వారఫలాలు

varaphalalu inthis week - Sakshi

4 ఫిబ్రవరి నుంచి 10 ఫిబ్రవరి 2018 వరకు

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
చేపట్టిన కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. బంధువులతో వివాదాలు తీరతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ప్రతి విషయంలోనూ సన్నిహితుల సాయం అందుతుంది. భూములు, వాహనాలు కొంటారు. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు ఒక ముఖ్య సమాచారం అందుతుంది. రాజకీయవేత్తలకు కొత్త పదవులు దక్కే అవకాశం. వారం చివరిలో అనారోగ్యం. కుటుంబంలో సమస్యలు. పసుపు, లేత గులాబి రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్‌ ఛాలీసా పఠించండి.

వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోíß ణి, మృగశిర 1,2 పా.)
ఆర్థిక లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. అనుకున్న పనులు విజయవంతంగా సాగుతాయి. బంధువుల నుంచి శుభవార్తలు. ఉద్యోగ యత్నాలు ముమ్మరం చేస్తారు. దీర్ఘకాలిక సమస్య నుంచి బయటపడతారు. అనుకున్న ఆశయాలు సాధిస్తారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. లాభాలు అందుతాయి.  ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు రాగల సూచనలు. కళాకారులకు నూతనోత్సాహం. వారం ప్రారంభంలో ధనవ్యయం. మానసిక అశాంతి. ఆకుపచ్చ, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.

మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
రాబడి కొంత తగ్గి రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యులతో తగాదాలు ఏర్పడతాయి. పనుల్లో ప్రతిబంధకాలు. మీపై ఆధిపత్యానికి ప్రత్యర్థులు యత్నిస్తారు. ఇంతకాలం పడిన శ్రమ ఫలించదు. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు ఇబ్బంది కలిగిస్తాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులకు మార్పులు అనివార్యం. పారిశ్రామికవేత్తలకు నిరాశాజనకంగా ఉంటుంది. వారం మధ్యలో చికాకులు. అనారోగ్యం. గులాబి, లేత ఎరుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
బంధువర్గంతో అకారణంగా తగాదాలు ఏర్పడతాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబ, ఆరోగ్యసమస్యలు తప్పకపోవచ్చు. మీకష్టం ఇతరులకు లాభిస్తుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యసమస్యలు ఎదుర్కొంటారు. విద్యావకాశాలు తృటిలో తప్పిపోతాయి.  వ్యాపారాలలో ఒడిదుడుకులు.  ఉద్యోగులకు మార్పులు ఉండవచ్చు.  కళాకారులకు కొన్ని అవకాశాలు నిరాశ కలిగిస్తాయి.  వారం మధ్యలో శుభవార్తలు. స్వల్ప ధనలాభం. ఎరుపు, తెలుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహస్తోత్రాలు పఠించండి.

సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
రాబడి అంతగా కనిపించదు. కొత్తగా చేపట్టిన పనులు ముందుకు సాగక నిరాశ చెందుతారు. బంధువులు, స్నేహితులతో విభేదాలు ఏర్పడవచ్చు. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ వహించాలి. ఒక సమాచారం ఊరటనిస్తుంది. విద్యార్థులు, నిరుద్యోగుల యత్నాలు మందగిస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కాంట్రాక్టర్లకు నిరాశ. వ్యాపారాలలో పెట్టుబడులు ఆలస్యమవుతాయి. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు. పారిశ్రామికవేత్తల కృషి ఫలించదు. వారం మధ్యలో ఆకస్మిక ధనలాభం. వాహనయోగం. గులాబి, లేత ఎరుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి.

కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
ఇంతకాలం పడిన శ్రమ అనుకూలిస్తుంది. ముఖ్యమైన కార్యక్రమాలు విజయవంతంగా  పూర్తి చేస్తారు. సంఘంలో విశేష గౌరవం పొందుతారు. ముఖ్యుల నుంచి ఒక కీలక సమాచారం అందుతుంది. విద్యార్థులకు ఆశించిన  ఫలితాలు దక్కుతాయి. వాహనాలు, గృహం కొనుగోలు చేస్తారు. వ్యాపారులకు లాభాలు దక్కుతాయి. ఉద్యోగులకు పైస్థాయి నుంచి ప్రశంసలు. కళాకారులకు అవార్డులు, సన్మానాలు లభిస్తాయి. వారం మధ్యలో ఆస్తి వివాదాలు. వృథా ఖర్చులు. ఆకుపచ్చ, లేత ఎరుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశ్‌ స్తోత్రాలు పఠించండి.

తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
బంధువుల నుంచి శుభవార్తలు. రాబడి ఆశాజనకంగా ఉంటుంది. పనులు సజావుగా సాగుతాయి. వాక్చాతుర్యంతో అందర్నీ ఆకట్టుకుంటారు. మీ నిర్ణయాలు ధైర్యంగా వెల్లడిస్తారు. విద్యార్థులకు నూతన విద్యావకాశాలు. ఇంటి నిర్మాణాలు చేపట్టే వీలుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో అనుకూల మార్పులు ఉంటాయి. కళాకారులకు ప్రభుత్వం నుంచి ఆహ్వానాలు అందుతాయి. వారం ప్రారంభంలో అనుకోని ఖర్చులు. నీలం, పసుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. శివపంచాక్షరి పఠించండి. 

వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. నిరుద్యోగులకు  ఉద్యోగయోగం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తినిస్తుంది. వాహన, గృహయోగాలు. విద్యార్థులకు సంతోషకరమైన సమాచారం. మీ సత్తా చాటుకుని ముందడుగు వేస్తారు.  వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు రాగలవు. రాజకీయవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం మధ్యలో బంధువులతో తగాదాలు. ఆరోగ్యసమస్యలు. ఎరుపు, గులాబి రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి. 

ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
మిత్రులు, సన్నిహితులు మీ విజయాలకు సహకరిస్తారు. సంఘంలో మీమాటకు ఎదురుండదు. కుటుంబంతో ఉల్లాసంగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వాహనయోగం. మీ శ్రమ ఫలిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. వ్యాపారాలలో పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు ఉత్సాహాన్నిస్తాయి. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం చివరిలో  ఆస్తి వివాదాలు. అనారోగ్యం. గులాబి, లేత పసుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీఖడ్గమాల పఠించండి.

మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
మీ అవసరాలకు తగినంతగా డబ్బు అందుకుంటారు. అనుకున్న పనులు విజయవంతంగా సాగుతాయి. బంధువులతో వివాదాలు తీరి సఖ్యతతో మెలగుతారు. ఆరోగ్యపరమైన చికాకులు కొంత బాధిస్తాయి. ఆస్తి విషయాలలో ఒప్పందాలు. ఒక ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు అనుకూల  మార్పులు ఉండవచ్చు. పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో వృథా ఖర్చులు. మిత్రులతో కలహాలు. తెలుపు, నీలం రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించండి. 

కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. విచిత్ర సంఘటనలు ఎదురవుతాయి. కుటుంబసమస్యలు వేధిస్తాయి. అనారోగ్య సూచనలు. పరిస్థితులు అనుకూలించవు. నిరుద్యోగులు, విద్యార్థులకు శ్రమ తప్పదు. బంధువులను కలుసుకుంటారు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు అనుకోని బదిలీలు జరుగవచ్చు. కళాకారులకు విదేశీ పర్యటనలు వాయిదా. వారం చివరిలో శుభవార్తలు. వాహనయోగం. నలుపు, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. కనకధారా స్తోత్రాలు పఠించండి.

మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
రాబడి సంతృప్తినిస్తుంది. పనుల్లో పురోగతి సాధిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆరోగ్యం కొంత మందగిస్తుంది. తీర్థయాత్రలు చేస్తారు. కొన్ని వ్యవహారాలలో వ్యయప్రయాసలు ఎదుర్కొంటారు. విద్యార్థులు, నిరుద్యోగులకు శ్రమానంతరం విజయాలు సిద్ధిస్తాయి. ఒక సమాచారం నిరాశ కలిగిస్తుంది. వ్యాపార లావాదేవీలు మందగిస్తాయి. ఉద్యోగులకు మార్పులు తథ్యం. కళాకారులకు గందరగోళంగా ఉంటుంది. వారం ప్రారంభంలో విందువినోదాలు. శుభవార్తలు. గులాబి, లేత పసుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీస్తుతి మంచిది.
- సింహంభట్ల సుబ్బారావు జ్యోతిష్య పండితులు

టారో
4 ఫిబ్రవరి నుంచి  10 ఫిబ్రవరి, 2018 వరకు

మేషం (మార్చి 21 – ఏప్రిల్‌ 19)
ఈనెలంతా మీకు మంచి రోజులు కనిపిస్తున్నాయి. చాలాకాలంగా జీవితమంతా ఒక దగ్గర ఆగిపోయిందన్న ఆలోచన మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతోంది. ఈవారం ఈ ఆలోచనను దూరం చేసే ఓ మంచి అవకాశం మీ తలుపు తడుతుంది. ఆ అవకాశాన్ని జాగ్రత్తగా అందిపుచ్చుకోండి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అనవసర ఖర్చులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. కొత్త పెట్టుబడులకు దూరంగా ఉండండి. ప్రేమ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. మీ జీవితాన్ని మలుపుతిప్పే ఓ వ్యక్తిని ఈ నెల్లోనే కలుసుకుంటారు. 
కలిసివచ్చే రంగు : గులాబి 

వృషభం (ఏప్రిల్‌ 20 – మే 20)
చేపట్టిన పనులన్నీ మధ్యలోనే ఆపేస్తూ పోయే మీ వ్యవహార శైలి పూర్తిగా మారాల్సిన అవసరం ఉంది. ప్రేమ జీవితం మిమ్మల్ని నిత్యనూతనంగా ఉంచుతుంది. ప్రేమించే వ్యక్తి కోసం ఎక్కువ సమయం కేటాయిస్తారు. జీవితాశయం వైపుకు ఎలా అడుగులు వెయ్యాలా అని తీవ్రంగా ఆలోచిస్తారు. కొత్త భాష, కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఉత్సాహం ప్రదర్శిస్తారు. ఆర్థిక పరిస్థితి కొంత గందరగోళంగా ఉంటుంది. ఏ ఖర్చు చేసినా ఆచితూచి వ్యవహరించండి. మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే ఓ అవకాశాన్ని దూరం చేసుకోకండి. 
కలిసివచ్చే రంగు : ఆకుపచ్చ 

మిథునం (మే 21 – జూన్‌ 20)
చాలాకాలంగా మీ ప్రతిభకు తగ్గ అవకాశం కోసం ఎదురుచూస్తున్న మీకు, ఊహించని అవకాశం ఒకటి వచ్చిపడుతుంది. శక్తినంతా వెచ్చించి పనిచేయండి. ప్రేమ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. జీవితాశయం వైపుకు అడుగులు వేస్తారు. మీపై వచ్చే విమర్శలకు డీలాపడిపోకుండా ధైర్యంగా ముందుకెళ్లండి. ఆధ్యాత్మిక ఆలోచనలు చేస్తారు. కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది. కొత్త పెట్టుబడుల వైపు మొగ్గు చూపుతారు. 
కలిసివచ్చే రంగు : నీలం 

కర్కాటకం (జూన్‌ 21 – జూలై 22)
ఈవారం మీరు చేపట్టిన పనులన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. ఏ పని చేసినా మీ శక్తినంతా వెచ్చించి పనిచేయాలని ఆలోచిస్తారు. మీ జీవితానికి సంబంధించి ఓ కీలక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎప్పట్నుంచో మొదలుపెట్టాలనుకుంటున్న ఒక పని మరికొంత కాలం ఆలస్యం కావచ్చు. ప్రేమ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. మిమ్మల్ని ఇష్టపడేవారికి ఎక్కువ సమయం కేటాయిస్తారు. ఆర్థిక పరిస్థితి గతంలో కంటే బాగా మెరుగుపడుతుంది. 
కలిసివచ్చే రంగు : పసుపు 

