వారఫలాలు

varaphalalu inthis week - Sakshi

22 ఏప్రిల్‌ నుంచి 28 ఏప్రిల్‌ 2018 వరకు

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. మీ ఆలోచనలను కుటుంబసభ్యులు ఆమోదిస్తారు. ఒక ఆసక్తికర సమాచారం అందుతుంది. నిరుద్యోగులను ఒక ప్రకటన ఆకట్టుకుంటుంది. గృహ నిర్మాణయత్నాలు కలసివస్తాయి. వ్యాపారాలలో అడుగు ముందుకువేస్తారు. ఉద్యోగులకు రావలసిన బకాయిలు అందుతాయి. పారిశ్రామికవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం మధ్యలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. నేరేడు, ఎరుపు రంగులు. తూర్పుదిశప్రయాణాలు అనుకూలం. శివపంచాక్షరి పఠించండి.

వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోíß ణి, మృగశిర 1,2 పా.)
అనుకున్న పనుల్లో జాప్యం. ఆర్థిక వ్యవహారాలు కాస్త నిరుత్సాహపరుస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. తీర్థయాత్రలు చేస్తారు. భూవివాదాలు చికాకు పరుస్తాయి. శ్రమ పెరుగుతుంది. ఆరోగ్యం మందగిస్తుంది. నిర్ణయాలలో తొందరపాటు వద్దు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు శ్రమాధిక్యం. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా. వారం మధ్యలో శుభవార్తలు. స్వల్ప ధనలాభం. పసుపు, లేత ఆకుపచ్చ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుధ్యానం చేయండి.

మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. మీ నిర్ణయాలను కుటుంబసభ్యులు గౌరవిస్తారు. చిన్ననాటి మిత్రుల నుంచి కీలక సమాచారం అందుతుంది. స్థిరాస్తి వివాదాలు పరిష్కారదశకు చేరతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో లాభాలు పొందుతారు. ఉద్యోగులకు పదోన్నతులు లేదా ఇంక్రిమెంట్లు రావచ్చు. కళాకారులకు నూతనోత్సాహం. వారం చివరిలో వివాదాలు. అనారోగ్యం. ఆకుపచ్చ, నేరేడు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.

కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. మిత్రులు, కుటుంబసభ్యులతో సంతోషంగా గడుపుతారు. గృహ నిర్మాణాలు చేపడతారు. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ప్రముఖులతో పరిచయాలు. తీర్థయాత్రలు చేస్తారు. వివాహ, ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలు కొత్త పెట్టుబడులతో విస్తరిస్తారు. ఉద్యోగులకు ఊహించని అభివృద్ధి కనిపిస్తుంది. కళాకారులకు పురస్కారాలు అందుతాయి. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. గులాబి, లేత ఎరుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశ్‌ను పూజించండి.

సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు పరిష్కారమవుతాయి. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. నిరుద్యోగులు, విద్యార్థులకు ఆశలు నెరవేరతాయి. కొన్ని సమస్యల నుంచి విముక్తి పొందుతారు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. వ¬ఖ్యమైన వ్యవహారాలు సజావుగా పూర్తి చేస్తారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. కొత్త పెట్టుబడులు అందుకుంటారు. ఉద్యోగులకు గుర్తింపు రాగలదు. పారిశ్రామికవర్గాలకు ఆహ్వానాలు అందుతాయి. వారం మధ్యలో ధనవ్యయం. శ్రమాధిక్యం. పసుపు, లేత ఆకుపచ్చ రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి.

కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
నిలిచిపోయిన పనులు సైతం పూర్తి కాగలవు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. రుణబాధల నుంచి విముక్తి. గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. ఇంటాబయటా అనుకూల పరిస్థితులు. వాహనయోగం. ప్రముఖులతో చర్చలు జరుపుతారు. విద్యార్థులు ఆశించిన ఫలితాలు సాధిస్తారు.  వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు హోదాలు ఉత్సాహాన్నిస్తాయి. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు సాగిస్తారు. వారం మధ్యలో వ్యయప్రయాసలు. ఆరోగ్యసమస్యలు. ఎరుపు, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.

తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ఇంటాబయటా మీకు ఎదురులేని పరిస్థితి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఇంటి నిర్మాణయత్నాలలో పురోగతి కనిపిస్తుంది. వ్యాపారాలు మరింతగా లాభించవచ్చు. ఉద్యోగులకు అదనపు బాధ్యతల నుంచి విముక్తి. పారిశ్రామికవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో ధనవ్యయం. మిత్రులతో వివాదాలు.  గులాబి, లేత నీలం రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి.

వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
ముఖ్య వ్యవహారాలు అనుకున్నరీతిలో పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. ఆలోచనలు అమలు చేస్తారు. గతానుభవాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలలో ఆచితూచి వ్యవహరిస్తారు. వాహనయోగం. శత్రువులు కూడా మిత్రులుగా మారతారు. వ్యాపారాలలో నూతనోత్సాహం. ఆశించిన లాభాలు దక్కుతాయి. ఉద్యోగస్తులు సమర్థతను నిరూపించుకుంటారు. కళారంగం వారికి పురస్కారాలు అందుతాయి. వారం మధ్యలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. ఎరుపు, పసుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.

ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
ముఖ్యమైన పనులు నిదానంగా పూర్తి కాగలవు. ఆర్థిక విషయాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. తీర్థయాత్రలు చేస్తారు. గృహ, వాహనయోగాలు. పాతమిత్రులను కలుసుకుంటారు. విద్యార్థులు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులకు పదోన్నతులు రావచ్చు. పారిశ్రామికవర్గాలకు విదేశీ ఆహ్వానాలు అందుతాయి. వారం మధ్యలో ధనవ్యయం. ఆరోగ్య సమస్యలు. ఇంటాబయటా ఒత్తిడులు. గులాబి, తెలుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి.

మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
కొత్త పనులు చేపట్టి సమయానికి పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వాక్చాతుర్యంతో ఎదుటవారిని ఆకట్టుకుంటారు. నూతన ఉద్యోగప్రాప్తి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఆ«ధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు. అనుకున్న లాభాలు దక్కుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు రాగలవు. కళారంగం వారికి సన్మానాలు. వారం చివరిలో కుటుంబంలో ఒత్తిడులు. ఆరోగ్యభంగం. నీలం, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
ముఖ్యమైన పనులు సజావుగా పూర్తి కాగలవు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. దీర్ఘకాలిక సమస్యలు తీరి ఉపశమనం పొందుతారు. బంధువులతో చర్చలు జరుపుతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విద్యార్థులు, నిరుద్యోగులకు ఒత్తిడులు తొలగుతాయి. మధ్యలో నిలిచిపోయిన ఇంటి నిర్మాణాలు పునఃప్రారంభిస్తారు. వ్యాపార లావాదేవీలు ఊపందుకుంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు. పారిశ్రామికవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం ప్రారంభంలో వ్యయ్ర,పయాసలు. బంధువులతో తగాదాలు. నలుపు, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. కనకధారాస్తోత్రాలు పఠించండి.

మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
మొదట్లో కొంత మందకొడిగా ఉన్నా క్రమేపీ అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. ఆర్థిక విషయాలలో పురోగతి కనిపిస్తుంది. దూరప్రాంతాల నుంచి ముఖ్య సమాచారం రాగలదు. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. వాహనయోగం. భూవివాదాలు తీరి ఊరట చెందుతారు. చిరకాల మిత్రులను కలుసుకుంటారు. విద్యార్థులకు ఆశలు ఫలిస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు దక్కవచ్చు. రాజకీయవర్గాలకు పదవులు దక్కే అవకాశం. వారం మధ్యలో ధనవ్యయం. స్వల్ప అనారోగ్యం. పసుపు, ఆకుపచ్చ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. కనకదుర్గా స్తోత్రాలు పఠించండి.
- సింహంభట్ల సుబ్బారావు జ్యోతిష్య పండితులు

