వారఫలాలు

varaphalalu inthis week - Sakshi

1 ఏప్రిల్‌ నుంచి 7 ఏప్రిల్‌ 2018 వరకు

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
కొత్త పనులు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. ఇతరులకు సైతం సహాయం అందిస్తారు. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. విద్యార్థులకు నూతన విద్యావకాశాలు దక్కుతాయి. వాహనాలు, భూములు కొంటారు. వ్యాపారాలు మరింతగా విస్తరిస్తారు. ఉద్యోగులకు శ్రమ ఫలిస్తుంది. పారిశ్రామికవేత్తలకు సన్మానాలు. వారం చివరిలో ధనవ్యయం. మానసిక అశాంతి. పసుపు, తెలుపు రంగులు. దక్షిణదిÔ¶  ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీస్తోత్రాలు పఠించండి.

వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోíß ణి, మృగశిర 1,2 పా.)
విద్యార్థుల ప్రతిభ వెలుగుచూస్తుంది. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. స్థిరాస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. వివాహాది శుభకార్యాలలో పాల్గొంటారు. రావలసిన డబ్బు అందుతుంది. మీ నిర్ణయాలు అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటాయి. శత్రువులు కూడా మిత్రులుగా మారతారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు రావచ్చు. కళాకారులకు పురస్కారాలు అందుతాయి. వారం ప్రారంభంలో ఆరోగ్యసమస్యలు. మిత్రులతో కలహాలు. గులాబి, ఆకుపచ్చ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. శివపంచాక్షరి పఠించండి.

మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
నూతనంగా చేపట్టిన పనులు సమయానికి పూర్తి కాగలవు. పలుకుబడి పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. దూరప్రాంతాల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. ఇంటి నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. విద్యార్థులు, నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుతాయి. ఉద్యోగులకు ఉన్నతహోదాలు రాగలవు. రాజకీయవేత్తలకు సన్మానాలు. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. ఎరుపు, లేత పసుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి.

కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
పనుల్లో పురోగతి కనిపిస్తుంది. ఆస్తి వ్యవహారాలలో ఒప్పందాలు చేసుకుంటారు. విద్యార్థులకు కొత్త అవకాశాలు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. సన్నిహితుల సాయం అందుతుంది.  ఇంటి నిర్మాణాలు చేపడతారు. ఉద్యోగయత్నాలు సఫలమవుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు గతం కంటే మెరుగుపడతాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. పారిశ్రామికవేత్తలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం మధ్యలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. ఆకుపచ్చ, లేత నీలం రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్‌ చాలీసా పఠించండి.

సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యులతో తగాదాలు. ముఖ్యమైన పనులు మందకొడిగా సాగుతాయి. ఆప్తుల సలహాలతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థులు, నిరుద్యోగులకు శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. వ్యాపారం నిరాశాజనకంగా ఉంటుంది. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు. రాజకీయవేత్తలకు సమస్యలు ఎదురుకావచ్చు. వారం ప్రారంభంలో స్వల్ప ధనలబ్ధి. కొత్త ఒప్పందాలు. ఎరుపు, నేరేడు రంగులు. పశ్చిమదిశప్రయాణాలు అనుకూలం. అంగారక స్తోత్రాలు పఠించండి.

కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
అనుకున్న పనులలో విజయం సాధిస్తారు. పదిమందినీ ఆకట్టుకుంటారు. ఆలోచనలు అమలు చేస్తారు. సంఘంలో విశేష గౌరవం. భూవివాదాల పరిష్కారం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. రావలసిన సొమ్ము అందుతుంది. దూరపు బంధువులను కలుసుకుంటారు. వివాహ, ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. సభలు, సమావేశాలకు హాజరవుతారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ఉన్నత హోదాలు దక్కవచ్చు. కళాకారులకు అనూహ్యంగా అవకాశాలు దక్కుతాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. ధనవ్యయం. ఆకుపచ్చ, నీలం రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
కొత్త పనులకు శ్రీకారం చుడతారు. వివాహయత్నాలు కలిసివస్తాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. ఆరోగ్యం కొంత మందగిస్తుంది. వాహన, గృహయోగాలు కలుగుతాయి. వ్యాపారాలలో కొత్త భాగస్వాములు చేరతారు. ఉద్యోగులకు పదోన్నతి అవకాశాలు. రాజకీయవర్గాలకు సన్మానాలు, విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో మానసిక అశాంతి. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. పసుపు, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.

వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
ఉత్సాహంగా ముందడుగు వేసి విజయాలు సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు రాగలవు. ఆస్తి విషయంలో అగ్రిమెంట్లు చేసుకుంటారు. ఇంటి నిర్మాణాలలో కదలికలు. పోటీపరీక్షల్లో విజయం.  తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపార లావాదేవీలు ఊపందుకుంటాయి. కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు దక్కుతాయి. కళాకారులకు నూతనోత్సాహం. వారం మధ్యలో వృథా ఖర్చులు. అనారోగ్యం. ఎరుపు, తెలుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీఖడ్గమాల పఠించండి.

ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఉద్యోగావకాశాలు దక్కుతాయి.  ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సన్నిహితులు, మిత్రులతో విభేదాలు తొలగుతాయి. ఒక సమాచారం సంతోషం కలిగిస్తుంది. బంధువుల ద్వారా సహాయం అందుకుంటారు. పనులు విజయవంతంగా ముగిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు ఉన్నతహోదాలు. పారిశ్రామికవర్గాలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం చివరిలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. గులాబి, లేత ఎరుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఈశ్వరారాధన మంచిది.

మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయులు, బంధువులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆర్థిక వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు. రుణదాతల ఒత్తిడులు తొలగుతాయి. గత సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. వ్యాపార లావాదేవీలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి ప్రోత్సాహం. కళాకారులకు అవార్డులు దక్కుతాయి. వారం ప్రారంభంలో మానసిక అశాంతి. కుటుంబంలో సమస్యలు. నీలం, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. కనకధారాస్తోత్రాలు పఠించండి.

కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
ప్రారంభంలో కొద్దిపాటి చికాకులు తప్పవు. ఆర్థిక విషయాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. సన్నిహితుల సహాయంతో ముందడుగు వేస్తారు. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఉద్యోగయత్నాలు సానుకూలం. ఇంటి నిర్మాణయత్నాలు కలసివస్తాయి. సంఘంలోగౌరవం పెరుగుతుంది. వ్యాపారాలలో లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు దక్కుతాయి. రాజకీయవర్గాల కృషి ఫలిస్తుంది. విదేశీ పర్యటనలు ఉండవచ్చు. వారం ప్రారంభంలో వృథా ఖర్చులు. ఆరోగ్యభంగం. పసుపు, లేత నీలం రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.

మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
కొన్ని పనులు నెమ్మదించినా సకాలంలోనే పూర్తి కాగలవు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకం. వ్యతిరేకులను సైతం అనుకూలురుగా మార్చుకుంటారు. పరపతి కలిగిన వారి పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు అందుతాయి.  విద్యార్థులకు ఒత్తిడులు తొలగుతాయి. వాహన, గృహయోగాలు కలుగుతాయి. వ్యాపారాలలో లాభాలు పొందుతారు. ఉద్యోగులకు మరిన్ని బాధ్యతలు దక్కవచ్చు. కళాకారులకు సత్కారాలు. వారం మధ్యలో సోదరులతో కలహాలు. ఆరోగ్యభంగం. శ్రమ తప్పదు. ఆకుపచ్చ, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి.
- సింహంభట్ల సుబ్బారావు జ్యోతిష్య పండితులు

టారో1( ఏప్రిల్‌ నుంచి  7 ఏప్రిల్, 2018 వరకు)
మేషం (మార్చి 21 – ఏప్రిల్‌ 19)
వారమంతా ఉత్సాహంతో ఉరకలేస్తారు. ఆర్థిక లాభాలు అద్భుతంగా ఉంటాయి. యువ వ్యాపారవేత్తలకు, పారిశ్రామికవేత్తలకు పూర్తిగా అనుకూలమైన కాలం. అనూహ్యంగా కొత్త అవకాశాలు తలుపు తడతాయి. కొత్త కొత్త ఆలోచనలతో ముందుకు సాగుతారు. ఆకస్మికంగా ఒకరితో ప్రేమలో పడతారు. సమీప భవిష్యత్తులోనే ఈ ప్రేమ వ్యవహారం పెళ్లికి దారితీసే సూచనలు ఉన్నాయి. ఒత్తిడిని అధిగమించడానికి ధ్యానం వైపు మళ్లుతారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తారు. 
కలిసివచ్చే రంగు : లేత పసుపు

వృషభం (ఏప్రిల్‌ 20 – మే 20)
గతం చేసిన గాయాలను మరుగున పెట్టేయండి. జీవితంలోని సంతృప్తి అనుభవంలోకి వస్తుంది. అందరినీ ఆమోదించడం, దాపరికం లేకుండా ఉండటం వంటి మీ సహజ లక్షణాలు మీ మానసిక వ్యథను మాయం చేస్తాయి. కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది. మిత్రులతో సంప్రదింపులు జరుపుతారు. వారి సలహాలు మిమ్మల్ని సమస్యల నుంచి గట్టెక్కిస్తాయి. ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుంటారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా సాంత్వన పొందుతారు. ఊపిరి సలపనంతగా పని ఒత్తిడి ఎక్కువయ్యే సూచనలు ఉన్నాయి.
కలిసివచ్చే రంగు : ఆకుపచ్చ

