వారఫలాలు

varaphalalu inthis week - Sakshi

25 మార్చి నుంచి 31 మార్చి 2018 వరకు

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
అనుకున్న రాబడి కొంత ఆలస్యమైనా అందుతుంది. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. దూరప్రాంతాల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. సోదరులు, సోదరీలతో వివాదాలు సర్దుబాటు కాగలవు. విద్యార్థులకు శుభవార్తలు. ఇంటి నిర్మాణయత్నాలు సానుకూలమవుతాయి. వ్యాపారాలలో ఆశించిన లాభాలు తథ్యం. ఉద్యోగులకు విధుల్లో చిక్కులు తొలగుతాయి. పారిశ్రామికవేత్తలకు కొత్త ఆశలు చిగురిస్తాయి. వారం మధ్యలో ధనవ్యయం. అనారోగ్యం. పసుపు, లేత ఎరుపు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశ్‌స్తోత్రాలు పఠించండి.

వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోíß ణి, మృగశిర 1,2 పా.)
ముఖ్యమైన కార్యక్రమాలు ముందుకు సాగవు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు. సంతానరీత్యా కొద్దిపాటి చికాకులు ఎదుర్కొంటారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. నిర్ణయాలలో తొందరపాటు వద్దు. ఉద్యోగయత్నాలు నత్తనడకన సాగుతాయి. వ్యాపారాలలో స్వల్పలాభాలు ఉంటాయి. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు తప్పకపోవచ్చు. రాజకీయవేత్తలకు ఒత్తిడులు పెరుగుతాయి. వారం మధ్యలో ధనలబ్ధి. సమస్యల నుంచి ఉపశమనం. ఎరుపు, గులాబి రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్‌ ఛాలీసా పఠించండి.

మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
విజయాల బాటలో నడుస్తారు. యత్నకార్యసిద్ధి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆత్మీయులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. పాతబాకీలు సైతం వసూలవుతాయి. ఎంతటి వారినైనా మాటలతో ఆకట్టుకుంటారు. విద్యార్థులు, నిరుద్యోగులకు కీలక సమాచారం రాగలదు. వ్యాపారాలలో పెట్టుబడులు సమకూరి విస్తరిస్తారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు దక్కుతాయి. రాజకీయవర్గాలకు సన్మానాలు, సత్కారాలు. వారం చివరిలో వృథా ఖర్చులు. మిత్రులతో కలహాలు. ఆకుపచ్చ, పసుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి.

కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
బంధువుల నుంచి అందిన సమాచారం ఊరటనిస్తుంది. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల నుంచి సహాయం అందుతుంది. గృహ నిర్మాణయత్నాలలో పురోగతి ఉంటుంది. విద్యార్థులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. కళాకారులకు కొత్త అవకాశాలు దక్కుతాయి. వారం ప్రారంభంలో అనారోగ్యం. కుటుంబంలో చికాకులు. పసుపు, నేరేడు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. దత్తాత్రేయస్తోత్రాలు పఠించండి.

సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
అనూహ్యమైనరీతిలో పనులు పూర్తి కాగలవు. సోదరులు, సోదరీలతో వివాదాలు తీరతాయి. ఆదాయం పెరిగి అప్పులు తీరతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఇంటాబయటా అనుకూలం. ఆలయాలు సందర్శిస్తారు. చిన్ననాటి స్నేహితులు కలుస్తారు. వివాహాది శుభకార్యాలు నిర్వహిస్తారు. కాంట్రాక్టర్లకు శుభవార్తలు. వ్యాపారాలు పుంజుకుంటాయి. అనుకున్న లాభాలు అందుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు అందుతాయి. రాజకీయవర్గాలకు కొత్త పదవులు దక్కుతాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు. ఆరోగ్యసమస్యలు. గులాబి, తెలుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.

కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. అనుకున్న కార్యాలు దిగ్విజయంగా కొనసాగుతాయి. విద్యార్థులకు విజయాలు చేకూరతాయి. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుని, ఆనందంగా గడుపుతారు. ఆస్తుల విషయంలో వివాదాలు సర్దుబాటు కాగలవు. వాహనాలు, భూములు కొంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు ఉన్నతహోదాలు రాగలవు. కళాకారులకు అవార్డులు రాగలవు. వారం మధ్యలో వృథా ఖర్చులు. అనారోగ్యం. పసుపు, లేత ఆకుపచ్చ రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహస్తోత్రాలు పఠించండి.

తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
కొన్ని కార్యక్రమాలు కొంత నిదానంగా సాగుతాయి. ఆర్థిక విషయాలలో కాస్త పురోగతి కనిపిస్తుంది. ఆరోగ్యపరంగా చికాకులు. దూరపు బంధువులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. విచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. చర్చలు ఫలిస్తాయి. గృహ, వాహనయోగాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు రాగలవు. పారిశ్రామికవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. ఎరుపు, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. కనకధారాస్తోత్రాలు పఠించండి.

వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
ప్రారంభంలో ఆరోగ్య, ఆర్థిక సమస్యలు ఎదురైనా క్రమేపీ అనుకూలిస్తాయి. విద్యార్థులకు అనుకూల ఫలితాలు దక్కుతాయి. ఇంటి నిర్మాణాలలో ఆటంకాలు తొలగుతాయి. శత్రువులు మిత్రులుగా మారతారు. ప్రముఖులు పరిచయమవుతారు. వివాహాది శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో లాభాలు ఉత్సాహాన్నిస్తాయి. ఉద్యోగవర్గాలకు గుర్తింపు రాగలదు. రాజకీయవర్గాలకు సన్మానాలు, పదవీయోగం. వారం ప్రారంభంలో బంధువిరోధాలు. చికాకులు. పసుపు, లేత ఆకుపచ్చ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
ముఖ్యమైన కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయులతో వివాదాలు పరిష్కారమవుతాయి. జీవిత భాగస్వామి ద్వారా ఆస్తి లేదా ధనలాభం. కొన్ని వివాదాల పరిష్కారంలో మధ్యవర్తిత్వం వహిస్తారు. వాహనయోగం. కొన్ని నిర్ణయాలు మార్చుకుంటారు. కాంట్రాక్టర్లకు కొత్త ఆశలు చిగురిస్తాయి. వ్యాపారాలు లాభిస్తాయి. పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు ఉన్నత హోదాలు రాగలవు. పారిశ్రామికవేత్తలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం మధ్యలో వృథా ఖర్చులు. అనారోగ్యం. ఎరుపు, నేరేడు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శివస్తుతి మంచిది.

మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
అప్రయత్న కార్యసిద్ధి. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. సంఘంలో గౌరవం. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. విద్యార్థులు శుభవార్తలు వింటారు. అదనపు రాబడి పెరుగుతుంది. వివాహాది శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు. ఆరోగ్యం కొంత మందగిస్తుంది. వాహనాలు, భూములు కొంటారు. వ్యాపారాలలో ఆటుపోట్లు తొలగుతాయి. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం. కళాకారులకు సన్మానాలు. వారం చివరిలో వ్యయప్రయాసలు. బంధువిరోధాలు. నీలం, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. అన్నపూర్ణాష్టకం పఠించండి.

కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల సలహాలు స్వీకరిస్తారు. గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. గృహయోగం. చర్చలు ఫలిస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. కాంట్రాక్టర్లు, రియల్టర్లకు అనుకూల సమయం. కొన్ని సమస్యలు వాటంతట అవే పరిష్కారమవుతాయి. వ్యాపారాలలో అనుకున్న లాభాలు అందుతాయి. ఉద్యోగుల కష్టం ఫలిస్తుంది. మంచి గుర్తింపు రాగలదు. రాజకీయవర్గాలకు అనూహ్యమైన అవకాశాలు దక్కుతాయి. పసుపు, లేత ఆకుపచ్చ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.

మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
క్రమేపీ అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. మీరు చెప్పిందే వేదంగా ఉంటుంది. సన్నిహితులు, మిత్రులు సహాయం అందిస్తారు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. పరపతి పెరుగుతుంది. నూతన పరిచయాలు  ఏర్పడతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. ఆరోగ్యం కుదుటపడి ఉపశమనం పొందుతారు. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు సంతోషకరమైన విషయాలు తెలుస్తాయి. కళాకారులకు ఊహించని సన్మానాలు, అవార్డులు. వారం ప్రారంభంలో చికాకులు. మానసిక అశాంతి. గులాబి, లేత ఎరుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాస్తోత్రాలు పఠించండి.
సింహంభట్ల సుబ్బారావు
జ్యోతిష్య పండితులు 

టారో(25 మార్చి నుంచి  31 మార్చి, 2018 వరకు)
మేషం (మార్చి 21 – ఏప్రిల్‌ 19)
ఈవారం ఏ పనీ ముందుకు కదలనట్లు ఉంటుంది. కొన్ని ఆలోచనలు మిమ్మల్ని తీవ్రంగా ఇబ్బంది పెడతాయి. భావోద్వేగాలు మీ అదుపులో ఉండవు. అయితే ఇలాంటి పరిస్థితి జీవితంలో ఏదో ఒక దశలో అందరికీ వస్తుందని తెలుసుకొని జాగ్రత్తగా ముందుకెళ్లండి. ఈ దశ పూర్తవ్వగానే ఒక గొప్ప అవకాశాన్ని అందిపుచ్చుకుంటారు. అప్పటివరకూ ఆత్మవిశ్వాసంతో పనిచేస్తూ ఉండండి. త్వరలోనే వృత్తి జీవితంలో  కీలక మార్పు చోటు చేసుకోబోతోంది.  ప్రేమ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు తప్పవు. 
కలిసివచ్చే రంగు : ఆకుపచ్చ 

వృషభం (ఏప్రిల్‌ 20 – మే 20)
జీవితాశయం వైపు అడుగులు వేయాల్సిన సమయం ఇదే. అనవసర విషయాల గురించి ఆలోచిస్తూ, ఇప్పటికే సమయాన్ని వృథా చేశారని తెలుసుకోండి. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకు మిమ్మల్ని మీరు సిద్ధంగా ఉంచుకోండి. మీకిష్టమైన వ్యక్తి అన్ని సమయాల్లోనూ మీకు అండగా ఉంటారు. వృత్తి జీవితంలో ఓ గొప్ప మార్పు చోటుచేసుకోబోతోంది. ప్రేమ జీవితంలో కొన్ని ఇబ్బందులు కనిపిస్తున్నాయి. ఆ ఇబ్బందులను ఎదుర్కొని నిలబడే ధైర్యాన్ని కూడగట్టుకోండి. ఆరోగ్యం జాగ్రత్త.
కలిసివచ్చే రంగు : గోధుమ 

మిథునం (మే 21 – జూన్‌ 20)
ఈ వారమంతా ఉత్సాహంగా గడుపుతారు. చిరకాలంగా ఎదురుచూస్తున్న విజయం మిమ్మల్ని వరిస్తుంది. కొన్ని అనుకోని సవాళ్లు ఎదురైనా వాటిని ఎదిరించి నిలబడగలిగే శక్తి సంపాదిస్తారు. ఏది జరిగినా మంచికే అన్నట్టుండే మీ స్వభావం అన్ని పరిస్థితుల్లోనూ మిమ్మల్ని జీవితాశయం వైపుకు నడిపిస్తుంది. వృత్తి జీవితం అద్భుతంగా ఉంటుంది. కొత్త అవకాశాలు అందిపుచ్చుకుంటారు. ప్రేమ జీవితం కొత్తగా మళ్లీ మొదలవుతుంది. 
కలిసివచ్చే రంగు : పీచ్‌ 