 టారో (22 ఏప్రిల్‌ నుంచి  28 ఏప్రిల్, 2018 వరకు)
మేషం (మార్చి 21 – ఏప్రిల్‌ 19)
ఈవారమంతా తాత్విక చింతనలో పడిపోతారు. జీవితమంతా ఒకదగ్గర ఆగిపోయినట్టు, దానికి ఒక అర్థమంటూ లేదన్నట్టు ఆలోచనలు చుట్టుముడుతాయి. ఈ ఆలోచనల నుంచే మీరు వాస్తవ జీవితంలోకి రావాల్సిన అవసరం ఉంది. ప్రేమ జీవితం సాదాసీదాగా సాగిపోతుంది. మీ ఆలోచనా విధానం మారిన మరుక్షణమే అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయని తెలుసుకోండి. విహార యాత్రకు సన్నాహాలు చేసుకోండి. కొన్ని సమస్యలకు కాలమే పరిష్కారం చెబుతుంది.
కలిసివచ్చే రంగు : పసుపు 

వృషభం (ఏప్రిల్‌ 20 – మే 20)
ఈవారం మీ జీవితాన్నే మలుపు తిప్పే ఓ సంఘటన చోటు చేసుకోబోతోంది. ఇందుకు మిమ్మల్ని మీరు సిద్ధంగా ఉంచుకోండి. జీవితానికి ఒక అర్థాన్ని వెతికే ప్రయాణం ఎప్పటికీ పూర్తవ్వనిదని మీరు తెలుసుకోవాలి. కొన్ని అవకాశాలు మీకు దగ్గరగా వచ్చి ఉన్నాయి. ఆ అవకాశాల జాడలను పసిగట్టి ముందుకు సాగండి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఆర్థిక పరిస్థితి గతంలో కంటే బాగా మెరుగుపడుతుంది. ప్రేమ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. 
కలిసివచ్చే రంగు : వయొలెట్‌ 

మిథునం (మే 21 – జూన్‌ 20)
ఈవారం మీరు ఊహించనంత సంతోషంగా గడుపుతారు. మీ జీవితాన్ని మలుపు తిప్పే ఓ వ్యక్తిని కలుసుకుంటారు. జీవితాశయం వైపుకు అడుగులు వేస్తారు. ఎప్పట్నుంచో ఊహలుగా మాత్రమే కనిపిస్తున్న విషయాలన్నీ నిజాలవుతూ ఉండటం మీకొక కలలా ఉంటుంది. అదృష్టం మీ వెన్నంటే ఉంటుంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. ప్రేమ జీవితం ఎప్పట్లానే ఆహ్లాదకరంగా ఉంటుంది. ప్రేమించిన వ్యక్తి మీ వెన్నంటే ఉండటం మీకు కొండంత అండనిస్తుంది. విహారయాత్ర సూచనలు కనిపిస్తున్నాయి. 
కలిసివచ్చే రంగు : బంగారం 

కర్కాటకం (జూన్‌ 21 – జూలై 22)
ఆత్మవిశ్వాసమే మీ ఆయుధమన్న విషయాన్ని ఎప్పటికీ మరవకండి. జీవితం ఎప్పటికప్పుడు కొత్త మలుపులు తీసుకుంటున్నట్టు అనిపిస్తుంది. ఇది మీ ఒక్కరికే ఇలా ఉండదన్న విషయం అర్థమైనప్పుడు మిమ్మల్ని మీరు కొత్తగా ఆవిష్కరించుకోగలరు. ఒక గొప్ప అవకాశం ఈవారం మీ తలుపు తడుతుంది. కొత్త వ్యాపార ఆలోచన ఒకటి చేస్తారు. ఆర్థిక పరిస్థితిలో ఊహించని స్థాయి పురోగతి కనిపిస్తోంది. ప్రేమ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఎదురైనా వాటికి ఎదురెళ్లి నిలబడతారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. 
కలిసివచ్చే రంగు : గులాబి 

