వారఫలాలు

varaphalalu inthis week - Sakshi

29 ఏప్రిల్‌ నుంచి 5 మే 2018 వరకు

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
ఆర్థిక విషయాలు కొంత నిరాశాజనకంగా ఉంటాయి. మిత్రులతో వివాదాలు ఏర్పడవచ్చు. కొన్ని విషయాలలో చికాకులు. ముఖ్యమైన పనులు ముందుకు సాగవు. కష్టమే తప్ప ఫలితం అంతగా కనిపించదు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. స్థిరాస్తి వివాదాలు కాస్త గందరగోళం కలిగించవచ్చు. వ్యాపారాలు సామాన్యంగానే ఉంటాయి. ఉద్యోగులకు బాధ్యతలు మరింత పెరుగుతాయి. రాజకీయవర్గాలకు ఒత్తిడులు. వారం ప్రారంభంలో శుభవార్తలు. వాహనయోగం. ఎరుపు, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శివస్తోత్రాలు పఠించండి.

వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోíß ణి, మృగశిర 1,2 పా.)
సరికొత్త వ్యూహాలు, ఆలోచనలతో ముందుకు సాగుతారు. కుటుంబానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. శుభకార్యాలకు హాజరవుతారు. సోదరుల ద్వారా ధనలబ్ధి. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు మంచి గుర్తింపు రాగలదు. పారిశ్రామికవర్గాలకు సంతోషకరమైన సమాచారం. వారం చివరిలో వ్యయప్రయాసలు. ఆరోగ్యభంగం. గులాబి, లేత పసుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.

మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
కొత్త పనులు చేపడతారు. ఆలోచనలు కలసివస్తాయి. సన్నిహితులు, మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. భూములు, ఆభరణాలు కొంటారు. కుటుంబంలో శుభకార్యాలు. ముఖ్య వ్యవహారాలలో ఒప్పందాలు చేసుకుంటారు. విద్యార్థుల యత్నాలు సఫలమవుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపార లావాదేవీలు ఉత్సాహాన్నిస్తాయి. ఉద్యోగాల్లో చిక్కులు అధిగమిస్తారు. కళారంగం వారికి మంచి గుర్తింపు రాగలదు. వారం ప్రారంభంలో ధనవ్యయం. బంధువిరోధాలు. పసుపు, ఆకుపచ్చ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. కనకధారా స్తోత్రాలు పఠించండి.

కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
ఆర్థిక ఇబ్బందులు కొంత చికాకు పరుస్తాయి. శ్రమ పెరుగుతుంది. బంధువులు, మిత్రులతో విభేదాలు ఏర్పడవచ్చు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. ఆస్తుల విషయంలో సోదరులతో మనస్పర్థలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు. తీర్థయాత్రలు చేస్తారు. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు. రాజకీయవర్గాలకు పర్యటనలు వాయిదా. వారం చివరిలో ఆకస్మిక ధనలాభం. వాహనయోగం. నేరేడు, గులాబీ రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి.

సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
పనులు కొంత మందకొడిగా సాగుతాయి. బంధువర్గంతో అకారణంగా తగాదాలు. ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. ఆర్థిక విషయాలలో గందరగోళం. ఇతరుల నుంచి రావలసిన సొమ్ము సకాలంలో అందదు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మిత్రులను కలుసుకుని ముఖ్య విషయాలు చర్చిస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వ్యాపారాలలో నిరుత్సాహం. ఉద్యోగాలలో మార్పులు ఉంటాయి. కళారంగం వారికి పర్యటనలు వాయిదా. వారం ప్రార ంభంలో శుభవార్తలు. ఉద్యోగలాభం. ఎరుపు, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. అన్నపూర్ణాష్టకం పఠించండి.

కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
చేపట్టిన పనులు  ముందుకు సాగక నిరాశ చెందుతారు. ఆర్థిక విషయాలలో ఒడిదుడుకులు. రుణయత్నాలు చేస్తారు. బంధుమిత్రులతో విభేదాలు. ఆరోగ్యసమస్యలు. శ్రమకు ఫలితం కనిపించదు. విద్యార్థులు, నిరుద్యోగులకు కాస్త నిరాశ తప్పదు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఒక సమాచారం కొంత ఊరటనిస్తుంది. వ్యాపార లావాదేవీలు అంతగా లాభించవు. ఉద్యోగాలలో ఒత్తిళ్లు. పారిశ్రామికవర్గాలకు సామాన్యంగా ఉంటుంది. వారం మధ్యలో విందువినోదాలు. వాహనయోగం. ఆకుపచ్చ, పసుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. కనకధారా స్తోత్రాలు పఠించండి.

తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. స్థిరాస్తి వివాదాలను చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. విద్యార్థులు అందరిచేత ప్రశంసలు అందుకుంటారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాల్లో అనుకూల పరిస్థితులు. కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. పారిశ్రామికవేత్తలకు చిక్కులు తొలగుతాయి. వారం మధ్యలో ధనవ్యయం. నేరేడు, నీలం రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి.

వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
వ్యవహారాలలో అవరోధాలు. ఆర్థిక పరిస్థితి అంతంతగానే ఉంటుంది. మిత్రులే శత్రువులుగా మారతారు. మీ సహాయం పొందినవారే సమస్యలు సృష్టించవచ్చు. కష్టమే తప్ప ఫలితం కనిపించదు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. తీర్థయాత్రలు చేస్తారు. ఒక వివాదం పరిష్కారంపై దృష్టి సారిస్తారు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో కొన్ని మార్పులు ఉంటాయి. రాజకీయవర్గాలకు ఒత్తిడులు. వారం మధ్యలో శుభవార్తలు. ఉద్యోగయోగం. పసుపు, లేత ఎరుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.

ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆర్థిక విషయాలు ఉత్సాహాన్నిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. దూరపు బంధువులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. ఆలయాలు సందర్శిస్తారు. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. ఇంటి నిర్మాణాలు చేపడతారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు అనుకోని హోదాలు రాగలవు. కళారంగం వారిని  విజయాలు వరిస్తాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు. ఆరోగ్యభంగం. గులాబి, పసుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. నృసింహ స్తోత్రాలు పఠించండి.

మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
రుణబాధలు తొలగుతాయి. ఆప్తులు, బంధువులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రముఖుల నుంచి కీలక సమాచారం అందుతుంది. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు కలసివస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. స్థిరాస్థి వృద్ధి. వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఉద్యోగులకు పదోన్నతులు రాగలవు. పారిశ్రామికవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం చివరిలో మిత్రులతో కలహాలు. ఇంటాబయటా ఒత్తిడులు. నేరేడు, తెలుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశ్‌ను పూజించండి.

కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
అనుకున్న పనులు సజావుగా పూర్తి చేస్తారు. బంధువుల నుంచి ముఖ్య సమాచారం రాగలదు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. విద్యార్థులకు అనూహ్యమైన ఫలితాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇంక్రిమెంట్లు రాగలవు. కళారంగం వారి ఆశలు ఫలిస్తాయి. వారం ప్రారంభంలో ధనవ్యయం. అనారోగ్యం. నీలం, లేత ఆకుపచ్చ రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
ఆర్థిక ఇబ్బందులు ఎదురై చికాకు పరుస్తాయి. బంధుమిత్రులతో అకారణంగా వివాదాలు ఏర్పడతాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబ, ఆరోగ్య సమస్యలు. విద్యార్థులు, నిరుద్యోగుల ప్రయత్నాలు మందగిస్తాయి. శ్రమ మరింత పెరుగుతుంది. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు స్వల్పంగానే లాభిస్తాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు పెరుగుతాయి. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి. వారం చివరిలో విందువినోదాలు. ఆహ్వానాలు అందుతాయి. గులాబి, ఎరుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.
- సింహంభట్ల సుబ్బారావు జ్యోతిష్య పండితులు

టారో (29 ఏప్రిల్‌ నుంచి 5 మే, 2018 వరకు)
మేషం (మార్చి 21 – ఏప్రిల్‌ 19)
వృత్తి ఉద్యోగాల్లో అద్భుతంగా రాణిస్తారు. కీలక అంశాల్లో సమయస్ఫూర్తితో వ్యవహరించి సరైన నిర్ణయాలు తీసుకుంటారు. మీరు తలపెట్టిన భారీ పనికి ఆర్థిక సాయం చేయడానికి ఒకరు ముందుకొస్తారు. ఆ సాయం మీకు అన్ని విధాలా కలిసొస్తుంది. ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారు తమ ప్రియతములకు తగిన సలహాలు ఇస్తారు. ధ్యానం, గానం ద్వారా మానసిక ఆనందం పొందుతారు. అనవసరమైన మానసిక భారాలను వదుల్చుకునే ప్రయత్నాలు చేస్తారు.
కలిసివచ్చే రంగు : ఊదా

వృషభం (ఏప్రిల్‌ 20 – మే 20)
అదృష్టం మీ వెంటే ఉంటుంది. కలిసొచ్చే కాలాన్ని వీలైనంతగా సద్వినియోగం చేసుకోవడమే మీ వంతు. విహార యాత్రల్లో ఆనందంగా గడుపుతారు. కీలకమైన వ్యాపార ప్రతిపాదనకు సంబంధించి ఒక నిర్ణయానికి రాలేకపోతారు. ప్రేమ వ్యవహారాలు సంతోషభరితంగా సాగుతాయి. మిమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేసే సన్నిహితులతో ఘర్షణకు దిగకుండా వారిని శాంతపరచడమే మంచిది. దేనికీ లోటు లేని జీవితాన్ని ప్రసాదించినందుకు దేవునికి కృతజ్ఞులై ఉంటారు. 
కలిసివచ్చే రంగు : పసుపు

