ్యాపారాలు కొంతవరకు లాభిస్తాయి. ఉద్యోగులకు విధుల్లో చికాకులు తొలగుతాయి. రాజకీయవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం ప్రారంభంలో దూరప్రయాణాలు. ధనవ్యయం. పసుపు, ఎరుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. కనకధారాస్తోత్రాలు పఠించండి.

తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
ఆర్థిక వ్యవహారాలలో నిరుత్సాహం. పనులు ముందుకు సాగవు. ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటుంబంలో సమస్యలు చికాకు పరుస్తాయి. ఆరోగ్యం మందగిస్తుంది. విద్యార్థులు, నిరుద్యోగుల యత్నాలు మందకొడిగా సాగుతాయి. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు. కళారంగం వారికి చిక్కులు ఎదురవుతాయి. వారం చివరిలో విందువినోదాలు. శుభవార్తలు. వాహనయోగం. పసుపు, ఆకుపచ్చ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహస్తోత్రాలు పఠించండి.

వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
ఇంటాబయటా సమస్యలు వేధిస్తాయి. ఆర్థిక విషయాలలో నిరుత్సాహం. శ్రమపడ్డా ఫలితం కనిపించదు. కొన్ని పనులు వాయిదా వేస్తారు. నిర్ణయాలలో ఆచితూచి వ్యవహరించాలి. విద్యార్థులకు కొంత నిరాశ తప్పకపోవచ్చు. ఒక సమాచారం కాస్త ఊరట కలిగిస్తుంది. వ్యాపార లావాదేవీలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో  కొన్ని మార్పులు. పారిశ్రామికవర్గాలకు గందరగోళంగా ఉంటుంది. వారం ప్రారంభంలో శుభకార్యాలు. ఆకస్మిక ధనలాభం. ఎరుపు, లేత ఆకుపచ్చరంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. అంగారక స్తోత్రాలు పఠించండి.

ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
రావలసిన సొమ్ము ఆలస్యమవుతుంది. పనులు కొంత ఆలస్యమైనా పూర్తి చేస్తారు. మిత్రుని ద్వారా మాట సహాయం. ఆరోగ్యం మందగిస్తుంది. విద్యార్థుల శ్రమ కొంత మేరకు ఫలిస్తుంది. ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఆ«ధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంటి నిర్మాణయత్నాలు నిదానంగా సాగుతాయి.  వ్యాపారాలు స్వల్పంగానే లాభిస్తాయి. ఉద్యోగాల్లో  ఒత్తిడులు పెరుగుతాయి.  రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా. వారం మధ్యలో శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. పసుపు, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి.

మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. నేర్పుతో కొన్ని వివాదాలు, సమస్యల నుంచి బయటపడతారు. విద్యార్థుల నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. నూతన ఉద్యోగయత్నాలు సఫలం. గృహ నిర్మాణయత్నాలు కలిసి వస్తాయి. బంధువర్గం నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు. వ్యాపారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు లభిస్తాయి. కళారంగం వారికి సన్మానయోగం. వారం మధ్యలో వ్యయప్రయాసలు. ఆరోగ్యభంగం. లేత నీలం, నేరేడు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి.

కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
ఆర్థిక ఇబ్బందులు చికాకు పరుస్తాయి. పనుల్లో ప్రతిబంధకాలు ఏర్పడి నిరుత్సాహం చెందుతారు. బంధువులు, మిత్రులతో అకారణంగా తగాదాలు. శ్రమ తప్ప ఫలితం కనిపించదు. సోదరుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. గత సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. విద్యార్థులకు శ్రమాధిక్యం. ఇళ్లు, వాహనాల కొనుగోలు యత్నాలు ముందుకు సాగవు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో మార్పులు. పారిశ్రామికవర్గాలకు ఒడిదుడుకులు. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. నలుపు, ఆకుపచ్చ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. అన్నపూర్ణాష్టకం పఠించండి.

మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. మిత్రులు, బంధువుల నుంచి ఒత్తిడులు తొలగుతాయి. కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుంది. రావలసిన సొమ్ము అంది అవసరాలు తీరతాయి. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. వాక్చాతుర్యంతో అందర్నీ ఆకట్టుకుంటారు. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలలో లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగస్తులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. రాజకీయవర్గాలకు కొత్త పదవులు లభిస్తాయి. వారం మధ్యలో ఆరోగ్య సమస్యలు. బంధువులతో విభేదాలు. గులాబి, తెలుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.
సింహంభట్ల సుబ్బారావు
జ్యోతిష్య పండితులు

టారో(3 జూన్‌ నుంచి  9 జూన్, 2018 వరకు)
మేషం (మార్చి 21 – ఏప్రిల్‌ 19)
ఈవారమంతా ఉత్సాహంగా గడుపుతారు. గొప్ప గుర్తింపు లభిస్తుంది. ఎప్పట్నుంచో మిమ్మల్ని ఆశ పెట్టిస్తున్న ఓ అవకాశం ఈవారం మీ చెంతకు చేరుతుంది. గొప్ప అవకాశాలు ఎప్పుడూ గొప్పగా ఆలోచించే వారికే వస్తాయని తెలుసుకోండి. మీ ఆలోచనా విధానంలో మార్పు తీసుకొచ్చే ఓ కొత్త వ్యక్తిని తెలుసుకుంటారు. కొత్త ప్రయాణాలు మీలోని కొత్త మనిషిని ఆవిష్కరించి చూపుతాయి. ఆర్థిక పరిస్థితి ఎప్పట్లానే సాదాసీదాగా ఉంటుంది. అనవసర ఖర్చులకు దూరంగా ఉండండి. 
కలిసివచ్చే రంగు : గులాబి 

వృషభం (ఏప్రిల్‌ 20 – మే 20)
ఈవారం ప్రేమ జీవితం మిమ్మల్ని కొంత కలవరపెడుతుంది. లేని కష్టాలను మీ అంతట మీరే కొని తెచ్చుకుంటారు. ప్రేమలో ఇష్టాలతో పాటు కోపాలు కూడా ఉంటాయని తెలుసుకొని, మీరిష్టపడే వ్యక్తిని అర్థం చేసుకోవాల్సిన సమయం ఇది. వృత్తి జీవితం ఎప్పట్లానే బాగుంటుంది. రాబోయే రోజుల్లో ఓ గొప్ప అవకాశం మీ తలుపు తడుతుంది. అందుకు ఇప్పట్నుంచే మిమ్మల్ని మీరు సిద్ధంగా ఉంచుకోండి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన సమయమిది.
కలిసివచ్చే రంగు : ముదురు ఆకుపచ్చ 

మిథునం (మే 21 – జూన్‌ 20)
జీవితం చాలా చిన్నదన్న ఆలోచన మిమ్మల్ని ఈ వారమంతా బాగా వెంటాడుతుంది. ఆ చిన్న జీవితంలోనే మీరేంటో నిరూపించుకునే సమయం దాటిపోకుండా చూసుకోండి. జీవితాశయం వైపుకు అడుగులు వేస్తారు. ఆత్మవిశ్వాసంతో పనిచేస్తూ ముందుకెళితే విజయం మీదేనని నమ్మండి. ప్రేమ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. అనవసర విషయాల గురించి ఎక్కువ ఆలోచించకుండా మీ ఉన్నతికి ఏం అవసరమో అదే తీసుకోండి. వారం చివర్లో విహారయాత్రకు సన్నాహాలు చేసుకుంటారు. 
కలిసివచ్చే రంగు : బూడిద 

కర్కాటకం (జూన్‌ 21 – జూలై 22)
ఈవారం మీరు ఊహించనంత సంతోషంగా ఉంటారు. ఎప్పట్నుంచో మీకు అతిపెద్ద సమస్యగా మారిన ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. కొత్త ఆదాయ మార్గాలను అన్వేషిస్తారు. జీవితాన్ని ఒక కష్టంలా జీవిస్తే ప్రయోజనం ఉండదని తెలుసుకుంటారు. ఇష్టంగా ఒక్కో కోరికను నెరవేర్చుకుంటూ మీ ఇష్టాల చుట్టూ ఒక అద్భుతమైన ప్రపంచాన్ని నిర్మించుకుంటారు. మీరు ప్రేమించే వ్యక్తి ఈ సమయంలో మీకు అండగా ఉండటం గొప్ప సంతోషాన్నిస్తుంది. వృత్తి జీవితం బాగుంటుంది. ఆరోగ్యం జాగ్రత్త. 
కలిసివచ్చే రంగు : పసుపు 