సింహం (జూలై 23 – ఆగస్ట్‌ 22)
ఈవారం మీరు ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్న విజయాన్ని అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి ఊహించని స్థాయిలో మెరుగుపడుతుంది. కొత్త పెట్టుబడుల వైపు ఉత్సాహం కనబరుస్తారు. మీ ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేసుకునే వేదిక దొరుకుతుంది. ఎవరినో మెప్పించాలన్న తాపత్రయంతో మీదైన ముద్రను చెరిపేసుకోవడం మంచిది కాదని తెలుసుకుంటారు. ప్రేమ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. మీకిష్టమైన వ్యక్తితో విహారయాత్రకు కూడా సన్నాహాలు చేసుకుంటారు. 
కలిసివచ్చే రంగు : గోధుమ 

కన్య (ఆగస్ట్‌ 23 – సెప్టెంబర్‌ 22)
ఈవారం మీకు కొన్ని అనుకోని పరిణామాలు ఎదురవుతాయి. సవాళ్లన్నీ మిమ్మల్ని చుట్టేసినట్టు భావిస్తారు. చెక్కు చెదరని ధైర్యమే మిమ్మల్ని విజయం వైపుకు నడిపిస్తుందని నమ్మండి. వృత్తి జీవితంలో మార్పు సూచనలు కనిపిస్తున్నాయి. ఏది జరిగినా మీ మంచికే అనుకొని ముందుకెళ్లండి. మీకు బాగా ఇష్టమైన వ్యక్తికి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తారు. ప్రేమ జీవితంలో తలెత్తిన సమస్యలు కూడా ఒక్కొక్కటిగా పరిష్కారమవుతాయి. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. 
కలిసివచ్చే రంగు : తెలుపు 

తుల (సెప్టెంబర్‌ 23 – అక్టోబర్‌ 22)
ఈవారమంతా ఊహించనంత సంతోషంగా గడుపుతారు. ప్రేమ జీవితం మిమ్మల్ని మీకు కొత్తగా ఆవిష్కరించి చూపుతుంది. మీకిష్టమైన వ్యక్తి కోసం ఎక్కువ సమయాన్ని కేటాయిస్తారు. వృత్తి జీవితంలో కొన్ని అనుకోని సమస్యలు తలెత్తినా అన్నింటికీ ఎదురెళ్లి నిలబడి గెలుస్తారు. మీ చుట్టూ ఉండేవాళ్లలో కొందరు మీ ఉన్నతిని అడ్డుకుంటున్నారని తెలుసుకొని జాగ్రత్తగా ముందుకెళ్లండి. ఒక గొప్ప అవకాశం త్వరలోనే మీ తలుపు తడుతుంది. ఆర్థిక పరిస్థితి గతంలో కంటే బాగా మెరుగుపడుతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. 
కలిసివచ్చే రంగు : కాషాయ 

వృశ్చికం (అక్టోబర్‌ 23 – నవంబర్‌ 21)
ఈవారం మీరు ఎప్పట్నుంచో కోరుకుంటున్న ఓ శుభవార్త వింటారు. అది మీలో గొప్ప ఉత్సాహాన్ని నింపుతుంది. ప్రేమించిన వ్యక్తి ఈ సమయంలో మీ పక్కనే ఉండటం ఎక్కువ ఆనందాన్నిస్తుంది. మీరు ఊహించని ఓ ఖరీదైన బహుమతిని అందుకుంటారు. జీవితాశయం వైపుకు అడుగులు వేయాల్సిన సమయం ఇదేనని భావిస్తారు. మీ చుట్టూ ఉండి, మీ మంచి కోరే వ్యక్తుల నుంచి అన్నివిధాలా సాయం అందుతుంది. మీ ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేసుకునే ఓ అవకాశాన్ని సొంతం చేసుకుంటారు. 
కలిసివచ్చే రంగు : లేత ఆకుపచ్చ 