కర్కాటకం (జూన్‌ 21 – జూలై 22)
చాలాకాలం నుంచి మీకిష్టమైన పని ఒకటి మొదలుపెడదామని అనుకుంటున్నారు. అది ఎందుకు ముందుకు కదలడం లేదన్న విషయం మీకు మాత్రమే తెలుసు. దాని గురించి కాస్త ఆలోచించండి. ఒక్కసారి ఆ పనిలో పడిపోతే మీరు అపజయం అన్నదే లేకుండా ముందుకెళతారు. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోండి. ఆర్థిక పరిస్థితి గతంలో కంటే బాగా మెరుగుపడుతుంది. కొత్త వ్యాపార ఆలోచన ఒకటి చేస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. 
కలిసివచ్చే రంగు : కాషాయం 

సింహం (జూలై 23 – ఆగస్ట్‌ 22)
మీ భయాలన్నింటినీ ఒక్కొక్కటిగా వదిలేస్తూ ముందుకెళ్లాలన్న ఆలోచన చేస్తారు. ఇందుకు మీదైన ఆత్మవిశ్వాసం, పట్టుదల తోడుగా ఉండాలని తెలుసుకోండి. ఇంటిని మీ అభిరుచికి తగ్గట్టుగా మార్చుకోండి. ఇది మీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. ఒక వ్యక్తి పరిచయం మిమ్మల్ని జీవితాశయం వైపు అడుగులు వేయిస్తుంది. వారం చివర్లో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. గతంలో మొదలుపెట్టి మధ్యలో ఆపేసిన కొన్ని పనులు ఇప్పుడు పూర్తి చేస్తారు. ప్రేమ జీవితం అహ్లాదకరంగా ఉంటుంది.
కలిసివచ్చే రంగు : తెలుపు 

కన్య (ఆగస్ట్‌ 23 – సెప్టెంబర్‌ 22)
కొన్ని పనులు ఎప్పుడు పూర్తవుతాయో అన్న భయం మిమ్మల్ని ఎప్పుడూ వెంటాడుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈమధ్యే మొదలుపెట్టి, అస్సలు ముందుకు కదలని ఒక పని, ఇప్పుడిప్పుడే ఫలితాలిస్తూ పూర్తవుతుంది. అది మీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. గత నెలలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన గొడవ ఒకటి సద్దుమణుగుతుంది. విహారయాత్రకు సన్నాహాలు చేసుకుంటారు. ప్రేమ జీవితం ఎప్పట్లానే ఆహ్లాదకరంగా ఉంటుంది. మీకిష్టమైన వ్యక్తి దగ్గర్నుంచి ఒక అందమైన బహుమతిని అందుకుంటారు.
కలిసివచ్చే రంగు : ఊదా 

తుల (సెప్టెంబర్‌ 23 – అక్టోబర్‌ 22)
ఈవారం మీరు ఊహించనంత సంతోషంగా ఉంటారు. జీవితం మనకు ఎలాంటి పరీక్షలు పెట్టినా, ఆ పరీక్షల్లో నెగ్గితే ఒక గొప్ప ప్రపంచాన్ని చూస్తారన్నది మర్చిపోకండి. ఇప్పుడు పరీక్షలు ఎదుర్కొనే దశలో ఉన్నారు. మీకోసం ఒక గొప్ప ప్రపంచం ఎదురుచూస్తోంది. మీదైన ఆలోచనా విధానమే మీ ఆయుధం. ప్రేమ జీవితం మిమ్మల్ని ఎప్పటికప్పుడు కొత్తగా ఆవిష్కరిస్తుంది. గతాన్ని గురించి ఎక్కువ ఆలోచించకుండా ప్రస్తుతంలో బతకండి.
కలిసివచ్చే రంగు : ఆకుపచ్చ 

వృశ్చికం (అక్టోబర్‌ 23 – నవంబర్‌ 21)
కొన్ని విషయాలు ఎంత ఓపికగా ఎదురుచూస్తే, అంత గొప్ప ఫలితాలనిస్తాయి. మీ ఓపికకు పరీక్ష పెడుతోన్న ఈరోజు.. రేపు ఇలాగే ఉండదు. ఆత్మవిశ్వాసంతో, రేపటి మీద ఆశతో పనిచేస్తూ ఉండండి. ఒత్తిడిలో ఏ నిర్ణయాలూ తీసుకోకండి. మీరు కలలు కనే ఓ గొప్ప భవిష్యత్‌లో మీకిష్టమైన వ్యక్తి ఎప్పుడూ ఉంటారు. నెలాఖర్లో కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటారు. మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే మనుషులు పక్కనే ఉన్నారని గ్రహించండి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. 
కలిసివచ్చే రంగు : పసుపు 