సింహం (జూలై 23 – ఆగస్ట్‌ 22)
మీ ఆలోచనలు ఎప్పటికప్పుడు మారుతూ మిమ్మల్ని మీకు కొత్తగా పరిచయం చేస్తాయి. ప్రశాంతత గురించి ఎక్కువ ఆలోచిస్తారు. విహారయాత్రకు సన్నాహాలు చేసుకుంటారు. కొన్నాళ్లు అన్నింటికీ దూరంగా ఉంటూ మీకై  మీరు ఎక్కువ సమయం కేటాయించాలనుకుంటారు. ఒక కీలక విషయంలో బలమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అనవసరమైన బాధ్యతలను మీద వేస్కొని ఇబ్బంది పడిపోకండి. కొత్త పెట్టుబడులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ప్రేమ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. 
కలిసివచ్చే రంగు : వెండి 

కన్య (ఆగస్ట్‌ 23 – సెప్టెంబర్‌ 22)
ఈనెలలో వృత్తి జీవితంలో మీరు ఊహించని విజయాలు సాధిస్తారు. చాలాకాలంగా ఎదుర్కొంటున్న కష్టాలకు తెరపడే సమయం కూడా వచ్చేసింది. ఇకనుంచి మిమ్మల్ని మీరు కొత్తగా ఆవిష్కరించుకునే ప్రయత్నం చేస్తారు. మీకిష్టమైన ఓ వ్యక్తికి దూరమవ్వాల్సి వస్తుంది. అందుకు సిద్ధంగా ఉంటే మంచిది. ఈ నెల్లోనే ఒక కొత్త వ్యక్తిని కలుసుకుంటారు. ఆ వ్యక్తి మీ జీవితంలో ఓ కీలక మార్పుకు కారణమవుతారు. గతాన్ని గురించి ఎక్కువ ఆలోచించకుండా ముందుకెళ్లండి. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. 
కలిసివచ్చే రంగు : ఆకుపచ్చ 

తుల (సెప్టెంబర్‌ 23 – అక్టోబర్‌ 22)
చాలాకాలంగా మీరు విశ్రాంతి కోసం ఎదురుచూస్తున్నారు. దానికి ఇదే సరైన సమయం. కొద్దిరోజులు ప్రశాంతంగా ఎక్కడికైనా వెళ్లిపోయి కొత్తగా జీవితాన్ని మొదలుపెట్టే ఆలోచన చేస్తారు. అందుకు పరిస్థితులు బాగా అనుకూలిస్తాయి. కొత్త వ్యక్తులను కలుసుకుంటారు. వారితో ఈ ప్రయాణమంతా మళ్లీ మిమ్మల్ని మీకు కొత్తగా పరిచయం చేస్తుంది. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. జీవితంలో ఏది జరిగినా దానికో కారణం ఉండి తీరుతుందన్న విషయం బలంగా నమ్మండి. 
కలిసివచ్చే రంగు : కాషాయ 

వృశ్చికం (అక్టోబర్‌ 23 – నవంబర్‌ 21)
జీవితాశయం వైపుకు అడుగులు వేయాల్సిన సమయం ఇదేనని గ్రహిస్తారు. అందుకు మీరేం చెయ్యాలన్నది కూడా ఇప్పట్నుంచే ఆలోచిస్తే మంచిది. మీ వెన్నంటే ఉండి మీకు సలహాలిచ్చే ఓ వ్యక్తి మీకొక కొత్తదారిని చూపిస్తారు. ఆ దారిలో మిమ్మల్ని మీరు కొత్తగా ఆవిష్కరించుకుంటారు. మీ ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేసుకునే ఒక గొప్ప అవకాశం త్వరలోనే మీ తలుపు తడుతుంది. మీరిష్టపడ్డ వ్యక్తి కోసం ఎక్కువ సమయం కేటాయిస్తారు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. 
కలిసివచ్చే రంగు : కాషాయ 