ధనుస్సు (నవంబర్‌ 22 – డిసెంబర్‌ 21)
కొద్దికాలంగా మిమ్మల్ని ఎంతగానో వేధిస్తున్న సమస్యలన్నీ ఓ కొలిక్కి వస్తాయి. రాబోయే రోజుల్లో జీవితాశయం వైపుకు అడుగులు వేస్తారు. ఆర్థిక పరిస్థితి ఊహించని స్థాయిలో మెరుగుపడుతుంది. సరికొత్త ఆలోచనలతో మిమ్మల్ని మీరు కొత్తగా ఆవిష్కరించుకుంటూ ముందుకు వెళతారు. విహారయాత్రకు సన్నాహాలు చేసుకుంటారు. ప్రేమ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. మీకిష్టమైన వ్యక్తి నుంచి అందే ఓ బహుమతి మిమ్మల్ని ఉత్సాహంగా ఉంచుతుంది.
కలిసివచ్చే రంగు : లేత నీలం 

మకరం (డిసెంబర్‌ 22 – జనవరి 19)
గొప్ప జీవితాన్ని అందరూ కలగంటారు. అయితే ఆ కలను నెరవేర్చుకోవడానికి మనమేం చేస్తున్నామన్నది నిరంతరం అన్వేషించుకోవాలి. జీవితాశయం వైపుకు అడుగులు వేయాల్సిన సమయం ఇదే. మీ ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేసుకునే ఓ గొప్ప అవకాశం త్వరలోనే మీ తలుపు తడుతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఆర్థిక పరిస్థితి గతంలో కంటే బాగా మెరుగుపడుతుంది. మీ జీవితాన్ని మీరు కోరుకున్న వైపుకు మలుపు తిప్పే వ్యక్తిని కలుసుకుంటారు.
కలిసివచ్చే రంగు : వెండి 

కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18)
ఈవారమంతా మీరు సంతోషంగా గడుపుతారు. ఒక కొత్త వ్యక్తిని కలుసుకుంటారు. ఆ వ్యక్తి రాకతో మీ జీవితం ఊహించని మలుపులు తీసుకుంటుంది. మీ ప్రమేయమంటూ లేకుండా అది చెడైనా, మంచైనా జరగదని గ్రహించి, మీ శక్తినంతా వెచ్చించి పనిచేయండి. ఒక గొప్ప విజయానికి చేరువలో ఉన్నారు. కొత్త వ్యాపార ఆలోచన ఒకటి చేస్తారు. ఆర్థిక పరిస్థితి గొప్పగా పురోగతి సాధిస్తుంది. కొత్త పెట్టుబడులకు ఆసక్తి చూపుతారు. ప్రేమ జీవితం ఎప్పట్లానే ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆరోగ్యం జాగ్రత్త. 
కలిసివచ్చే రంగు : ఎరుపు 

మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20)
ఈవారం కొన్ని అనుకోని సవాళ్లు ఎదురవుతాయి. అయితే ఆ సవాళ్లను ఎదుర్కొనే శక్తిని కూడా మీరే కూడగట్టుకుంటారు. మీకిష్టమైన వ్యక్తి అన్ని సమయాల్లోనూ మీ వెంటే ఉండటం మీకు గొప్ప ఉత్సాహాన్నిస్తుంది. కొన్నిసార్లు జీవితమంతా ఒకదగ్గర ఆగిపోయినట్టు అనిపించినా, కొంచెం ముందుకెళితే మళ్లీ పూలబాటను చేరుకోవచ్చని తెలుసుకోండి. అనవసర ఖర్చులకు దూరంగా ఉండండి. ఆర్థిక పరిస్థితి ఎప్పట్లానే సాదాసీదాగా ఉంటుంది. ప్రేమ జీవితం మిమ్మల్ని ఎప్పటికప్పుడు ఉత్సాహంగా ఉంచుతుంది. 
కలిసివచ్చే రంగు : ముదురు ఆకుపచ్చ 
- ఇన్సియా టారో అనలిస్ట్‌ 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top