మిథునం (మే 21 – జూన్‌ 20)
ఇంట్లో సంతోషభరితమైన వాతావరణం నెలకొంటుంది. కఠిన శ్రమతో సత్ఫలితాలను సాధిస్తారు. చిరకాలంగా నిర్దేశించుకున్న ఉన్నత లక్ష్యాలను అందుకోవడం సంతోషాన్నిస్తుంది. ఇల్లు మారే అవకాశాలు ఉన్నాయి. వృత్తి ఉద్యోగాల్లో సుస్థిరమైన పురోగతిని సాధిస్తారు. ఉత్తమమైన పనితీరుతో అధికారుల మన్ననలు పొందుతారు. ప్రముఖుల సహాయం పొందుతారు.  భద్రత, సుస్థిరత, ఆర్థిక పురోగతిపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తారు. ఒత్తిడికి దూరంగా పాత మిత్రులతో ఆటవిడుపుగా వినోదయాత్రలకు వెళతారు.
కలిసివచ్చే రంగు : లేత ఊదా

కర్కాటకం (జూన్‌ 21 – జూలై 22)
ఆత్మవిశ్వాసంతో అన్ని అవరోధాలను సునాయాసంగా అధిగమిస్తారు. ప్రేమికుల మధ్య ఉదాసీనత తలెత్తవచ్చు. ఈ పరిస్థితిని అధిగమించడానికి ప్రియతములతో వినోద, విహార యాత్రలకు వెళ్లడానికి సిద్ధపడతారు. అనుకోని ఆర్థిక లాభాలు కలసి వస్తాయి. వారసత్వ స్థిరాస్తులు కలసి వచ్చే సూచనలు ఉన్నాయి. వృత్తి ఉద్యోగాల్లో ఆశించిన లక్ష్యాలను సాధిస్తారు. పని ఒత్తిడి తప్పకపోవచ్చు. అదనపు బాధ్యతలను స్వీకరించాల్సి వస్తుంది. ఆరోగ్యపరంగా మరింత శ్రద్ధ తీసుకుంటారు.     
కలిసివచ్చే రంగు : నీలం

సింహం (జూలై 23 – ఆగస్ట్‌ 22)
సన్నిహిత మిత్రుల్లో ఒకరితో కలసి కొత్త వ్యాపార భాగస్వామ్యాన్ని ఏర్పరచుకుంటారు. ఇన్నాళ్లూ పడిన శ్రమకు తగిన ఫలితాన్ని అందుకుంటారు. వ్యాపార, పారిశ్రామిక రంగాల్లో ఘన విజయాలు సాధిస్తారు. ఉద్యోగులు అదనపు బాధ్యతలను స్వీకరించడానికి సిద్ధపడాల్సి వస్తుంది. నాయకత్వ పాత్రలో సత్తా చాటుకుంటారు. ఇంట్లో జరిగే వేడుకలు సంతోషాన్నిస్తాయి. ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతారు. ఆహార విహారాల్లో అలవాట్లను మార్చుకుంటారు.  ఆలయాలను సందర్శిస్తారు.
కలిసివచ్చే రంగు : లేత గులాబి

కన్య (ఆగస్ట్‌ 23 – సెప్టెంబర్‌ 22)
లక్ష్మీ కటాక్షం పుష్కలంగా ఉంటుంది. విలాసవంతమైన వస్తువులను కొనుగోలు చేస్తారు. కొత్త ఇల్లు, కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. చిరకాల స్వప్నాలను సాకారం చేసుకుంటారు. ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉన్నా మరింత ఉన్నత లక్ష్యాలను సాధించడానికి మరింతగా శ్రమించాల్సి ఉంటుంది.  పిల్లల విజయాలు సంతోషాన్నిస్తాయి. కీలక విషయాల్లో పెద్దల సలహాలు తీసుకుంటారు. సామాజికంగా పలుకుబడిని పెంచుకుంటారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.
కలిసివచ్చే రంగు : కెంపు ఎరుపు

తుల (సెప్టెంబర్‌ 23 – అక్టోబర్‌ 22)
జీవితం సరళమైనది. దానిని మరింత సంక్లిష్టభరితం చేసుకోవద్దు. వృథా ప్రయాసకు దూరంగా ఉండటం మంచిది. కాలంతో పోటీపడి పనులు పూర్తి చేయాల్సి ఉంటుంది. త్వరలోనే అదృష్టం వరించే సూచనలు ఉన్నాయి. అదృష్టాన్ని అందిపుచ్చుకోవడానికి సంసిద్ధులుగా ఉండండి. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవడం వల్ల సాధించేదేమీ ఉండదని అనుభవపూర్వకంగా తెలుసుకుంటారు. ఆత్మీయుల ప్రవర్తన మనస్తాపం కలిగించినా, మనో నిబ్బరం కోల్పోకుండా ముందుకు సాగుతారు.
కలిసివచ్చే రంగు : ఊదా