ధనుస్సు (నవంబర్‌ 22 – డిసెంబర్‌ 21)
ఎన్ని సవాళ్లు ఎదురైనా అనుకున్న పని చేయడానికి ఎంత శ్రమ పడాలో మీ అందరికీ తెలుసు. ఒక్కో సవాలూ మీపై మానసికంగా ఒత్తిడి పెంచేదే. అయినా కూడా ఓ గొప్ప విజయం పొందడంలో ఉన్న ఆనందం ఎంత బాగుంటుందో, దానికి పడే కష్టం కూడా అంతే బాగుండేలా చూసుకోండి. ప్రకృతిని ప్రేమించే మీ స్వభావం మీకు ఉల్లాసాన్నిస్తుంది. అందులోనే మిమ్మల్ని మీరు వెతుక్కుంటారు కూడా. ప్రేమ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు తప్పవు. ప్రేమించిన వారికోసం అన్ని పరిస్థితుల్లోనూ అండగా నిలబడండి. 
కలిసివచ్చే రంగు : వెండి 

మకరం (డిసెంబర్‌ 22 – జనవరి 19)
ఈవారం ఒక గొప్ప అవకాశం మీ తలుపు తడుతుంది. ఆర్థిక పరిస్థితి ఊహించని స్థాయిలో మెరుగుపడుతుంది. పట్టుదల, పనిమీద ఇష్టం మీకు వృత్తి జీవితంలో ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టే అంశాలు. మీకిష్టమైన వ్యక్తికి ఎక్కువ సమయం కేటాయిస్తారు. వారు మీకిచ్చే ఓ బహుమతి కూడా మిమ్మల్ని ఉత్సాహంగా ఉంచుతుంది. గతాన్ని గురించి ఎంత ఆలోచించినా ప్రయోజనం ఉండదని తెలుసుకోండి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. నెలాఖర్లో ఒక శుభవార్త వింటారు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. 
కలిసివచ్చే రంగు : లేత ఆకుపచ్చ 

కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18)
ఈ వారమంతా చాలా ప్రశాంతంగా గడుపుతారు. జీవితాన్ని మీలా ఎవరూ ఆస్వాదించలేరేమో అన్నట్టుగా జీవిస్తారు. అది మిమ్మల్ని అందరిలోనూ ప్రత్యేకంగా నిలిపే అంశం. వృత్తి జీవితం అన్నివిధాలా బాగుంటుంది. ఒక గొప్ప అవకాశం మీ తలుపు తడుతుంది. అప్పటివరకు సంయమనంతో ఉండండి. ఆ అవకాశం అందీ అందగానే ఇంక ఖాళీ అన్నదే లేకుండా పనులు మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి.  అనవసర విషయాల గురించి ఎక్కువ ఆలోచించకండి.
కలిసివచ్చే రంగు : ఆకుపచ్చ 

మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20)
ఈవారం మీరు ఏ పని చేపట్టినా కాస్తంత జాగ్రత్తగా ఉండాలి. కొన్ని అనుకోని సవాళ్లు ఎదురవుతాయి. అయినప్పటికీ నవ్వుతూనే ఉంటారు. మీరు అనుకున్న పనులు సరిగ్గా జరగకపోయినా కృంగిపోకండి. ఏది జరిగినా మన మంచికే అనుకుంటూ ముందుకెళ్లండి. ఎప్పట్నుంచో మీలోనే దాచుకున్న ఒక నిజం మీకిష్టమైన వ్యక్తితో పంచుకుంటారు. ఇది మీకు ఎంతో ఉపశమనాన్ని ఇస్తుంది. ప్రేమ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. విహారయాత్రకు సన్నాహాలు చేసుకుంటారు.
కలిసివచ్చే రంగు : పసుపు   
- ఇన్సియా టారో అనలిస్ట్‌ 

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top