సింహం (జూలై 23 – ఆగస్ట్‌ 22)
జీవతమంటే అన్ని విషయాల్లో, అన్ని సందర్భాల్లో, ఇష్టం లేకుండా చుట్టూ గీతలు గీసుకొని బతకడం కాదన్న సత్యాన్ని తెలుసుకుంటారు. ఇది మీలో కొత్త ఉత్సాహాన్ని తీసుకొస్తుంది. ఆ ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తూ వృత్తి జీవితంలో ఓ గొప్ప అవకాశం మీ తలుపు తడుతుంది. ధైర్యంగా ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొని ముందుకు వెళ్లండి. ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి ముందు మనల్ని మనం పూర్తిగా అర్థం చేసుకోవాలని తెలుసుకుంటారు. ఆరోగ్యం జాగ్రత్త. 
కలిసివచ్చే రంగు : బూడిద 

కన్య (ఆగస్ట్‌ 23 – సెప్టెంబర్‌ 22)
గొప్ప ఆలోచనలు ఉన్నవారిని కాలం అన్నివిధాలా పరీక్షించాకే ఒక దారిని చూపిస్తుంది. మీ ఆలోచనలు గొప్పవి. మీదైన ప్రపంచాన్ని వెతుక్కుంటూ వెళ్లే ప్రయత్నంలో రాబోయే రోజుల్లో ఒక సరైన దారి మీకు ఎదురొస్తుంది. గతాన్ని గురించి ఎంత తక్కువ ఆలోచిస్తే అంత మంచిది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వృత్తి జీవితం ఏ ఒడిదుడుకులు లేకుండా సాగిపోతుంది. మీకిష్టమైన వ్యక్తికి ఎక్కువ సమయం కేటాయిస్తారు. విహారయాత్ర సూచనలు కనిపిస్తున్నాయి.
కలిసివచ్చే రంగు : లేత ఆకుపచ్చ 

తుల (సెప్టెంబర్‌ 23 – అక్టోబర్‌ 22)
కొన్నిసార్లు జీవితం దానంతట అదే కొన్ని సంకేతాలు పంపిస్తుంది. వాటిని అర్థం చేసుకోవడంలోనే అసలు విజయం దాగి ఉంది. మీకిప్పుడు కాస్త విశ్రాంతి అవసరం. ఎప్పుడూ చేస్తూ ఉన్న ఈ పని నుంచి కాస్త విరామం. మీ జీవితం ఇప్పుడదే కోరుకుంటోంది. కొన్నిరోజులు విహారయాత్రకు వెళ్లి రండి. మనస్సు, శరీరం ప్రశాంతంగా ఉంటే గొప్ప విజయం మీ సొంతమవుతుంది. ప్రేమించే వ్యక్తి అన్ని సమయాల్లో మీకు అండగా నిలబడతారు. కొత్త వ్యాపారాల జోలికి వెళ్లే సమయం కాదిది. డబ్బు విషయంలో ఆచితూచి వ్యవహరించండి. 
కలిసివచ్చే రంగు : నీలం 

వృశ్చికం (అక్టోబర్‌ 23 – నవంబర్‌ 21)
జీవితాశయం వైపుకు అడుగులు వేస్తారు. అందుకు ఇదే సరైన సమయం అన్న సంకేతాలు కూడా బలంగా అందుతాయి. తొలి అడుగులు తడబడినా ధైర్యంగా నిలబడితేనే జీవితం అన్నది తెలుసుకుంటారు. ఆర్థిక పరిస్థితి సాదాసీదాగా ఉంటుంది. ప్రేమ జీవితం ఊహించని మలుపులు తీసుకుంటుంది. మానసికంగా బాగా అలిసిపోయినట్టు భావిస్తారు. ఇలాంటి సవాళ్లన్నింటికీ ఎదురెళ్లడంలోనే విజయం దాగుందని తెలుసుకుంటారు. వారం చివర్లో కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. 
కలిసివచ్చే రంగు : కాషాయ 