మిథునం (మే 21 – జూన్‌ 20)
ఆర్థిక పరిస్థితి ఇదివరకటి కంటే మెరుగుపడుతుంది. చాలాకాలంగా వసూలు కాకుండా తిప్పలు పెడుతున్న మొండి బకాయిలు వసూలవుతాయి. వృత్తి ఉద్యోగాల్లో సహచరులతో సత్సంబంధాలు మరింతగా మెరుగవుతాయి. సరైన దృక్పథంతోనే ముందుకు సాగుతారు. మీ కుటుంబానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ సభ్యులకు మీ అభిప్రాయాలను, ఉద్దేశాలను స్పష్టం చేస్తారు. ప్రేమ వ్యవహారాల్లో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. మానసిక ఆందోళన తప్పకపోవచ్చు. 
కలిసివచ్చే రంగు : బూడిద రంగు

కర్కాటకం (జూన్‌ 21 – జూలై 22)
ఒంటరిగా ఉంటున్న వారికి పెళ్లిళ్లు కుదురుతాయి. అనూహ్యమైన సంఘటనలు జరుగుతాయి. ఇతరుల వ్యవహారాల్లో కలగజేసుకోకుండా ఉండటమే క్షేమం. మీ అభిప్రాయాలు వెల్లడించాల్సిందేనంటూ ఎవరైనా ఒత్తిడి చేసినా, సాధ్యమైనంత వరకు లౌక్యంగా తప్పించుకోవడమే మంచిది. గతాన్ని గురించి బాధపడకుండా వర్తమానాన్ని మరింత అర్థవంతం చేసుకునేందుకు ప్రయత్నిస్తారు. సానుకూల దృక్పథం వల్ల మీ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. కొత్త అవకాశాలతో ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి.
కలిసివచ్చే రంగు : లేత నారింజ

సింహం (జూలై 23 – ఆగస్ట్‌ 22)
విజేతగా నిలుస్తారు. వాక్చాతుర్యంతో మీ చుట్టూ ఉన్నవారిని ప్రభావితం చేస్తారు. ఆర్థిక వ్యవహారాల్లో కీలకమైన ఒప్పందాలు కుదుర్చుకోవడానికి, కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది పూర్తిగా అనుకూలమైన కాలం. మీ వృత్తి ఉద్యోగాలకు చెందిన ఉన్నతమైన వ్యక్తులను కలుసుకుంటారు. అధికారుల సానుకూలత వల్ల నెమ్మదిగానైనా ఆశించిన పురోగతి సాధిస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపాల్సి వస్తుంది. ఆహార విహారాలపైన, వ్యాయామంపైన దృష్టి సారిస్తారు. 
కలిసివచ్చే రంగు : తెలుపు

కన్య (ఆగస్ట్‌ 23 – సెప్టెంబర్‌ 22)
మీరు కోరుకున్న రీతిలో పనులను సానుకూలం చేసుకుంటారు. మీదైన వివేకంతో తగిన నిర్ణయాలు తీసుకుంటారు. మీరు ఒంటరిగా ఉంటున్నట్లయితే, ఒకరితో ప్రేమలో పడతారు. సరికొత్త ప్రేమానుబంధం దీర్ఘకాలం నిలుస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ చూపాల్సి వస్తుంది. ముఖ్యంగా బరువును అదుపు చేసుకునేందుకు తగిన జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. త్వరలోనే జీవితంలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. సేవా కార్యక్రమాలకు ఉదారంగా సాయం చేస్తారు.
కలిసివచ్చే రంగు : ముదురాకుపచ్చ

తుల (సెప్టెంబర్‌ 23 – అక్టోబర్‌ 22)
అసంతృప్తి చెందితే మీరు ఎంతో ఇష్టంగా ఏర్పాటు చేసుకున్న వ్యవస్థను సైతం విడిచిపెట్టేందుకు సిద్ధపడతారు. ప్రేమ వ్యవహారాల్లో ఊహించని పరీక్షలు ఎదురవుతాయి. సంబంధాలను నిలుపుకోవడానికి మీ వంతు ప్రయత్నాలు చేస్తారు. వృత్తి ఉద్యోగాలకు సంబంధించి విరివిగా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. స్వల్ప ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి. ఆదాయ మార్గాలపై దృష్టి సారిస్తారు. మీ నైపుణ్యాలను పెంచుకునేందుకు ప్రత్యేకంగా కృషి సాగిస్తారు. జూదానికి, స్పెక్యులేషన్‌ వ్యవహారాలకు దూరంగా ఉండటమే మంచిది. 
కలిసివచ్చే రంగు : ఎరుపు