ధనుస్సు (నవంబర్‌ 22 – డిసెంబర్‌ 21)
వృత్తి జీవితంలో ఈ నెల్లోనే ఓ కీలక మార్పు చోటుచేసుకోబోతోంది. మీరు ఎప్పట్నుంచో కోరుకుంటున్న ఒక కొత్త జీవితం ఈ మార్పుతోనే మొదలవుతుంది. అయితే ఈ కొత్త జీవితం మొదలవ్వడానికి ముందు కొద్దికాలం విశ్రాంతి కోరుకుంటారు. అందుకు ఏదైనా మీకిష్టమైన ప్రదేశానికి వెళ్లే ప్రయత్నం చేయండి. ప్రేమ జీవితం బాగుంటుంది. జీవిత భాగస్వామికి ఎక్కువ సమయం కేటాయిస్తారు. ఒక కొత్త వ్యక్తిని కలుసుకుంటారు. వారితో డబ్బుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. 
కలిసివచ్చే రంగు : చాకొలెట్‌ 

మకరం (డిసెంబర్‌ 22 – జనవరి 19)
ఈనెలంతా మీరు ఊహించనంత సంతోషంగా ఉంటారు. మీకిష్టమైన వ్యక్తులతో సరదాగా గడుపుతారు. స్నేహితులందరితో కలిసి చిన్నపాటి వేడుక కూడా చేసుకుంటారు. వృత్తి జీవితంలో మాత్రం కొన్ని ఒడిదుడుకులు తప్పవు. ఆందోళనకు గురికాకుండా మీ పని మీరు చేస్తూ ఉంటే అన్నీ సర్దుకుంటాయన్న విషయాన్ని బలంగా నమ్మండి. ప్రేమ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. మీలో ఏ కొద్దిపాటైనా అశాంతిగనక ఉంటే మీ భాగస్వామితో ఉన్న సమయాలు దాన్ని తుడిచిపెట్టేస్తాయి. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. 
కలిసివచ్చే రంగు : పసుపు 

కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18)
చాలాకాలంగా మీరు సమయాన్నంతా వృథా చేస్తూ వస్తున్నారన్న విషయం గుర్తించండి. ఇకనైనా పనిమీద శ్రద్ధపెట్టి ముందుకెళ్లండి. కొన్ని గొప్ప అవకాశాలు మీకు దగ్గరగా వచ్చి ఉన్నాయి. ఆ అవకాశాలను అందిపుచ్చుకునేందుకు మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి. మీ ఆలోచనా విధానంలో పూర్తి మార్పు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీ జీవిత భాగస్వామి ఇచ్చే సలహాలను పాటిస్తూ ఉండండి. అవి మీలో కొత్త ఉత్సాహాన్ని నింపేవే అని గ్రహించండి.  
కలిసివచ్చే రంగు : బూడిద

మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20)
ఈవారం మీకు అదృష్టం బాగా కలిసివస్తుంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. ఎప్పట్నుంచో కొనుగోలు చేయాలనుకున్న వస్తువులు ఇప్పుడు కొంటారు. ఇందుకోసం ఎక్కువ ఖర్చు చేశామనే ఇంకో ఆలోచన కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. ఒక గొప్ప అవకాశం ఈ నెల చివర్లో మీ తలుపు తడుతుంది. అప్పటికి ఆ అవకాశాన్ని అందిపుచ్చుకునేందుకు మిమ్మల్ని మీరు సిద్ధంగా ఉంచుకోండి. ప్రేమ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు తప్పవు.  
కలిసివచ్చే రంగు : తెలుపు 
- ఇన్సియా టారో అనలిస్ట్‌ 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top