ధనుస్సు (నవంబర్‌ 22 – డిసెంబర్‌ 21)
జీవితంలో ఒక్కోసారి ఓడిపోయినంత మాత్రాన అది ఎప్పుడూ అక్కడే, అలాగే ఆగిపోతుందని కాదు. కొన్నిసార్లు విజయానికి దారులు ఒక ఓటమి దగ్గర్నుంచే పుట్టుకొస్తాయి. ఆ దారులను వెతుక్కొని వెళ్లడమే జీవితం. మీదైన శ్రమనంతా వెచ్చించి పనిచేయండి. ఒక గొప్ప అవకాశం త్వరలోనే మీ తలుపు తడుతుంది. ఈ వారంలోనే ఒక కొత్త వ్యక్తిని కలుసుకుంటారు. ఆ వ్యక్తి రాక మీ ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఇది మీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. 
కలిసివచ్చే రంగు : చాకొలెట్‌ 

మకరం (డిసెంబర్‌ 22 – జనవరి 19)
జీవితం ఒక్కోసారి ఎటూ కదలకుండా ఆగిపోయినట్టు అనిపిస్తుంది. ఇది దాదాపు ప్రతిఒక్కరూ ఏదో ఒక సమయంలో ఎదుర్కొనే దశ. మీరిప్పుడు ఈ దశలో ఉన్నారు. ఏ పనిచేసినా చిత్తశుద్ధితో, విజయంపై ధీమాతో చేయండి. గొప్ప విజయాలకు ముందు కూడా ఇలాంటి దశను ఎదుర్కొంటారు చాలామంది. ప్రేమ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. గొప్ప మార్పులకు ప్రేమ జీవితమే నాంది పలుకుతుందని తెలుసుకోండి. విహారయాత్రకు సన్నాహాలు చేసుకుంటారు. 
కలిసివచ్చే రంగు : పసుపు 

కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18)
ఈవారమంతా ఎప్పట్లానే ప్రశాంతంగా సాగిపోతుంది. ఇది మీరు ఎంతో శ్రమించి సాధించి పెట్టుకున్న జీవితం. మీకిష్టమైన పని చేస్తూ, నచ్చినట్టు జీవిస్తూ గొప్ప ప్రపంచాన్ని ఆవిష్కరించుకుంటారు. ఇది మీలో ఒక కొత్త ఉత్సాహాన్ని తెచ్చిపెడుతుంది. ఆ ఉత్సాహంతోనే ప్రేమ జీవితాన్ని అద్భుతంగా నిర్మించుకుంటూ వెళతారు. మీరు ప్రేమించే వ్యక్తికి కూడా అన్ని పరిస్థితుల్లో మీకు అండగా నిలబడతారు. కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. వ్యాయామంతో మనస్సు, శరీరాలను ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయండి. 
కలిసివచ్చే రంగు : బంగారం 

మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20)
ఈవారం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. మీరు కోరుకున్న జీవితాన్ని ఆవిష్కరించుకోవడానికి ఈ నిర్ణయమే ప్రధానంగా పనిచేస్తుంది. ప్రేమ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఎదురవుతాయి. అయితే వీటికి ఎదురెళ్లి నిలబడితే రాబోయే రోజుల్లో మీరు గతంలో ఎన్నడూ లేనంత సంతోషంగా ఉంటారు. మీ ప్రతిభకు తగ్గ అవకాశాలు రావడం లేదని చింతించకుండా అందుకు మీరేం చేయగలరో ఆలోచించి ముందుకెళ్లండి. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడుతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత అవసరం.
కలిసివచ్చే రంగు : గులాబి 
- ఇన్సియా టారో అనలిస్ట్‌ 

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top