వృశ్చికం (అక్టోబర్‌ 23 – నవంబర్‌ 21)
ఖర్చులను అదుపు చేయడానికి ప్రయత్నిస్తారు. ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఆచి తూచి వ్యవహరిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో సానుకూలమైన మార్పులకు సంబంధించిన సమాచారం త్వరలోనే తెలుసుకుంటారు. ఉద్యోగ జీవితంలో కొత్త సవాళ్లను స్వీకరించడాన్ని ఆస్వాదిస్తారు. బాగా ఎరిగిన వ్యక్తులకు సంబంధించి ఒక అభిప్రాయానికి రావడంపై గందరగోళం చెందుతారు. ఇతరుల వ్యక్తిగత వ్యవహారాల పట్ల అతిగా స్పందించే బదులు కాస్త లౌక్యంగా ఉండటమే మేలని గ్రహిస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ పెంచుకుంటారు.
కలిసివచ్చే రంగు : మట్టి రంగు

ధనుస్సు (నవంబర్‌ 22 – డిసెంబర్‌ 21)
స్థిరాస్తులపై పెట్టుబడులు పెట్టడానికి ప్రయత్నిస్తారు. ఆర్థికంగా బలపడతారు. మిమ్మల్ని వెంటాడే ఒక పరిస్థితిపై కలత చెందుతారు. కర్మ సిద్ధాంతాన్ని నమ్ముకుంటారు. ఆధ్యాత్మిక మార్గంలో సాంత్వన పొందుతారు. అంతరాత్మ ప్రబోధం మేరకు నడుచుకుంటారు. బలహీనతలను జయిస్తారు. త్వరలోనే కొత్త పనులు ప్రారంభిస్తారు. సాహసోపేతమైన సవాళ్లను స్వీకరించి సత్తా చాటుకుంటారు. పని ఒత్తిడి మితిమీరడంతో కొంత విరామం తీసుకుంటారు. 
కలిసివచ్చే రంగు : లేత ఊదా

మకరం (డిసెంబర్‌ 22 – జనవరి 19)
త్వరలోనే జీవితంలో మెరుగైన మార్పులు వస్తాయి. చిరకాల మిత్రుల మధ్య నెలకొన్న అపార్థాలు తొలగిపోతాయి. స్నేహానుబంధాలు మరింతగా బలపడతాయి. కొత్త పరిచయాలు, కొత్త స్నేహాలు ఏర్పడతాయి. వృత్తి ఉద్యోగాలకు సంబంధించి ప్రభావవంతమైన వ్యక్తులతో సాన్నిహిత్యం ఏర్పడుతుంది. ప్రేమానుబంధాలు బలోపేతమవుతాయి. కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది. బంధువుల్లో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగించే సూచనలు ఉన్నాయి.
కలిసివచ్చే రంగు : నీలం

కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18)
ఇప్పటి వరకు కొనసాగుతున్న ఒడిదుడుకులు నెమ్మదిగా తొలగిపోతాయి. సంక్షోభ పరిస్థితుల నుంచి గట్టెక్కుతారు. కర్మ సిద్ధాంతాన్ని నమ్ముకుంటారు. ఖర్చులు పెరుగుతాయి. అయితే, పెరిగే ఖర్చులకు తగినంతగా ఏదో ఒక మార్గంలో డబ్బు చేతికి అందుతుంది. ఆధ్యాత్మిక మార్గంలో కొత్త పాఠాలను నేర్చుకుంటారు. సరికొత్త అనుభూతులు పొందుతారు. ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితులు తలెత్తవచ్చు. కీలకమైన విషయాల్లో తేలికగా నిర్ణయాలు తీసుకుంటారు. పిల్లలు సాధించిన విజయాలు సంతోషాన్నిస్తాయి.
కలిసివచ్చే రంగు : గులాబి

మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20)
ప్రేమానుబంధాల్లో కోరుకున్న భద్రత, సంతోషం లభిస్తాయి. సానుకూల దృక్పథంలో అనూహ్య విజయాలను సాధిస్తారు. అసాధ్యమనుకున్న పనులను సునాయాసంగా పూర్తిచేసి ఇతరులను ఆశ్చర్యానికి గురిచేస్తారు. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత బలపడుతుంది. ఒక మహిళ ద్వారా మంచి సమాచారం తెలుసుకుంటారు. వృత్తి ఉద్యోగాలకు సంబంధించిన ఆంతరంగిక విషయాలను తెలుసుకుంటారు. చేతిలోని డబ్బు ఎంత త్వరగా ఖర్చయిపోతున్నా, అంతే త్వరగా ఆర్థిక లాభాలు కూడా పొందుతారు. 
కలిసివచ్చే రంగు : ఆకుపచ్చ
- ఇన్సియా టారో అనలిస్ట్‌ 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top