వృశ్చికం (అక్టోబర్‌ 23 – నవంబర్‌ 21)
దైవానుగ్రహం బాగుంటుంది. చాలాకాలంగా వాయిదా పడుతూ వస్తున్న ముఖ్యమైన పనిని పునః ప్రారంభిస్తారు. పట్టుదలతో ఈ పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు. ఉద్యోగాల్లో ఉన్న వారికి పదోన్నతులు దక్కే సూచనలు ఉన్నాయి. ఇల్లు లేదా కార్యాలయంలో మార్పులు చేపడతారు. విద్యార్థులు అద్భుతమైన ఫలితాలను సాధిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఒంటరిగా ఉన్న వారికి పెళ్లిళ్లు కుదిరే సూచనలు ఉన్నాయి. ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకుంటారు. 
కలిసివచ్చే రంగు : పొద్దుతిరుగుడు రంగు

ధనుస్సు (నవంబర్‌ 22 – డిసెంబర్‌ 21)
కనీసం ఈ వారంలోనైనా ఖర్చులను కట్టడి చేసుకోవడం మంచిది. క్రెడిట్‌కార్డును ఇంట్లోనే వదిలేయడంవల్ల అనవసరమైన ఖర్చులను తప్పించుకోగలుగుతారు. దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడానికి మరింతగా శ్రమించాల్సి ఉంటుంది. ఆర్థిక వ్యవహారాల్లో కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదు. ఆరోగ్యానికి తొలి ప్రాధాన్యం ఇవ్వాల్సి వస్తుంది. కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది. పిల్లల పురోగతి సంతోషాన్నిస్తుంది. నిరుద్యోగులకు పరీక్షలు ఎదురవుతాయి.
కలిసివచ్చే రంగు : వెండి రంగు

మకరం (డిసెంబర్‌ 22 – జనవరి 19)
క్రీడా రంగంలోను, సృజనాత్మక రంగంలోను ఉన్నవారికి అనుకూలమైన కాలం. ప్రతికూల ప్రభావం చూపే ఘర్షణలకు దూరంగా ఉండటం క్షేమం. అనుకోని మార్పులు సంభవిస్తాయి. ముఖ్యంగా వృత్తి ఉద్యోగాల్లో మార్పులు ఉండవచ్చు. ఇల్లు లేదా ఊరు మారే పరిస్థితులు కూడా ఉంటాయి. మధ్యవర్తి వ్యాపారాల్లో ఉన్నవారు మంచి లాభాలు పొందుతారు. పారిశ్రామిక రంగంలోని వారు ఆకాశమే హద్దుగా దూసుకుపోతారు. వదంతులను పట్టించుకోకుండా, ఆశించిన లక్ష్యాలపైనే దృష్టి కేంద్రీకరిస్తారు.
కలిసివచ్చే రంగు : తెలుపు

కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18)
అన్ని రంగాల్లోనూ సానుకూల ఫలితాలను పొందుతారు. అనుకోని ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కలసి వస్తాయి. విద్యార్థులు అద్భుతమైన ఫలితాలను సాధిస్తారు. కుటుంబ వ్యవహారాల్లో అదనపు బాధ్యతలను స్వీకరిస్తారు. నాయకత్వ పాత్రలో రాణిస్తారు. పిల్లల చదువుపై శ్రద్ధ చూపించాల్సి వస్తుంది. సామాజిక కార్యకలాపాల్లో మీ పేరు ప్రఖ్యాతులు ఇనుమడిస్తాయి. పని ఒత్తిడి పెరగడం వల్ల ఆరోగ్యం మందగించే సూచనలు ఉన్నాయి. ఇతరుల వ్యవహారాల్లో కలగజేసుకోకుండా ఉండటమే క్షేమం.
కలిసివచ్చే రంగు : లేత ఆకుపచ్చ

మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20)
 కీలక అంశాల్లో కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. విలాస వస్తువులను కొనుగోలు చేస్తారు. చిరకాల స్వప్నాలను సాకారం చేసుకుంటారు. కొత్త ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేసే సూచనలు ఉన్నాయి. ఆర్థికంగా సుస్థిరతను సాధిస్తారు. సామాజికంగా గౌరవాదరాలను, పేరు ప్రఖ్యాతులను పొందుతారు. ఒంటరిగా ఉంటున్న వారికి తగిన జీవితభాగస్వామి దొరికే అవకాశాలు ఉన్నాయి. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి.
కలిసివచ్చే రంగు : గులాబి

- ఇన్సియా టారో అనలిస్ట్‌ 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top